-ఎంబీఏ కాలేజీల్లో 18,364 సీట్లు భర్తీ -ఎంసీఏ కాలేజీల్లో 1,740 సీట్లు భర్తీ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 313 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో 25,389 సీట్లు ఉండగా వాటిలో 20,104 సీట్లు నిండాయని ఐసెట్-2019 అడ్మిషన్ కమిటీ కన్వీనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. బుధవారం ఐసెట్ తుది విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఈ నెల 31 వరకు గడువు విధించినట్టు వెల్లడించారు. 276 ఎంబీఏ కాలేజీల్లో 22,434 సీట్లు ఉండగా 18,364 సీట్లు నిండాయని, 4,070 సీట్లు మిగిలాయని తెలిపారు. 37 ఎంసీఏ కాలేజీల్లో 1,955 సీట్లు ఉండగా 1,740 సీట్లు నిండాయని, 215 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఎంబీఏలో 81.85 శాతం, ఎంసీఏలో 89 శాతం సీట్లు నిండాయని ఆయన ప్రకటించారు. ఎంబీఏ, ఏంసీఏలో కలిపి 184 కాలేజీల్లో100 శాతం సీట్లు భర్తీకాగా, ఒక్క కాలేజీలో సున్నా ప్రవేశాలు నమోదయ్యాయని వివరించారు. పూర్తి వివరాలకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment