Skip to main content

Posts

నేటి మోటివేషన్.... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...

నేటి మోటివేషన్.... మీ హాబీ ఏమిటి?

హీరో సల్మాన్‌ఖాన్‌ చక్కగా పెయింటింగ్స్‌ వేస్తాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ గిటార్‌ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్‌ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్‌లలో పాల్గొంటాడు. రతన్‌ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్‌ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్‌ ఫోన్‌ మూగబోతుంది.  బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు.  పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు.  మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్‌ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్‌ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్‌ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబ...

ఏపీలో ఇంజనీరింగ్‌లో సీటు .. ఏ ర్యాంక్‌కు ఎక్కడంటే

ఎంసెట్‌-2019 తుది దశ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌  కాలేజీ, బ్రాంచ్‌, కేటగిరీ వారీగా ఏ ర్యాంక్‌ వరకు సీటు  సమాచారాన్ని విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలి  సమాచారం కోసం Click here లో చూడొచ్చు 🍁🍃🍃🍃🌾🍃🍃🍃🍁 🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

HINDU - VOCABULARY♦️ --14.10.2020--

1. WORRISOME (ADJECTIVE): (चिंताजनक):  worrying Synonyms: daunting, alarming Antonyms: reassuring Example Sentence: The situation were becoming worrisome day be day. 2. CONCEDE (VERB): (स्वीकार करना):  admit Synonyms: acknowledge, accept Antonyms: deny Example Sentence: I had to concede that I overreacted at his behaviour. 3. CONVENE (VERB): (बुलाना):  summon Synonyms: call, order Antonyms: disperse Example Sentence: He had convened a secret meeting of military personnel. 4. SIGNIFICANTLY (ADVERB): (विशेषकर):  notably Synonyms: remarkably, outstandingly Antonyms: slightly Example Sentence: Energy bills have increased significantly this year. 5. TROUBLED (ADJECTIVE): (चिंतित):  anxious Synonyms: worried, concerned Antonyms: unworried Example Sentence: We felt very bad looking at her troubled face. 6. TERMINATE (VERB): (समाप्त करना):  end Synonyms: close, conclude Antonyms: begin Example Sentence: He was advised to terminate the contract. 7. REMOTE (ADJECTIVE...

నేటి మోటివేషన్... సత్యం ఎంత గొప్ప సంపదో

కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసర...