Skip to main content

నేటి మోటివేషన్... తల్లి ఉన్నప్పుడే ఆప్యాయంగా చూడండి...




ఒక కొడుకు తన తల్లిని ఇలా అడిగాడు.......

కొడుకు; అమ్మా! నాకు 18 సంవత్సరాలు వచ్చాక నాకేమిస్తావు?💘

ఆమ్మ; ఖచ్చితంగా మంచి బహుమతే ఇస్తాను......ముందు మంచిగా చదువుకుని
ప్రయోజకుడివి అవ్వు........ఇంకా చిన్నపిల్లవాడివేకదా!🌷

కొద్దిరోజులు గడిచింది.......ఆ అబ్బాయికి జబ్బుచేసింది.....డాక్టర్లు అతను బ్రతకడం కష్టం అని చెప్పేశారు......తల్లి తల్లడిల్లిపోయి తనబాధను తనలోనే దిగిమింగి బిడ్డదగ్గరికి వెళ్ళింది.......🌹

కొడుకు; నేను చనిపోతానా అమ్మా! నాకు జబ్బు నయంకాదా!

తల్లి; నీకు ఏమీ కాదురా! నేను ఉన్నంతవరకు నీకు ఏమీ కానివ్వను రా చిన్నా!
అంటూ బిడ్డను హత్తుకుని ఏడ్చింది.....😑🌹...

కొద్దిరోజులకు ఆ అబ్బాయికి జబ్బు నయం అయింది.......అతనికి 18 సంవత్సరాలు
రానే వచ్చాయి.........పుట్టిన రోజు ఆ అబ్బాయి తన తల్లి గదిలోకి వెళ్ళి తన అలమారాను వెతికాడు.......అక్కడ అతనికి ఓ ఉత్తరం కనిపించింది.......అందులో..🌹...

"బాబూ! నీకు పుట్టినరోజు శుభాకాంక్షలురా ! నీకు మాట ఇచ్చిన ప్రకారం నీకు నేనుబహుమతిని ఇవ్వాలి.........అది నీకు ఎప్పుడో ఇచ్చేశాననే💔 అనుకుంటున్నాను.......నీ ప్రాణానికి ముప్పు అని తెలిసి నేను బ్రతికి వుండటం వృద్ధా అనుకుని నీకు నా గుండెను ఇచ్చేశాను..నా హృదయాన్ని నీకు ఇచ్చేసి
నీవు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాను.....నీ గుండెలోనే నేను ఉన్నానురా!🤘🌹
ఇంతకంటే మంచి బహుమతిని నీకు ఇవ్వడానికి నేను కడు పేదదానిని రా కన్నా!
నీవు సంతో్షంగా ఉండటానికి,బ్రతికి ఉండటానికి వేరే మార్గంలేకపోయింది."🙏

తన తల్లి ఏదో ప్రమాదంలో చనిపోయిందని అనుకుంటున్న ఆ కొడుకుకు ఆ తల్లి
తనకోసం తన గుండెను దానంచేసిందన్న సంగతి తెలుసుకుని బోరు బోరున విలపిస్తూ......అమ్మా! నాకు ఎన్ని జన్మలెత్తినా నీవే తల్లిగా కావాలని దేవుడిని కోరుకుంటున్నాను..........నాగుండెలోనే నీవు నా దేవతగా నేను బ్రతికినంతకాలం నిన్ను పూజిస్తాను అమ్మా! అంటూ అమ్మ ఇచ్చిన గొప్ప బహుమతిని చేతితో తడుముకుంటూ ఉండిపోయాడు ఆ కొడుకు.......


దయచేసి తల్లి ఉన్నప్పుడే ఆమెను ఆప్యాయంగా చూసుకోండి.........ప్లీజ్.....

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📚 TET పరీక్ష రాస్తున్న ఉపాధ్యాయ మిత్రులకు ✨ NORMALIZATION గురించి సులభమైన అవగాహన ✨

ఒకే TET పరీక్షను వేర్వేరు షిఫ్ట్‌లలో నిర్వహించినప్పుడు, అన్ని షిఫ్ట్‌ల ప్రశ్నపత్రాలు అచ్చం ఒకే కష్టతర స్థాయిలో ఉండకపోవచ్చు. ఒక షిఫ్ట్‌లో ప్రశ్నలు కాస్త కఠినంగా ఉండవచ్చు. మరో షిఫ్ట్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండవచ్చు. ఇంకొక షిఫ్ట్‌లో ప్రశ్నలు కొంత సులభంగా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థుల పనితీరును న్యాయంగా పోల్చడానికి కొన్ని పరీక్షల్లో గణాంక ఆధారిత NORMALIZATION విధానాన్ని ఉపయోగిస్తారు. 🔹 NORMALIZATION అంటే ఏమిటి? వేర్వేరు షిఫ్ట్‌లలో వచ్చిన మార్కులను, ఆయా షిఫ్ట్‌ల ప్రశ్నపత్రం స్థాయి మరియు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఒక సాధారణ ప్రమాణానికి సర్దుబాటు చేసే ప్రక్రియను నార్మలైజేషన్ అంటారు. ఇందులో సాధారణంగా షిఫ్ట్ సగటు మార్కులు, Standard Deviation, అభ్యర్థి మార్కులు వంటి గణాంక అంశాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. 📌 ఒక సులభమైన ఊహాత్మక ఉదాహరణ: మూడు షిఫ్ట్‌లలో పరీక్ష జరిగిందని అనుకుందాం. 🔵 SHIFT–1 ప్రశ్నపత్రం కొంచెం కఠినంగా ఉంది. షిఫ్ట్ సగటు = 60 మార్కులు. అభ్యర్థి A = 75 మార్కులు. అంటే A తన షిఫ్ట్ సగటు కంటే 15 మార్కులు ఎక్కువ సాధించాడు. 🟢 SHIFT–2 ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది. షిఫ్...

🚨 SSC 2027 విద్యార్థులకు గుడ్ న్యూస్ – అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుద

📢 BSEAP SSC 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2027: అధికారిక మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) 2027లో నిర్వహించనున్న SSC (10వ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు మరియు సబ్జెక్టు వారీ బ్లూ ప్రింట్లను విడుదల చేసింది. ఈ మోడల్ పేపర్లు విద్యార్థులు తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రశ్నల నమూనాను తెలుసుకోవడానికి మరియు పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే బ్లూ ప్రింట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో ఏయే పాఠాలకు ఎంత వెయిటేజ్ ఉందో, ప్రశ్నల పంపిణీ ఎలా ఉంటుందో స్పష్టమైన అవగాహన పొందవచ్చు. విద్యార్థులు ఈ అధికారిక మోడల్ పేపర్లను సమయపాలనతో సాధన చేయడం ద్వారా పరీక్షలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు కూడా తరగతి బోధన, రివిజన్ ప్రణాళికలు మరియు ప్రాక్టీస్ పరీక్షలను రూపొందించడంలో వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విడుదలైన మోడల్ పేపర్లు ముఖ్యంగా: • తాజా పరీక్షా విధానాన్ని అర్థం చేసుకోవడానికి • ప్రశ్నల నమూనా మరియు మార్కుల పంపిణీ తెలుసుకోవడానికి • ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించడ...