ఒక వ్యక్తి పట్ల మనం వ్యక్తపరిచే ప్రతీ ఎమోషన్ చుట్టూ అనేక ఇతర నెగిటివ్ ఎమోషన్స్ చుట్టుముట్టి ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు చెబుతాను. వరుణ్ అనే ఓ ఫ్రెండ్ మీకు ఉన్నాడు అనుకుందాం. ఏదో ఒక సందర్భంలో మనసు గాయపడి ఈ విధంగా మీరు అనుకుని ఉండొచ్చు.. "వరుణ్ చాలా స్వార్థపరుడు, ఇక మీదట దూరంగా ఉండాలి". ఇలా మీరు అనుకున్న వెంటనే ఖచ్చితంగా ప్రతీ మనిషిలో దాగి ఉండే విమర్శకుడు తనని తాను విమర్శించుకుంటూ ఇలా రెస్పాండ్ అవుతాడు. "వరుణ్ పట్ల అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు, నేను మంచి స్నేహితుడిని కాదు" - ఇది ఒక వ్యక్తి తనని తాను అవమానించుకోవడం అవుతుంది. ఈ ఆలోచన వచ్చిన వెంటనే దానికి అనుబంధంగా మరో ఆలోచన వస్తుంది. " అసలు నేను ఎవరికీ మంచి ఫ్రెండ్‌గా ఉండలేను. ఎవరూ నన్ను పెద్దగా ఇష్టపడరు" అనే థాట్ వస్తుంది. దాంతోపాటే ఇతరులు మిమ్మలను దూరంగా పెట్టిన కొన్ని జ్ఞాపకాలు అప్పటికప్పుడు స్ఫురణకు వస్తాయి. ఇది డిప్రెషన్ కి సంబంధించిన థాట్ ప్రాసెస్. చివరిగా.. " నేను ఈ బాధను తట్టుకోలేను, అసలు ఇలాంటి మనుషులకు దూరంగా ఉంటే బెటర్.." అనుకుంటూ వేరే వ్యాపకంలో పడడం! - ఇది ఎస్కేపిజానికి సంబంధించిన...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...