Skip to main content

నేటి మోటివేషన్... ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎందుకు ఎమోషన్లో కంట్రోల్ కోల్పోతాడో తెలుసుకోండి


ఆది మానవుడు గుహల్లో ఉండేటప్పుడు, అడవుల్లో వేటాడి బ్రతికేటప్పుడు మనిషి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఏదైనా జంతువు దాడి చేస్తే దానిపై తిరగబడడం లేదా పారిపోవడం (ఫైట్ లేదా ప్లెట్) స్పందనని సృష్టించే బ్రెయిన్లోని ఎమోషనల్ సెంటర్ అయిన అమిగ్డాలా అప్పట్లో ప్రధాన పాత్ర పోషించేది. ఏళ్ల తరబడి మానవ పరిణామ క్రమంలో ఇది మరింత బలోపేతం అవుతూ వచ్చింది.

ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు, సమాజాలు ఏర్పడడం, వంట చేసుకోవడం, భాషలు నేర్చుకోవడం వంటి కాగ్నిటివ్ స్కిల్స్ జీవనోపాధి కోసం అలవాటు చేసుకున్న కొద్దీ బ్రెయిన్ పరిమాణం పెరుగుతూ ప్రీ-ఫ్రాంటల్ కార్టక్స్ అనే బ్రెయిన్లోని ముందు భాగం డెవలప్ అయింది. అది లాజికల్ ప్రదేశంగా భావించబడుతుంది. మంచీ, చెడూ లాంటి విచక్షణ, నిర్ణయాలు తీసుకోవడం, విలువలు పాటించడం వంటివి దీని పనులు. మనిషి రిలాక్స్ ఉన్నప్పుడు తాపీగా ఏది మంచి ఏది చెడు అన్నది అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతాడు.

ఒక మనిషి ఇగోని మీరు హర్ట్ చేశారు అనుకోండి. అప్పుడు అతని మైండ్ దాన్ని ఆటవికకాలంలో జంతువులు ఎలా భౌతికంగా దాడి చేశాయో అలా స్వీకరిస్తుంది. అతను మీపై మాటలతో దాడి చెయ్యడం, అప్పటికీ అతని ఆవేశం తగ్గకపోతే చేయి చేసుకోవడం జరుగుతుంది. అంటే అమిగ్డాలా అనే ఎమోషనల్ సెంటర్ కొన్ని వేల సంవత్సరాలుగా బలోపేతం అయి ఉంది కాబట్టి, కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే డెవలప్ అయిన లాజికల్ బ్రెయిన్ కంటే అది రెచ్చగొట్టబడి మనిషి విజ్ఞత కోల్పోతాడు.

ఏ ఎమోషన్ అయినా 7 నిముషాల్లో సద్దుమణుగుతుంది. అప్పుడు అతను తాపీగా తన లాజికల్ బ్రెయిన్తో ఆలోచించి "అనవసరంగా మాట జారాను" అని బాధపడతాడు. ఎంత గొప్ప గొప్ప నాయకులైనా, గొప్ప బిజినెస్ లీడర్స్ అయినా, సామాన్యులైనా ఇలా ఎమోషనలైజ్ అవుతారు. అయితే ఆ ఎమోషన్ నుండీ, అది సృష్టించే గిల్ట్ నుండి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లు! దానికోసం మనం నిరంతరం మెడిటేషన్ లాంటి ప్రాక్టీస్లు చేయాలి.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺