పాఠశాల అసెంబ్లీ నేటి వార్తలు > విలీనం చేసే వరకు పోరాటం ఆగదు.‘సకల జనభేరి’సభలో స్పష్టం చేసిన కార్మికులు: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వహించిన ‘సకల జన భేరి’ సభ విజయవంతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని కార్మికులు నినదించారు > బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?: ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురా నున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. > గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి: సరూర్‌నగర్‌లో నిర్వహించిన సకల జనభేరి సభకు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందారు. కరీంనగర్-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ సరూర్‌నగర్ సభకు వచ్చారు. అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో సహచరులు సమీపంలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే డ్రైవర్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. > ఒక రోజు పోలీసు కమిషనర్‌గా రమ్య. క్యాన
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...