Skip to main content

బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా....

*బ్లూటూత్, ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా ఎక్కువ సౌండ్ తో వింటున్నారా ...జర భద్రం చెవి ఇన్ఫెక్షన్ మరియు చాలా వినికేది  ప్రాబ్లమ కాయం*

 కంటిలోన నలుసు.. చెప్పులోన రాయి.. చెవిలో జోరీగ బాధ ఇంతింత కాదయా... అని వేమన ఏనాడో చెప్పారు. టెక్నాలజీ పుణ్యమా అని జోరీగ స్థానంలో బ్లూటూత్‌లు, ఇయర్‌ ఫోన్లు వచ్చేశాయి. వీటి మితిమీరిన వినియోగంతో అనేక మంది సౌండ్‌ ఇంజనీర్లు(చెవుడు)గా మారుతున్నారు. ఇంకెంతోమంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పెరుగుతున్న ధ్వని కాలుష్యం.. బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్ల వినియోగంతో ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు.

ప్రతి పదిమందిలో ఏడుగురు సెల్‌ఫోన్‌తోనే కాలం గడుపుతున్నారు. ఉదయం వ్యాయామం మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు వదిలి ఉండలేని వారున్నారంటే అతిశయోక్తి కాదు. సంగీతం, చదవడం, సినిమాలు చూడడం, ఇంటర్నెట్‌ తదితరాల కోసం యువత బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. వీటి వాడకం కొంత వరకు ఉపయోగపడినా ఎక్కువగా చేటునే తెస్తుంది. ముఖ్యంగా వినికిడి సమస్యలతో బాధపడుతూ అస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య అధికమవుతోంది. చాలామంది బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లను శుభ్ర పరుచుకోకుండా చెవిలో ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ బారిన పడుతున్నారు. రోజుకు ఎనిమిది గంటలకు మించి వాడితే త్వరలో శాశ్వత వినికిడి సమస్య వచ్చే అవకాశం ఉంది.

*మెలకువలు పాటిస్తే మంచిది*
సెల్‌ఫోన్‌ను ఎడమచేతిలో పట్టుకుని తక్కువగా, కుడిచేతిలో పట్టుకుని ఎక్కువ సమయం మాట్లాడతారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అందువల్ల ఎక్కువగా ఎడమ చేతిలో ఉంచుకునే మాట్లాడాలి.
మరీ ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే స్పీకర్‌ ఆన్‌చేసి మాట్లాడడం ఉత్తమం.
గుర్తింపు పొందిన కంపెనీల ఇయర్‌ ఫోన్లు, బ్లూటూత్‌లు వినియోగిస్తే మంచిది.
వ్యాయామాలు చేసే సమయంలో స్పీకర్ల ద్వారా వింటే మేలు.
డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌ వినియోగించకపోవడం మంచిది.లేకపోతే ప్రమాదం మన వెంటే ఉన్నట్లే.
ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
చెవిలో ఇతరత్రా వస్తువులు పెట్టి కదిలించడం మంచిది కాదు.
బహిరంగ ప్రదేశాల్లో చెవిని శుభ్రం చేయించుకోవడం కూడా సరైంది కాదు.

*చెవిలో ఇన్ఫెక్షన్ సమస్యలా? వీటిని ప్రయత్నించండి..*

ఉప్పు లేదా బియ్యం: ఇది అధ్భుతం గా పనిచేసే చిట్కా.ఒక కప్పు ఉప్పు తీసుకుని దానిని, మైక్రో వేవ్, కడాయి లేదా డబల్ బాయిలర్ లో 3-5 నిమిషాలు వేడిచెయ్యాలి.ఇప్పుడు ఒక మందమైన సాక్సు లేదా బట్ట లో ఈ వేడి చేసిన ఉప్పు వెయ్యండి. సాక్సు లేదా బట్ట పై భాగం లో ఒక ముడి వేసి బిగించాలి . ఇది వెచ్చగా ఉన్నప్పుడు ఇన్ ఫెక్షన్ కి గురైన చెవి మీద 5-10 నిమిషాలు ఉంచాలి.ప్రతీరోజూ ఇలా చెయ్యాలి. ఉప్పు కి బదులు బియ్యం వేడి చేసి, బట్ట లో మూట కట్టి చెవి మీద ఉంచవచ్చు

ఆలివ్ లేదా ఆవ నూనె: కొంచం ఆవ లేదా ఆలివ్ నూనె తీసుకుని వెచ్చబెట్టాలి. కొన్ని చుక్కల వెచ్చటి నూనె చెవిలో వెయ్యడం ద్వారా చెవి నెప్పి నుండి విముక్తి పొందవచ్చు.

వెల్లుల్లి: వెల్లుల్లి లో ఉండే నొప్పి నివారణ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల చాలా వ్యాధుల నివారణకి వెల్లుల్లి వాడతారు. అందులో చెవి ఇన్ ఫెక్షన్ కూడా ఒకటి.ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలని 2 టేబుల్ స్పూన్ల ఆవ లేదా నువ్వుల నూనెలో నూనె నల్లగా మారేవరకూ వేయించాలి.దీనిని వడకట్టి 2-4 చుక్కలచొప్పున వెచ్చటి నూనె ని ఇన్ ఫెక్షన్ ఉన్న చెవిలో వెయ్యాలి. వెల్లుల్లి ని మరొకవిధం గా కూడా వాడచ్చు. 2-3 తాజా వెల్లుల్లి రెబ్బలని నీటిలో 5 నిమిషాలు మరిగించాలి.నీరు మరిగాకా వెల్లుల్లి రెబ్బలని మెత్తగా నలిపి, ఆ నీటిలో కాస్త ఉప్పు కలపాలి.ఒక శుభ్రమైన బట్ట మీద ఈ వెల్లుల్లి నీటిని తీసుకుని ఇన్ ఫెక్షన్ ఉన్న చెవిలో మెల్లిగా పోయాలి. లేదా రోజూ 2-3 వెల్లుల్లి రెబ్బాలు తినడం వల్ల ఇన్ ఫెక్షన్ లు త్వరగా తగ్గుముఖం పడతాయి.

ఆపిల్ సిడార్ వెనిగర్ చెవి ఇన్ ఫెక్షన్ల నుండి ఉపశమనానికి ఆపిల్ సిడార్ వెనిగర్ ని కూడా ఉపయోగించవచ్చు,కొంచం ఆల్కాహాల్ లేదా నీరు తీసుకుని దానికి సమపాళ్ళలో ఆపిల్ సిడార్ వెనిగర్ కలపాలి.ఒక దూది ని ఈ ద్రవం లో ముంచండి. ఈ దూది ని చెవిలో పెట్టుకోవాలి. దూది ని తీసేసాకా అపసవ్య దిశలో పడుకోవడం వల్ల ఆపిల్ సిడార్ ద్రవం చెవి లోకి ఇంకుతుంది.తరువాత హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించి తడిగా ఉన్న చెవిని ఆరబెట్టుకోవచ్చు. ఒక వేళ ఆపిల్ సిడార్ వెనిగర్ అందుబాటులో లేకపోతే వైట్ వెనిగర్ అయినా ఉపయోగించవచ్చు.

ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరగాలి,దీనిని ఒక బౌల్ లో తీసుకుని మైక్రో వేవ్ లో 1-2 నిమిషాలు వేడిచెయ్యాలి. చల్లారాకా ఉల్లిపాయ నుండి రసం పిండి ఆ రసాన్ని చెవిలో వెయ్యాలి.మి నవీన్ నడిమింటి
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺