మానసిక ఒత్తిడి.
జీవితంలో మన సమస్యలనుపరిష్కరించుకోకపోతే,మనపై ఒత్తిడికలుగుతుంది.
జీవితంలో కష్టాలు,నష్టాలు వుంటాయి.సుఖాలు,సంతోషాలు వుంటాయి .దుఃఖాలు వుంటాయి.
జీవితంలో వీటినే లో ups and downs అంటారు.(ఆటూ,పోటూ) అంటారు. మనసు పై ఒత్తిడికలుగుతుంది. వీటిని ఏ విధంగా ఎదుర్కోవాలితద్వారా మనసు పై ఒత్తిడికలుగుతుంది.
ఈ ఒత్తిడిని దూరంగా వుంచ వచ్చు.
1.కష్టాలనుండి బయట పడలేక,భయం,ఆందోళన ,ఒత్తిడికి గురై,ఆత్మహత్య చేసుకోవడం.హా!మనం సమాజంలో చూస్తున్నాం.చదువులో వెనుక పడుతుంటే,తండ్రి తిట్టాడని,ప్రేమించిన అమ్మాయి,తిరస్కరించిందని,మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్నారు.
2.జీవితంలో రాజీపడి,కష్టాలు,సమస్యలనే ఊబి నుండి బయట పడలేక,జీవచ్ఛవాలుగా బ్రతికేయడం.తద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు,అనవసరంగా పిల్లలను కొట్టడం,బంధువులు,స్నేహితులతో ఘర్షణలు పడటం,త్రాగుడు,జూదంకు బానిస అవడం చూస్తున్నాము.
3.కష్టాలను,సమస్యలను మనోధైర్యంతో ,ఎదుర్కొని,మరిన్ని మంచి పరిష్కార మార్గాలకోసం దీర్ఘంగా ఆలోచించడం,పరిస్థితులను బాగా అవగాహన చేసుకోవడం అవసరం.కృషి చేయడం.ఏకాగ్రతతో ,దుర్భర పరిస్థితులను అధిగమించడం.ప్రగతి శీలకమైన ఆలోచనా సరళితో ,సమయాన్ని సద్వినియోగం చేసుకుని,పోగొట్టుకున్న దాన్ని వెదకి స్వంతం చేసుకుని ,విజయం సాధించడం.మన్ననలను పొందడం ,తన ఔన్నత్యాన్ని సమాజం ముందువుంచి మెప్పుపొందడం.అవసరమైనంత రిస్క్,(సాహసం) చేసి కష్టాలనుండి బయటపడి తమ ఔన్నత్యాన్ని నిరూపించుకుని మెప్పుపొందడం.
అలాంటి ప్రముఖు వ్యక్తులలో అబ్దుల్ కలాం గారు ముఖ్యులు.వారు యువతకు ఆదర్శప్రాయులు.
కలాంగారికి మంచి ఆశయం(ambition) వుండేది.కనుక ఆయన విజ్ఞానం కోసం కృషి చేసి సఫలీకృతులయ్యారు.మిసైల్ మేన్ గా గుర్తింపు పొందారు.దేశ అంబుల పధిని బలపరిచి ,దేశభక్తిని చాటుకున్నారు.దేశ ప్రధమ పౌరునిగా ఎదిగారు.గౌరవించ బడ్డారు.దేశ విద్యార్ధులకు చాలా అంశాలపై క్లారిటీ (స్పష్టత) నిచ్చారు.లక్ష్యాలను (targets) నిర్దేశించారు,లాజికల్ గా ఆలోచించడం నేర్పారు.దేశం మరువలేని సేవలు చేస్తూ ,విద్యార్ధుల మధ్యన ,వారికి స్పూర్తినిస్తూ స్వర్గస్థులైనారు.
ఆయనఆదర్శాలను స్పూర్తిగా ,యువత స్వీకరిస్తే ,విజయం సాధించడం జరుగుతుంది.యువతలో ఒత్తిడి వంటి సమస్యలకు దూరంగా వుంటూ,క్రమశిక్షణతో విజయపథం లో ముందుకు సాగుతారు.
Comments
Post a Comment