Skip to main content

నేటి మోటివేషన్... తల్లి ఋణం - తీర్చలేనిది




 ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని లక్ష బంగారు నాణాల సంచిని తల్లికి ఇస్తూ, ‘అమ్మా! ఈ నాణాలను తీసుకుని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో. దానితో నీ రుణం నుండి నాకు ముక్తి లభిస్తుంది’ అన్నాడు.
తల్లి నవ్వి ఊరుకుంది. 
కానీ, ఆ యువకుడు అదే మాటను మళ్ళీ మళ్ళీ చెప్పడంతో- తల్లి ఇలా అంది .. బిడ్డా, నా రుణం తీర్చుకోవాలీ అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు, 
నీవు ఒకరోజు రాత్రిపూట నా వద్ద పడుకో చాలు అంది.
ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు. 

అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయనా, దప్పికవుతోంది, నీళ్ళు తాగించు’ అంది.
కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో నీళ్ళిచ్చాడు.
రెండు గుటకలు వేసి గ్లాసును జారవిడిచింది. నీళ్ళుపడి పక్క తడిసిపోవడం చూసి ‘ఏమిటమ్మా ఇది’ అన్నాడు. ‘పొరపాటు అయిపోయింది నాయనా’ అంది తల్లి. కొడుకు మౌనంగా పడుకున్నాడు.

అతడికి కాస్త నిద్రపట్టగానే తల్లి మళ్ళీ లేపి ‘బిడ్డా! దప్పిక అవుతోంది, నీళ్ళు ఇవ్వు’ అంది. ‘ఇప్పుడే కదా నీళ్ళు తాగావు, ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా... పత్తి గింజలు ఏమైనా తిన్నావా?’ అంటూ చిరాగ్గా లేచి నీళ్ళు ఇచ్చాడు.

తల్లి మొదటి మాదిరిగానే ఒకటి రెండు గుటకలు వేసి నీటిని పక్కమీద ఒలకబోసింది. 
కొడుకు కోపంతో ‘అమ్మా, ఏమిటిది, పక్కంతా తడిపేశావు... కళ్ళు కనిపించట్లేదా’ అన్నాడు. ‘నాయనా! చీకటిగా ఉండటంతో గ్లాసు చేతినుండి జారిపోయింది’ అని చెప్పింది తల్లి. అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు. ‘అమ్మా! ఏమిటి... దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు. నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా’ అంటూ నీళ్ళు తీసుకువచ్చి ‘ఇదిగో తాగి చావు’ అన్నాడు.
తల్లి ఎప్పటిలాగానే ఓ గుక్క తాగి మిగిలిన నీళ్ళతో పక్కను తడిపేసింది. 
ఇది చూసిన కొడుకు ఇక సహించలేక .... 
అమ్మా !! బుద్ధుందా లేదా ఏమిటిది
 ఇలా వేధించడానికేనా నన్ను 
నీ మంచం మీద పడుకోమన్నావు? ఈ తడిబట్టల మీద ఎట్లా పడుకోవాలి? 
చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది... అందుకే ఇలా చంపుకు తింటున్నావు’ అంటూ ఆగ్రహంతో కేకలేశాడు. 

అప్పుడు తల్లి ..... 
బిడ్డా చాలించు. అరుపులు ఆపు. నా రుణం తీర్చుకుంటానన్నావు, తల్లి రుణం తీర్చుకోగలుగుతావా? నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తి, నిరంతర సేవ చేసినా మాతృ రుణం నుండి విముక్తుడవు కాలేవు. ఎందుకంటావా... 
నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజూ పక్కమీదే మల మూత్రాదులు చేసేవాడివి.

నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి, నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని. పక్కబట్టలను నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్నవైపు పడుకోబెట్టి నిద్రబుచ్చేదాన్ని. ఇలా ఒకరోజు కాదు, ఒక వారం కాదు, కొన్ని సంవత్సరాలపాటు- నీ అంతట నువ్వు వేరే పడుకోగలిగే వరకూ నేను ప్రతిరోజూ అలానే- ఎంతో ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని. కానీ నువ్వు ఒకటి రెండుసార్లు నీళ్ళతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే వీరంగం వేస్తున్నావు అంది తల్లి.

ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని ,అమ్మా! నా కళ్ళు తెరుచుకున్నాయి. బిడ్డలను కనిపెంచే క్రమంలో తల్లి పడే శ్రమకు ,ఆమె చేసే సేవలకు ,ఆమె త్యాగాలకు , కష్టానికి , సహనానికీ బదులు తీర్చుకోవడమన్నది ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు. నీ రుణం చెల్లించడం అసంభవం. నేనే కాదు, లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు’ అన్నాడు. 

మాతృ దేవోభవ 🙏🏼🙏🏼

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Post a Comment

Popular posts

TET and DSC Very important topics...

Lakshya Educational Groups

🎒బ్యాగ్ లేని రోజు (No Bag Day) – ఆనందభరిత అభ్యాస శనివారాలు (Joyful Learning Saturdays )

📖 పరిచయం SCERT ఆంధ్రప్రదేశ్ 2026–27 విద్యా సంవత్సర శిక్షణా ప్రణాళిక ప్రకారం "నో బ్యాగ్ డే" కార్యక్రమం విద్యార్థులకు పుస్తకాల భారం లేకుండా, ఆనందదాయకమైన, అనుభవాధారితమైన మరియు సృజనాత్మకమైన అభ్యాస అవకాశాలను కల్పించడానికి రూపొందించబడింది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం (NEP–2020) మరియు పునాది దశ జాతీయ పాఠ్య ప్రణాళిక (NCF-FS–2022) లక్ష్యాలకు అనుగుణంగా అమలవుతుంది. 🎯 కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు 📚 విద్యాపరమైన లక్ష్యాలు ✔ పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానం (FLN) బలోపేతం చేయడం ✔ భాషా వ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించడం ✔ పరిశీలన, తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయడం 🌱 సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ✔ సృజనాత్మకత పెంపొందించడం ✔ ఊహాశక్తి వికాసం ✔ సామాజిక-భావోద్వేగ నైపుణ్యాల అభివృద్ధి ✔ శారీరక దృఢత్వం ✔ బాధ్యత మరియు పౌరసత్వ విలువల పెంపకం 🔍 అనుభవాధారిత అభ్యాస లక్ష్యాలు ✔ జీవిత అనుభవాలతో విద్యను అనుసంధానం చేయడం ✔ పరిశోధనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ✔ చేతితో చేసే కార్యకలాపాల ద్వారా నేర్చుకోవడం 🎯 ఆశించిన ఫలితాలు (Expected Outcomes) 👦 విద్యార్థి స్థాయిలో వి...

⚡⚡Flash Flash Ap 10th సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి (SSC) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ఫలితాలను ప్రకటించనుంది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన  విద్యార్థులు కూడా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. https://resultsbie.ap.gov.in https://results.apcfss.in https://manabadi.co.in https://schools9.com  అభ్యర్థులు ఫలితాలను వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in మనమిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా పొందొచ్చు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలను సులభంగా చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవడం మంచిది. ఫలితాలు విడుదలైన ప్రారంభ సమయంలో ఒకేసారి ఎక్కువ మంది విద్యార్థులు వెబ్‌సైట్లను సందర్శించే అవకాశం ఉండటంతో కొంతసేపు వెబ్‌సైట్లు నెమ్మదిగా పనిచేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో కొద్దిసేపు వేచి ఉండి మళ్లీ ప్రయత్నించాలి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర గుర్తింప...