Skip to main content

కరోనా సోకితే... ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయి?...


ఇప్పుడు దేశంతోపాటూ... ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముఖ్యమైన అంశం ఏదంటే... కరోనా వైరస్సే అని మనం చెప్పుకోవచ్చు. దానిపై మనం ఎన్నో వార్తలు చదువుతున్నాం. అది సోకితే చనిపోతారనే ప్రచారం బాగా సాగుతోంది. అది నిజంకాదు. ఇప్పటివరకూ ప్రపంచంలో కరోనా వైరస్ సోకిన వారిలో... 10 శాతం మంది మాత్రమే చనిపోయారు. అందువల్ల మనం భయాలను పక్కన పెట్టి... అసలా వైరస్ మన బాడీలో ప్రవేశిస్తే... ఏ రోజు ఏం చేస్తుందో, ఏ రోజు ఏయే లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. దీని వల్ల లాభమేంటంటే... అలాంటి లక్షణాలు మనకు కనిపిస్తే... వెంటనే అలర్ట్ అవ్వొచ్చు. ప్రారంభంలోనే వైరస్‌కి ట్రీట్‌మెంట్ తీసుకుంటే... అది నయం అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి.

డే 0 - వికారంగా అనిపిస్తుంది. దీనికి జీరో డే ఎందుకన్నానంటే... ఈ లక్షణం చాలా తక్కువ మందిలో కనిపిస్తోంది.

డే 1 - ముందు జ్వరం వస్తుంది. ఇది 24 గంటలు గడిచేటప్పటికి... ఇతర సమస్యల్ని పెంచుతుంది. (సో, జ్వరం వస్తే మీరు అలర్ట్ అవ్వాల్సిందే)

డే 2 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... ఈ మూడు లక్షణాలూ వచ్చేస్తాయి.

డే 3 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

డే 4 - అలసట, ఒళ్లునొప్పులు, పొడి దగ్గు... మరింత పెరుగుతాయి. జ్వరం కూడా పెరుగుతుంది.

డే 6 - డే 5 లాగే ఉంటూ... పరిస్థితి ఇంకొంచెం తీవ్రంగా ఉంటుంది.

డే 8 - ఈ సమయంలో... ARDS అనే సమస్య ఏర్పడుతుంది. అంటే... ఎక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. ఇది వస్తే చనిపోయే ప్రమాదం ఉంది. కాకపోతే అది చాలా తక్కువ. 2 శాతమే.

డే 9 - ARDS సమస్య మరింత పెరుగుతుంది.

డే 10 - పేషెంట్‌ని ICUలో చేర్చుతారు. పొట్టలో ఎక్కువ నొప్పి వస్తుంటుంది. ఆకలి వెయ్యదు. కొంత మంది మాత్రం చనిపోతుంటారు. ఇక్కడ కూడా చనిపోయేది 2 శాతమే.

డే 17 - మొదటి వారంలో ఆస్పత్రిలో చేరితే... రెండున్నర వారాల్లో రికవరీ అయ్యి... డిశ్చార్జి అయ్యే అవకాశాలు 82 శాతం ఉంటున్నాయి.
ఇలాంటి లక్షణాలు మనకు ఉండకూడదని అనుకుందాం. దురదృష్టం కొద్దీ ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే... మొదటి 5 రోజుల్లోనే వాళ్లను ఆస్పత్రిలో చేర్చితే... కచ్చితంగా బతికే అవకాశాలు 90 శాతం ఉంటాయి. అందుకు అందరం అలర్ట్‌గా ఉండాలి. అందర్ని గమనిస్తూ ఉంటే... అవసరమైన సమయంలో వాళ్లను అప్రమత్తం చెయ్యొచ్చు.

లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ

Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ