Skip to main content

జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?..


♦తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించినట్లేనా? తమిళనాడులో గతంలో ఇదే తరహాలో చేస్తే ఏం జరిగింది?

♦సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇకపై ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆర్టీసీలో ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని, త్వరలోనే మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.

♦ఈ నిర్ణయంపై ఎలాంటి జీవో విడుదల కానప్పటికీ సీఎం ప్రకటన సంచలనంగా మారింది.

♦అయితే, సీఎం ప్రకటనతో సమ్మె చేస్తున్నవారంతా ఉద్యోగాలు కోల్పోయినట్లేనా? కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


♦తమిళనాడులో ఏం జరిగింది?
జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003 జులై 1న ఆ రాష్ట్రంలోని టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. సచివాలయ సిబ్బంది సైతం ఈ సమ్మెలో పాల్గొన్నారు.

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన బాట పట్టారు. సమ్మె మొదలైన నాల్గో రోజే జయలలిత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

♦టీఎన్ ఎస్మా (తమిళనాడు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ ఆక్ట్) కింద సమ్మె చేసిన 1.70 లక్షల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

♦ఇందుకోసం అత్యవసరంగా ఐదు ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. ఎస్మా కింద వేలాది మంది ఉద్యోగులను అరెస్టు చేసింది.

ఈ సంచలన నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగ సంఘాలు రెండుగా చీలిపోయాయి. కొందరు ఉద్యోగులు ఈ నిర్ణయంతో గుండెపోటుకు గురై మరణించారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొన్ని ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి.

♦ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే హక్కు లేదు: సుప్రీం ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.

♦ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే నైతిక హక్కు లేదని, అయితే, మానవతా దృక్పథంతో ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.

♦''ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాలను స్తంభింపజేసే హక్కు రాజకీయ పార్టీలు లేదా సంస్థలకు లేదు'' అని జస్టిస్ ఎంబీ షా, జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.

♦కార్మిక సంఘాలకు యాజమాన్యంతో బేరసారాలు సాగించే హక్కు ఉన్నప్పటికీ సమ్మె చేసే హక్కు లేదని జస్టిస్ ఎంబీ షా పేర్కొన్నారు.

♦సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో సమ్మెలో పాల్గొన్నవారిలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెబుతూ, మళ్లీ సమ్మెకు దిగమని ప్రమాణపత్రం దాఖలు చేసిన 1,56,106 మంది ఉద్యోగులను ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంది.

♦తమిళనాడు ఆర్టీసీ సమ్మెపై మద్రాసు కోర్టు తీర్పు ఏమిటంటే..
తమిళనాడు ఆర్టీసీ యూనియన్ 2018లో సమ్మెకు దిగినప్పుడు విధులకు హాజరుకానివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

♦సమ్మెపై ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. దీన్ని విచారించిన మద్రాసు హైకోర్టు.. తమ అనుమతి లేకుండా సమ్మె చేస్తున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించరాదని స్పష్టం చేసింది.

♦కార్మికులకు నిరసన తెలిపే హక్కు ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు వెళ్లే ఉద్యోగులకు ఇది వర్తించదని పేర్కొంది.

*ఇండస్ట్రియల్‌ డిస్‌ప్యూట్‌ యాక్ట్‌ - 1947 సమ్మె గురించి నిర్వచించింది.*

♦ఇందులోని సెక్షన్ 2 (క్యూ) సమ్మె అనే పదాన్ని నిర్వచిస్తుంది. దీని ప్రకారం సమ్మె అంటే ఏదైనా పరిశ్రమలో పనిచేసే కార్మికులు సంఘటితంగా పనులు నిలిపివేయడం, కొనసాగించడం చేయవచ్చు.

♦సెక్షన్ 22 (1) ప్రకారం సమ్మె అనేది చట్టం చెప్పిన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే ఆ సమ్మెను చట్టవిరుద్ధంగా భావించవచ్చు.

♦ఈ చట్టం సమ్మె హక్కులపై కొన్ని ఆంక్షలను విధించింది. కాంట్రాక్టును ఉల్లంఘిస్తూ ప్రజా సంబంధిత సేవా సంస్థల్లో పనిచేసే ఏ వ్యక్తి ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు దిగకూడదని పేర్కొంది.

♦సమ్మెపై వివిధ సందర్భాల్లో కోర్టు తీర్పులు...
బీఆర్ సింగ్ vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ అహ్మదీ తీర్పునిస్తూ ''తగినంత సభ్యత్వ బలం కలిగిన కార్మిక సంఘాలు తమ డిమాండ్ల కోసం యాజమాన్యంతో బేరసారాలు జరపవచ్చు. విధులకు హాజరు కాకపోవడం, సమ్మె చేయడం తదితర రూపాల్లో ఆందోళన చేయొచ్చు. దీనిని దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు గుర్తించాయి'' అని పేర్కొన్నారు.

♦తమిళనాడు ఉపాధ్యాయ జేఏసీ 2019లో సమ్మె చేసినప్పుడు దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు... ''సమ్మె చట్టవిరుద్ధం కాదు. సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వం ఆ పని చేయనప్పుడు సహజంగానే ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తుంటారు'' అని వ్యాఖ్యానించింది.

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

  1. పండుగ వేల సమ్మె కరెక్టు కాదు

    ReplyDelete

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... అనుబంధం....

ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి  సంతకు వెళ్ళాడు.  గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు.  గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు.  చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు.  ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు.  టోపి కాస్తా నదిలో పడింది.  దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు.  అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు.  అయ్యో పాపం అని బాధపడ్డారు.  "నీకివాల ఉపవాసమే" అన్నాడొకడు.  పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకోకడు.  "నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు "అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు.  వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు.  వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా!  వచ్చినావా అంది ఆప్యాయంగా.  వాడు జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు.  వేటగాడు : "గుర్రం ధరకు పలకకపోతే ఆవుకి మారకం వేశా "అన్నాడు. భార్య : "మంచి పని చేశావు మావా పాలు తాగవచ్చు" వేట...

August 13th Evening top 15bits... try to answer my friends...

1. చైనాలో మొదటి సారిగా భారతదేశం బ్యాంకు శాఖను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది 2. మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు?  3. ప్రపంచ పుస్తక దినోత్సవం ఎప్పుడు?  4. మొట్ట మొదటి సంస్కృత శిలాశాసనం ఏది?  5. మృచ్ఛకటి రచయిత ఎవరు?  6. అశోక స్థూపంను ఢిల్లీకి తెచ్చిన సొంతం ఎవరు?  7. కబీర్ సమకాలీనుడు ఎవరు?  8. మహారాష్ట్రలో ప్రార్ధన సమాజ్ నిర్మాణమునకు ముఖ్య కర్త ఎవరు?  9. గో బ్యాక్ టు వేదాస్ అను ధర్మసూత్రం ప్రతిపాదించినది ఎవరు?  10. అఖిలభారత కర్షక సంస్థ,  అఖిల భారత కిసాన్ సభ లోని మొట్టమొదట స్థాపించిన సంవత్సరం ఎప్పుడు?  11. కొత్తగా ఢిల్లీ భారతదేశంకు రాజధాని అయిన సంవత్సరం ఎప్పుడు?  12. భారత స్వాతంత్ర్య బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి,   బ్రిటిష్ పార్లమెంటునందు  ఆమోదం పొందిన తేది ఎప్పుడు?  13. "బైపో  హిమనీనంద" ఉన్న పర్వత శ్రేణి ఏది?  14. ఆరావళి పర్వతాలలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?  15. వెంబనాడ్ మరియు లోకథక్ సరసలు ఉన్న  రాష్ట్రాలు ఏవి? Answers...   1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2. వి. కొరియన్ 3. ఏప్రిల్ 23 4. ఉత్తరం మేరూ...