Skip to main content

నేటి మోటివేషన్... 💐నమ్మకం కథ💐



చాలాకాలం క్రితం ఒక పల్లెటూరు. ఆ ఊర్లో పాలు పెరుగు అమ్ముకునే పొట్టపోసుకునే ఇద్దరు యాదవమహిళలు ఉన్నారు. వారిదగ్గర ఉన్న చెరి రెండు ఆవుల పాలు,పెరుగు అమ్మేందుకు నగరానికి వెళ్లవలసి వచ్చేది 
నగరం చేరటానికి వారు ఓ నదిని దాటి వెళ్లేవారు అందుకు గాను ఆ పడవనడిపేవానికి కొంత పైకం ఇచ్చేవారు నగరంలో పాలు విక్రయించి తిరిగి ఇల్లు చేరేటప్పటికి సాయంత్రం అయ్యేది సొమ్ము చూస్తే వారు ఆరోజు తిన్న ఆహారానికి సరిపడగ మాత్రమే ఉండేది ఇదే వారి దినచర్య. ఆరకంగా ఆ గొల్లపడుచులు బాగా పేదరికంలో ఉండగా ……
                           ఒక రోజు ఆ ఊరికి ప్రవచనాలు చెప్పే ఓ స్వాములోరు వచ్చి గుడిలో ఏవో నాలుగు మంచిమాటలు చెపుతున్నారని తెలిసింది .వెళదామంటే పనిపాట్లతో కుదరక వెళ్ళలేకపోయారు .సరే మూడవరోజు ఎలా అయినా వెళ్లాలని గట్టిగా అనుకుని పెందలాడే పనులన్నీ ముగించుకుని సాయంత్రానికల్లా గుడి ఆవరణలోకి చేరుకున్నారు 
అప్పుడు ఆసాములోరు ఏవో మాటలు చెప్తూన్నారు కానీ బొత్తిగా చదువుకోని కారణంగా వీల్లకు ఒక్కముక్క అర్ధమయినట్టే లేదు 
                 ఆరోజు ప్రవచనాలలో స్వాములోరు ఓంకారం యొక్క గొప్పతనాన్ని, విశిష్టతను చెప్పారు ఇంతకు అందులో గొల్లపడుచులకు అర్థమయింది ఏమిటంటే ఓంకారం ఎంతో గొప్పది ,శక్తి వంతమైనదని. 
మరుసటి రోజు యధావిధిగా నగరానికి పయనమైన గొల్లభామలు నదిని దాటేందుకు నిరీక్షిస్తున్న సమయంలో పడవవాడు లేకపోవటంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూండగా….. నిన్న గుడి లో విన్న ఓంకారం యొక్క గొప్పతనం గుర్తువచ్చింది 
వెంటనే ఓంకారాన్ని జపిస్తూ నదిని దాటాలనుకున్నారు
ఓం…….ఓం….. అంటూ వడివడిగా అడుగులు వేస్తూ నదిని దాటి ఆవలివడ్డుకు చేరిపోయారు
ఈ విధంగా రోజు ఓంకార జపంతో నదిని దాటేయసాగారు. అందుకు గాను పడవవానికి ఇచ్చే పైసలు మిగలసాగాయి. దానితో వారు కాస్త సొమ్మును కొంచెం కొంచెం గా కూడబెట్టుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. 
              ఇదిలా ఉండగా 
ఒకనాడు ఈ గొల్లపడుచులకు ప్రవచనాలు చెప్పిన స్వామిజీ కనిపించారు. దానితో వీరు ఎంతో వినయంగా ఆ స్వామి వారికి నమస్కరించి మీ వలనే మేమీరోజు కాస్త డబ్బు కూడపెట్టుకుని ఆనందంగా ఉన్నామని విన్నవించారు,. మీరు చెప్పిన ఓంకారం మంత్రం వలనే మాకు నదినిదాటే పడవడబ్బులు మిగిలాయని చెప్పటంతో విస్తుపోయిన స్వామీజీ స్వయంగా వారు ఓం….. ఓం…. అనుకుంటూ నదిని దాటటం చూసి చాలా ఆశ్చర్యపోయాడు, తనుకూడా ఆవిధంగా చేయ ప్రయత్నించి నీల్లలో పడి మనిగిపోబోగా గొల్లపడుచులే రక్షించారు 
               అప్పుడు స్వామీజీ ఇలా ఆలోచించసాగాడు
నేను చెప్పిన మంత్రం నాకు పనిచేయలేదు కారణం దానిపై నాకున్న అపనమ్మకమే….., ఆ మంత్రం పట్ల పల్లె పడుచులకున్న దృఢ విశ్వాసమే వారిని నదిని దాటేలా చేసిందని అర్థమయింది 
            నీ విశ్వాసమే భగవంతుడు 🙏

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺