🔥పాలకోడేటి శ్యామలాంబ🔥*
*💐పాలకోడేటి శ్యామలాంబ (జూన్ 12, 1902 - జూన్ 18, 1953) స్వాతంత్ర్యసమరయోధురాలు.*
*🔹జననం🔹*
*💕శ్యామలంబ జూన్ 12 , 1902లో కైకలూరులో దుగ్గిరాల వియ్యన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించినది. ఈమె భర్త సూర్యప్రకాశరావు కూడా స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, ప్రేమజ్యోతి అనే పత్రికాసంపాదకుడు. ఈమె బావ డాక్టర్ గురుమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ పురపాలక సంఘ సభ్యుడు, అనేక సహకార సంస్థలను స్థాపించాడు.[1]*
*శ్యామలాంబ 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో ఏడు నెలల పాటు, 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొని ఆరు నెలల పాటు జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది. ముఖ్యంగా యువతలో దేశభక్తి పెంపొందించి స్వాతంత్య్ర ఉద్యమం వైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించింది. 1946 నుండి 1953 వరకు రాజమండ్రి పురపాలక సంఘ సభ్యురాలిగా రాజమండ్రి నగర పారిశుధ్యంపై శ్రద్ధ వహించినది. ఈమె, ఈమె భర్త ప్రకాశరావు ఒకేసారి రాజమండ్రి కౌన్సిలర్లుగా ఎన్నుకోబడ్డారు*
*🎍మరణం🎍*
*🌺శ్యామలాంబ 1953, జూన్ 18 న మరణించినది. ఈమె విగ్రహాన్ని రాజమండ్రిలోని పాల్‌చౌకులో ఉన్న సాతంత్ర్యసమరయోధుల పార్కులో ఆవిష్కరించారు*.
*🔥హరిలాల్ గాంధీ🔥*
*హరిలాల్ గాంధీ "మహాత్మా గాంధీ" యొక్క పెద్ద కుమారుడు*
*🎍హరిలాల్ మోహనదాస్ గాంధీ (హిందీ: हरीलाल गांधी), (1888 – జూన్ 18 1948) మహాత్మా గాంధీ, కస్తూరిబాయి గాంధీ ల యొక్క ప్రథమ పుత్రుడు*
*జననం*
1888
*మరణం*
జూన్ 18 1948 (వయస్సు 52 సం.లు)
ముంబై, భారత దేశము
*మతం*
హిందూ మతము
*జీవిత భాగస్వామి*
గూలబ్ గాంధీ
*పిల్లలు*
ఐదుగురు పిల్లలు
*తల్లిదండ్రులు*
మహాత్మా గాంధీ
కస్తూరిబాయి గాంధీ
*🥀ప్రారంభ జీవితం🥀*
*హరిలాల్ గాంధీ ఆయన తండ్రి లాగానే బారిష్టర్ చేయుటకు ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నాడు. ఆయన తండ్రి దానికి వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుటకు పశ్చిమదేశాల విద్య ఏ విధంగానూ దోహదపడదని తెలియజేశాడు.[2] చివరికి, తన తండ్రి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 1911 లో హరిలాల్ గాంధీ అన్ని కుటుంబ సంబంధాలు పరిపరిత్యజించారు*
*ఆయన కొద్దికాలం ఇస్లాం మతానికి మారి తన పేరును "అబ్దుల్లా గాంధీ"గా మార్చుకున్నారు. కానీ తర్వాత కాలంలో ఆయన హిందూ మతానికి చెందిన ఆర్య సమాజం లోనికి మతమార్పిడి చేసుకున్నారు*
*హరిలాల్ గులాబ్ గాంధీ ని వివాహం చేసుకున్నారు. వారికి ఐదుగురు పిల్లలు. వారిలో ఇద్దరు బాల్యంలోనే మరణించారు. హరిలాల్ గాంధీ యొక్క పెద్ద కుమార్తె "ఆమిబెహిన్" గారి కుమార్తె నీలం పారిఖ్ ఆయన జీవిత చరిత్రను రచించారు. దానిపేరు "గాంధీజీ లాస్ట్ జ్యూయల్:హరిలాల్ గాంధీ" (గాంధీజీ హరిలాల్ గాంధీలాంటి వజ్రాన్ని కోల్పోయాడు)*
*ఆయన మహాత్మాగాంధీ యొక్క అంత్య క్రియలకు హాజరైనాడు. ఆయనను అతి కొద్దిమంది గుర్తించారు. ఆయన జూన్ 18 1948లో లివర్ కాన్సర్ వ్యాధితో బొంబాయి లోని మ్యునిసిపల్ హాస్పటల్ లో మరణించారు*
*🔹నా తండ్రి, గాంధీ🔹*
*💕మహాత్మాగాంధీ, హరిలాల్ గాంధీ మధ్య గల వైరుద్య సంబధాన్ని కథాంశంగా హిందీలో అనిల్ కపూర్ నిర్మాతగా, ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వంలో గాంధీ,మై ఫాదర్ అనే చిత్రం నిర్మాణమై ఆగష్టు 3 2007లో విడుదలైంది. ఈ చిత్రంలో హరిలాల్ పాత్రను "అక్షయ ఖన్నా" పోషించారు. ఖాన్ యొక్క నాటకం మహాత్మా vs గాంధీ, [5] పై చిత్రానికి వైవిధ్యంగా ఉంటుంది కానీ కథాంశం ఒక్కటే.అదే విధంగా మరాఠీ చిత్రం "గాంధీ విరుధ్ గాంధీ" కూడా విడుదలైంది.*
*🔥వేదము వేంకటరాయ శాస్త్రి🔥*
*రచయిత, కవి*
*💐వేదము వేంకట రాయశాస్త్రి (డిసెంబర్ 21, 1853[1] - జూన్ 18, 1929) సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త*
*జననం*
వేదము వేంకటరాయ శాస్త్రి
డిసెంబర్ 21, 1853
*మరణం*
జూన్ 18, 1929
*ప్రసిద్ధి*
సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు , నాటకకర్త
*తండ్రి*
వేంకట రమణశాస్త్రి
*తల్లి*
లక్ష్మమ్మ
*🔹జీవిత సంగ్రహం🔹*
*🥀ఇతడు వేంకట రమణశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు చెన్నైలో జన్మించారు. ఈయన 1886లో మద్రాసు క్రైస్తవ కళాశాలలో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు. 1887లో బి.ఎ. పరీక్షలలో ఆంగ్లం, సంస్కృతం లలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. 1916లో సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ప్రధాన సంపాదకుడుగా కొంతకాలం పనిచేశారు*.
*వెంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషావాది. సాహిత్య ప్రక్రియల్లో వ్యవహారిక భాషా ప్రయోగాన్ని విమర్శించారు. ఈయన 1899లో తెలుగు భాషాభిమాని నాటక సమాజాన్ని స్థాపించారు. ఈ సంస్థలో వెంకటరాయ శాస్త్రి వ్రాసిన నాటకాలని ప్రదర్శించేవారు. ఈయన మూల నాటకాలలో 1897లో వ్రాసిన ప్రతాపరుద్రీయ నాటకం, 1901లో వ్రాసిన ఉషా నాటకం ప్రముఖమైనవి[2] ఇవేకాక ఈయన అనేక సంస్కృత నాటకాలను తెనుగించారు.[3] వెంకటరాయ శాస్త్రి 1929, జూన్ 18న తెల్లవారు జామున 5:45కు మద్రాసులో మరణించారు*.
*వెంకటరాయ శాస్త్రి 1895లో హర్షుని నాగానందం తెనుగించి అందులోని నీచపాత్రల సంభాషణలకు వ్యవహారిక భాషను ఉపయోగించారు. ఈ ప్రయోగం సంస్కృత నాటకాల్లో నీచ పాత్రలకు ప్రాకృతాన్ని ఉపయోగించడం లాంటిదేనని సమర్ధించుకున్నారు. కానీ ఆనాటి సాంప్రదాయవాద సాహితీకారులు ఇది భాషాపతనం, సాహితీవిలువల దిగజారుడు అని విమర్శించారు. ఇందువలన సాహిత్యానికి జరిగిన నష్టాన్ని చర్చించడానికి పండితులు 1898 డిసెంబరులో మద్రాసులో సమావేశమయ్యారు. ఒకవైపు ఇలా విమర్శకులు విమర్శిస్తూ ఉండగానే, శాస్త్రి పంథాను అనేకమంది సృజనాత్మక సాహితీకారులు అనుకరించారు*
*గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమాన్ని ప్రోత్సహించినవారు.1899 లో ఆంధ్ర భాషాభిమాన నాటక సమాజాన్ని స్థాపించారు. ఇతడు తెలుగులోకి అనువదించిన సంస్కృత నాటకాలు : హర్షుని నాగానందం (1891), అభిజ్ఞాన శాకుంతలం (1896), మాళవికాగ్నిమిత్రం (1919), ఉత్తర రామచరితం (1920), విక్రమోర్వశీయం, రత్నావళి (1921), ప్రతాపరుద్రీయం (1897), (ఇది ఓరుగల్లు ప్రభువైన,రెండవ ప్రతాపరుద్రుని జీవితంలోజరిగిన కొన్ని చారిత్రాత్మక నిజమైన సంఘటనల ఆధారంగా వ్రాసిన గొప్ప నాటకం) ఇంకా ఉషానాటకం (1901), బొబ్బిలి యుద్ధం (1916) ఇతడు వ్రాసిన నాటకాలు*.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments
Post a Comment