Skip to main content

నేటి మోటివేషన్...


📚స్ఫూర్తి దాయకమైన ఆర్టికల్..

ఆశయం ఉంటే గమ్యం అసాధ్యమేమీకకాదు...

సంకల్పం ముందు పేదరికమైనా, అంధత్వమైనా అవిటితనమైన తలవంచుతుంది..

లక్ష్యం ముందు ఆర్థిక ఇబ్బందులు,సామాజిక నేపధ్యం బలాదూరే...

ఓ పాత గోనె సంచుల వ్యాపారి, ఓసామాన్య గృహిణి దంపతుల    కుమారుడు , కేవలం గ్రామీణ నేపధ్యం ఉన్న కుర్రాడు అందునా పుట్టుకతో అంధత్వం ఉన్న ఓ అబ్బాయి ఏకంగా  ఐఏఎస్‌ లో 457వ ర్యాంకు సాధించి  కలెక్టర్‌ అయ్యారు... అవును మీరు చదివింది 100%నిజం -

అన్ని అవయవాలు  సక్రమంగా ఉండి ,ఆర్థిక ఇబ్బందులు లేని ,  చదువు కోవడానికి అన్ని  అవకాశాలు ఉన్న  వ్యక్తులు సాధించలేనిది సాదించిన సామాన్యుడైన ఆ అసామాన్యుడు  ఎవరు? ఇది ఎలా సాధించాడు చూసి మనయువత స్ఫూర్తి పొందాలంటేఆయనగురించి చదవాలి...

ఆతనే తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన  "కట్టా సింహాచలం."

అతని సంకల్పం ముందు అంధత్వం ఓడింది. పేదరికం తలవంచింది. పుట్టుకతోనే అంధుడు అయినా, అనుకున్నది ఎందుకు సాధించలేననే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. విజయం సాధించాడు కట్టా సింహాచలం.

సింహాచలం 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌లో 457 వ ర్యాంకు సాధించి ట్రై నీ కలెక్టర్‌గా ముస్సోరీలో శిక్షణకు ఎంపికయ్యారు.

గూడపల్లి గ్రామంలోని కట్టా వాలి, వెంకట నర్సమ్మలకు ఆయన  జన్మించారు.  ఆ దంపతులకు  వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, సింహాచలం.. నలుగురు కుమారులు, ఒక కుమార్తె దుర్గ .

కుటుంబ భారం మోసేందుకు తండ్రి వాలి పాత గోని సంచుల వ్యాపారం చేసేవారు. అలానే సంతానాన్ని పెంచి పెద్ద చేశారు. నాలుగో సంతానం అయిన సింహాచలం పుట్టుక తోనే అంధుడు. తండ్రికి కుమారుడిని చదివించే  స్తోమత లేదు. ఆ పేదరికంతోనే సింహాచలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్‌లో ప్రాధమిక ,సెకండరీ విద్య పూర్తి చేసి మలికిపురం ఎంవీఎన్‌ జేఎస్‌ అండ్‌ ఆర్వీఆర్‌ డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశారు.
ఆ సమయంలోనే తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు.

అండ కోల్పోయిన ఇంటికి తాను అండగా ఉండాలని అనుకున్నాడు. ఐఏఎస్‌ కావాలన్న దృఢ సంకల్పాన్ని తన మనస్సులో గట్టిగా నాటుకున్నాడు. ఆ క్రమంలోనే
బి యిడి చదివి  తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచరు ఉద్యోగం లో చేరారు సింహాచలం. బి యిడి లో తన ప్రొపెసర్ ఐ ఏ యస్ గురించి మరింత స్ఫూర్తిని కలుగ చేసారాయనకు.

ఉపాధ్యాయుడుగా ఉంటూ 2014 సంవత్సరంలో మొదటి ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో  జాతీయస్థాయిలో 1,212 ర్యాంకు సాధించాడు.  కలెక్టర్‌ అయ్యే అవకాశం కొద్దిలో మిస్‌ అయింది. అయినా నిరాశ చెందలేదు. ఈ ర్యాంకుకు వచ్చిన ఉద్యోగం పెద్దదే  అయినా ఐ ఏ యస్ అనే తన ఆశయం మరచిపోలేదు

2016లో ఐఆర్‌ఎస్‌లో రాణించి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అయ్యారు.

 ఎట్టకేలకు 2019 ఐఏఎస్‌ ఫలితాల్లో ర్యాంకు సాధించారు. ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు.

గ్రామీణ నేప‌థ్యంలో నుంచి వ‌చ్చినప్పటికీ   కుటుంబ స‌భ్యు‌లు,  స్నే‌హితులు అందించిన పోత్ర్సాహం, అంధత్వాన్ని జయించి జీవితంలో పైకిరావాలన్న పట్టుదలే  ఉన్నత పరీక్షల్లో విజయం సాధించడానికి తనకు దోహదం పడిందంటారు సింహాచలం .

యువత ఆశయంతో , ఆకాంక్షతో , పట్టుదలతో ముందుకు సాగితే ఏదీ అసాధ్యంకాదు. గ్రామీణ నేపధ్యం ,మాధ్యమం , పేదరికం ,అంధత్వం ఇవేమి విజయాన్ని ఆపలేవు అంటారాయన.

తన విజయం ఒక్క రోజులో వచ్చిందికాదు .నిరంతర సంఘర్షణ ,శ్రమ ,పట్టుదల , ముఖ్యంగా ఐ ఏ యస్ కావాలనే ఆకాంక్ష ,నిరంతర పఠనం , కుటుంబసభ్యుల ప్రోత్సాహం వల్ల సుసాధ్యమైందంటారాయన... అన్నీ ఉన్న యువత  ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని ,కలలుకని కృషితో పట్టుదలతో సాకారం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.,,,,

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ