Skip to main content

Posts

కరెంట్ అఫైర్స్ - 26.12.2022 (Telugu / English)

1. ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డు 2022ను ఎవరు ప్రకటించారు? జ: సాహిత్య అకాడమీ 2. కళ-సాహిత్యం మరియు సామాజిక సహకారం కోసం సుదీప్ సేన్, శోభన కుమార్ మరియు సంజోయ్ కె రాయ్‌లకు ఏ అవార్డు లభించింది? జ: రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్య పురస్కారం 3. కింది వాటిలో రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ యొక్క మొబైల్ టవర్ మరియు ఫైబర్ ఆస్తులను ఏ కంపెనీ కొనుగోలు చేసింది? జ: రిలయన్స్ జియో 4. కింది వాటిలో ఏది "బెస్ట్ గ్లోబల్ కాంపిటేటివ్ పవర్ కంపెనీ" అవార్డును గెలుచుకుంది? జ: NHPC లిమిటెడ్ 5. భారతదేశం మరియు ఏ దేశ వైమానిక దళం మధ్య మొదటి ద్వైపాక్షిక వైమానిక పోరాట వ్యాయామం జనవరి 2023లో నిర్వహించబడుతుంది? జ: జపాన్ 6. ప్రఖ్యాత పరిశోధకుడు మరియు ఏ IIT ప్రొఫెసర్ ప్రదీప్ తలప్పిల్ 2022 విన్‌ఫ్యూచర్ ప్రత్యేక బహుమతిని అందుకున్నారు? జ: ఐఐటీ మద్రాస్ 7. కింది వాటిలో ఏ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మూడు కొత్త పథకాలను ప్రకటించారు? జ: జమ్మూ కాశ్మీర్ 8. ఈ ఫుట్‌బాల్ ప్లేయర్‌లలో ఎవరు 2022 సంవత్సరానికి BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌ను పొందారు? జ: బెత్ మీడ్ 1. Recently who has announced the Sahitya Akademi Award 2022? Ans: S...

Pumpkin seeds గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందో గుమ్మడికాయ గింజలలో కూడా అంతే పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్ లభిస్తాయి. గుమ్మడికాయ యొక్క చిన్న విత్తనాలు క్యాన్సర్ ,అధిక రక్తపోటు వంటి తీవ్రమైన సమస్యలను నయం చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వివిధ వ్యాధులకు గుమ్మడికాయ గింజల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. గుమ్మడికాయ విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఎ,విటమిన్ బి,విటమిన్ K,మరియు విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బీటా-కెరోటిన్ , భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం వంటి విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ,ఇది రోగనిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా మరియు వైరస్‌లతో పోరాడటానికి సహాపడుతుంది. గుమ్మడికాయ గింజల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది సమర్థవంతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు సౌందర్యాన్ని పెంచుతుంది అదనంగా, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. గుమ్మడికాయ గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక నివేదిక ప్రకారం, గుమ్మడికాయ గింజలలో ఫైబర్ ఎక్కువగా...

నేటి మోటివేషన్... పాము - కోతి

ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి. అలా...

నేటి మోటివేషన్... మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకొనేలా అవకాశం వస్తే

ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోష పరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన. పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు.  తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న.  పిల్లాడికి ఒక బొమ్మ నఛ్చి కొనిమ్మన్నాడు.  జేబులో ఉన్న డబ్బు చూసి , ఇంకొకటి కొందాం ,పద ముందుకు అన్నాడు నాన్న.  అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ , తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు.  పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది.  నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు. ఎందుకు తీసుకొచ్చినట్లు?  ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్తువుల మాటేమిటి అని నాన్న ఆందోళన...

నేటి మోటివేషన్... పశ్చాత్తాపం

ఒక స్థలం తక్కువధరకు వస్తోందని తెలిసి ప్రక్కనున్న ఊరికి కారులో  బయలుదేరి వెళ్ళి , తిరిగి ఇంటికి వస్తున్నాడు రఘు. దారి మధ్యలో కారు అకస్మాత్తుగా రిపేరుకి వచ్చి ఆగిపోయింది. రఘు ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు. మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎవరూ రాకపోవడంతో రఘుకు దాహం వేసి,  ప్రక్కనే పొలంలో ఉన్న మోటారు బావి దగ్గరకు వెళ్ళి........... అక్కడున్న ఒక వ్యక్తితో తాగడానికి మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు.అతను తాగేందుకు నీటిని ఇస్తూ............రఘు వివరాలను అడిగాడు. రఘు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పగానే............. అతను ఎంతో అభిమానంగా “ నువ్వు ఆయన కొడుకువా.............? ఇలా నీడలోకి వచ్చి కూర్చోవయ్యా............” అని  అక్కడున్న మంచాన్ని చూపించాడు. రఘు మంచంలో కూర్చోగానే, “ మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “ అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను తీసుకొని అక్కడికి వచ్చాడు. టవల్ తో చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు రఘు ఆశ్చర్యంగా చూస్తూ, “ మా నాన్న గారు మీకె...