ఆ సబ్జెక్ట్ బేసిక్ కాన్సెప్ట్ + దాని గురించి ఫ్యాక్ట్స్ + దాన్ని లోతుగా తెలుసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ = ఈ మూడూ కలిస్తే ఆ సబ్జెక్ట్ మీద ప్రావీణ్యత వస్తుంది.
మొట్టమొదటిదైన కాన్సెప్ట్ విషయానికి వస్తే.. ఆ సబ్జెక్ట్ గురించి ప్రాధమికమైన సూత్రాలు, థియరీలు, ఫార్ములాలపై లోతైన అవగాహన పెంచుకోండి.
ఫ్యాక్ట్స్ అనే రెండో దశలో.. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన కేస్ స్టడీస్, అందులో అనుసరించే టెక్నిక్స్, నిపుణులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఔపోసన పడితే ఎక్కడైనా దానిపై అనర్గళంగా మాట్లాడగలుగుతారు. మంచి గ్రిప్ లభిస్తుంది.
ఇక చివరిగా ప్రొసీజర్స్.. ప్రపంచంలో ప్రతీ దానికీ ఓ ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఉదా.కి.. ఒక అకౌంటెంట్ ఒక లెడ్జర్ రాసేటప్పుడు ఏ ఎంట్రీ ఏ ఖాతాలో వేయాలో తెలియాలి. అలాగే ఓ ప్రోగ్రామర్ ఓ if else స్టేట్మెంట్ రాసేటప్పుడు దాని సింటాక్స్ తెలియాలి. చివరకు ఒక వ్యక్తిని హెల్ప్ అడగడానికి కూడా ఓ ప్రొసీజర్ ఉంటుంది.. ఎలా సంబోధించాలి, ఎలా అడగాలి అన్నది. సో మీరు నేర్చుకునే సబ్జెక్ట్ గురించి ఆ ప్రొసీజర్స్ ఖచ్చితంగా తెలుసుకుని ఫాలో అవండి.
ఈ మూడూ చేస్తే ఏ సబ్జెక్ట్ అయినా తక్కువ టైమ్‌లో ప్రావీణ్యత లభిస్తుంది. ఈ క్లారిటీ లేక గందరగోళంగా నేర్చుకుని నాకు సబ్జెక్ట్ రావడం లేదని చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు.
Comments
Post a Comment