Skip to main content

నేటి మోటివేషన్...


ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం
తొందరపడి ఎవరిని తక్కువగా అంచనా వేయకండి......
-------------------------
హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ దగ్గర జరిగిన ఒక సంఘటన.....
ఒక దంపతులు పార్వతి హార్వర్డ్  యూనివర్సిటీ ప్రెసిడెంట్ మీ కలవడానికి వచ్చారు...
 దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది.

ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరకి పంపడానికి ఆమె అంగీకరించలేదు.

 లేకపోతే, ఈ ముసలివాళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్తో పనేమిటి?

ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు.

“చెప్పండి, ఏం కావాలి?" అడిగాడు ప్రెసిడెంట్..

"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాం" చెప్పాడు ఆ ముసలాయన.

ప్రెసిడెంట్ కు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా
"ఎంత ఇవ్వాలనుకుంటున్నారు?" అన్నాడు.

"మా పదహారేళ్ల కొడుకు టైఫాయిడ్తో చనిపోయాడు.
వాడి జ్ఞాపకార్థం ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ" చెప్పింది వృద్ధురాలు.

 "ఎంత అవుతుంది?" అని చాలా క్యాజువల్గా అడిగాడు ముసలాయన,

"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించి  ప్రెసిడెంట్, ఆ బిల్డింగ్ కి అయ్యే ఖర్చు వివరాలు చెప్పాడు.

ముసలాయన ఆశ్చర్యపోయాడు. ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.

“అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే
ఎంతవుతుంది?' కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.

ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్.

ఆమె, భర్త వైపు తిరిగి అంది,
 “మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్!"

"సరే" అన్నాడు భర్త.

కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో  "స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.

ఆ దంపతులిద్దరూ "లేలాండ్ స్టాన్ఫోర్డ్",  "జేన్ స్టాన్ఫోర్డ్'..

ఒక్కోసారి మనం ఎదుటివారిని ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది.

ఎదుటివాళ్ల దుస్తులను బట్టి, కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయాణించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ల స్థాయిని లెక్కగడుతుంటాం.

రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడివున్నది, ఎవరైనా కావొచ్చు. వాళ్లను మీకంటే గొప్పవాళ్లుగా భావించకపోయినా ఫర్లేదు..
కానీ ... తక్కువ వాళ్లని మాత్రం అనుకోవద్దు.

ఎందుకంటే, పూర్వం మన పాత కథల్లో కూడా దేవుడో, మహారాజులో మారువేషాల్లో వచ్చేవారు.

 దేవుళ్ళలో
మనుషుల్ని చూసుకునే అవసరం మనకు లేకపోయినా,

మనుషుల్లో దైవత్వం చూసే అవకాశం దేవుడు ఎప్పుడూ మనకు కల్పిస్తూనే ఉంటాడు.

సాయం చేసే వాడే దేవుడు,

సాయం అందించే చోటే దేవాలయం
                 🌸శుభోదయం🌸

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

TET అభ్యర్థులకు ఉపయోగకరమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్

TET పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ మాక్ టెస్ట్ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు ఎన్ని సార్లైనా పరీక్ష రాయవచ్చు. ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం రూపొందించబడటం దీని ప్రత్యేకత. ఈ మాక్ టెస్టులు విస్తృతమైన ప్రశ్నల బ్యాంక్ ఆధారంగా రూపొందించబడుతున్నందున, ప్రతి పరీక్షలో భిన్నమైన ప్రశ్నలు ఎదురవుతాయి. దీనివల్ల ఒకే రకమైన ప్రశ్నలు పదేపదే రావడం తగ్గి, అభ్యర్థులు వివిధ అంశాలపై మెరుగైన అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం ద్వారా: • అపరిమిత సంఖ్యలో మాక్ టెస్టులు రాయవచ్చు. • ప్రతి ప్రయత్నంలో కొత్త ప్రశ్నాపత్రం లభిస్తుంది. • విభిన్న అంశాలపై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. • పరీక్షా సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. • మీ బలాలు, బలహీనతలను గుర్తించి వాటిపై మరింత దృష్టి పెట్టవచ్చు. • కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు అలవాటు పడేందుకు ఇది ఉపయోగపడుతుంది. • కంప్యూటర్ వినియోగంలో అనుభవం తక్కువగా ఉన్న అభ్యర్థులు కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నిరంతరంగా మాక్ టెస్టులు రాయడం ద్వారా పరీక్షా భయం తగ్గి, నిజమైన TET పరీక్షలో ...

AP 2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు

2026-27 TEXT Books New అప్లోడ్ చేశారు.  https://cse.ap.gov.in/loadacademictextbookpublicview?random=0.6384777802675639 Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺