Skip to main content

పులుల గణన నివేదిక విడుదల...

*పులుల గణన నివేదిక విడుదల*



*🐯దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదిక ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా-2018’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ పులుల దినోత్సవమైన జూలై 29న విడుదల చేశారు.కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్‌టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.*

*👉నివేదిక ప్రకారం పులుల సంఖ్య సంవత్సరాల వారీగా...*

2006   1,411

2010    1,706

2014    2,226

2018    2,967

*👉పులులు అధికంగా ఉన్న రాష్ట్రాలు*

1. మధ్యప్రదేశ్    526

2. కర్ణాటక.         524

3. ఉత్తరాఖండ్.   442

4. మహారాష్ట్ర.   312

5. తమిళనాడు.  264

*👉పులుల గణన నివేదికలోని అంశాలు...*

*♦దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది.*
*జి సైదేశ్వర రావు*

*👉మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి.*

 *👉2014 నాటికి ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్‌లో 68 పులులు ఉన్నాయి.*

*👉2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి.*

*👉తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది.*

*👉పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది.*

*👉2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగింది.*

*👉ఎం-స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను లెక్కించడం జరిగింది.*

*👉పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించడం జరిగింది.*

*👉సర్వే సాగిందిలా...*

*👉సర్వే చేసిన అటవీ విస్తీర్ణం - 3,81,400 చదరపు కిలో మీటర్లు.*

*👉ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు - 27,000*

*👉తీసిన ఫొటోలు - 3.48 కోట్లు*

*🐯పులులు కనిపించిన ఫొటోలు - 77,000*

*🐯పులుల జాడలను గుర్తించేందుకు సిబ్బంది నడిచిన దూరం - 5,22,996 కిలో మీటర్లు*

*👉సమాచారం సేకరించిన అటవీ డివిజన్లు - 491*

*👉పులుల గణనలో పాల్గొన్న సిబ్బంది సంఖ్య - 44,000*

*🐯నాలుగేళ్ల ముందే రెట్టింపు చేశాం🐯

🐯పులులు గణన నివేదిక విడుదల సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు.

Comments

Popular posts

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

TET and DSC Very important topics...

Lakshya Educational Groups