ఒకభార్య తన భర్తను ఒక కొబ్బరికాయ కొనితేవల్సిందిగా కోరింది. ఇతడేమో డబ్బును అంత తేలిగ్గా విదిల్చేరకం కాదు.
బజారులో ఒక వ్యాపారిని అడిగాడు
కొబ్బరికాయ ధరెంత? అని. అతడు పది
రూపాయలు అన్నాడు. ఇది చాలా ఎక్కువ అనుకుని మరింత దూరం ముందుకు వెళ్లి మరొక వర్తకుడిని అడిగాడు. అతడు ఎనిమిది రూపాయలన్నాడు. ఈ ప్రదేశం అంతా
కొబ్బరి తోటలు ఎక్కువ. మరి కొంత దూరం నడిచాడు. అక్కడ కొబ్బరికాయలమ్మేవాడు కాయ ఐదుకే
ఇస్తానన్నాడు. అయినా ఇతడు తృప్తి చెందలేదు. ఇంకా చౌకగా ఎక్కడ దొరుకుతాయి? ఆ వర్తకుడినే అడిగాడు.
"ఇంకో రెండు మైళ్లు వెళితే తోట కనిపిస్తుంది. ఊరికె కోసుకోవచ్చు ఎవరూ
ఏమీ అనరు. " ఆ మాట విని చాలా సంతోషించి గబగబ నడిచాడు. తోట
చూసాడు. అటూ ఇటూ ఎవరూలేరు.
ఒక చెట్టు ఎక్కడానికి ప్రయత్నించి కాలు
జారిక్రింద పడ్డాడు. బాగా గాయాల
య్యాయి.
"ఎంత సమయం,ఎంత శక్తి వృధా చేసాను. ఇన్ని మైళ్లు నడిచినా ప్రయోజనం లేకుండాపోయింది. పైగా ఒళ్లు హూనమైంది. నాలాంటివారికి
మంచి గుణపాఠం. బాధతో కుంటుతూ
వెనుతిరిగాడు.
"గీచిగీచి బేరాలు చేసేవారికిది ఓ గుణపాఠం."
Comments
Post a Comment