ఒక ఊరిలో కొంతమంది గొర్రెల కాపరులు ఉండేవారు వారందరూ రోజు ఉదయాన్నే మేతకు గొర్రెలను తోలుకొని అడవికి వెళ్లి సాయంత్రము ఇంటికి వచ్చేవారు.
ఒకరోజు బీరయ్య అనే కాపరి కొడుకు ఈరోజు నేను నీతో అడవికి వస్తాను అన్నాడు తండ్రితో, వద్దు నీకు అక్కడ ఏమీ తోచదు అన్నాడు తండ్రి.
ఎంత చెప్పినా వినక మారాం చేశాడు కొడుకు అప్పుడు సరే అని తన వెంట అడవికి తోలుకొని పోయాడు. కొంతసేపటి వరకు అడవిలోని చెట్లు పొలాలు పచ్చని పంటలు అన్నీ నచ్చాయి పిల్లవానికి.
తండ్రి కొడుకుతో గొర్రెలు చూసుకుంటూ చెట్టు కింద కూర్చోమని చెప్పి తన పనులు చేసుకుంటూ కొంత దూరం పోయాడు.
కొంతసేపటి తర్వాత పిల్లవాడికి ఏమీ తోచక ఏదైనా ఆటపట్టించాలని అనుకున్నాడు వెంటనే ఒక ఆలోచన చేశాడు నాన్న పులి, నాన్న పులి కాపాడండి అంటూ కేకలు వేశాడు.
ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న గొర్రెల కాపరులు కట్టెలు కొట్టుకొని పిల్లవాడి వద్దకు వచ్చారు ఏది పులి అన్నారు వారు పులి లేదు గి లీ లేదు అన్నాడు పిల్లవాడు తమాషాగా.
గొర్రెల కాపరులు అక్కడి నుండి వెళ్లిపోయారు కొంతసేపటి తర్వాత నాన్న పులి, నాన్న పులి అంటూ మరోసారి అరిచాడు.
మళ్లీ గొర్రెల కాపరులు పిల్లవాడి వద్దకు వచ్చారు ఏది పులి అని అడిగారు పులి లేదు గిలీ లేదు అన్నాడు మరోసారి నవ్వుతూ పిల్లవాడు సమాధానం చెప్పాడు.
వారు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత నిజంగానే పిల్లవాడి వద్దకు పులి వచ్చింది. పులిని చూసిన పిల్లవాడు నాన్న పులి, నాన్న పులి కాపాడండి అంటూ గట్టిగా అరిచాడు.
ఇప్పుడు కూడా ఆట పట్టించడానికి అనుకొని పిల్లవాని అరుపులు ఎవ్వరూ నమ్మలేదు అక్కడికి ఎవరూ రాలేదు పులి గొర్రె నేర్చుకుని పోయింది, పిల్లవాడు చెట్టెక్కాడు.
సాయంత్రం కాపరులు అందరూ ఇంటికి వెళ్లడానికి గొర్రెలను తోలుకొని పిల్లవాని వద్దకు పోయారు. పిల్లవాడు పులి వచ్చి గుర్రం ఎత్తుకుపోయిన విషయం కాపరులకు చెప్పాడు.
అప్పుడు కాపరులు పులి నిన్ను కూడా గాయ పరిచేది, నీవు రెండు సార్లు అబద్దం చెప్పావు కావున నిజం చెప్పినా మేము ఏవ్వరము నమ్మలేదు అందుకే రాలేదు.
ఎప్పుడు అబద్ధాలు చెప్పవద్దు అని పిల్లవాడిని మందలించారు.🍁
కథలోని నీతి:
ఒకసారి అబద్ధం చెబితే ఆపదలో నిజం చెప్పిన ఎవ్వరూ నమ్మరు.
Comments
Post a Comment