Skip to main content

ఈరోజు కరెంట్ అఫైర్స్ - 01.09.2020




🇮🇳 భారత రాజకీయ మార్తాండుడు, 13వ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్‌ముఖర్జీ (84) అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

🇮🇳 ఇంట్లో కిందపడి మెదడులో రక్తం గడ్డకట్టిన కారణంగా అనారోగ్యానికి గురై ఆగస్టు 10న దిల్లీ ఆర్మీ రీసెర్చ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన మళ్లీ బాహ్యప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూశారు.అనంతరం పరీక్షలు చేసినప్పుడు కరోనా పాజిటివ్‌ అని తేలింది.

🇮🇳 గౌరవసూచకంగా కేంద్ర ప్రభుత్వం 7 రోజులను సంతాపదినాలుగా ప్రకటించింది. ఈనెల 6వ తేదీవరకు దేశవ్యాప్తంగా జాతీయ పతకాన్ని అవనతం చేయనున్నట్లు తెలిపింది. అధికారికంగా ఎటువంటి వినోదకార్యక్రమాలూ ఉండబోవని పేర్కొంది.

🇮🇳 51 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో భారత ప్రజాస్వామ్య ఎత్తుపల్లాలను చూసిన అత్యంత అరుదైన నాయకుడు ప్రణబ్‌ముఖర్జీ.

🇮🇳 2012లో భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తన అనుభవాలను పంచుకుంటూ రాసిన  ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ పుస్తకాన్ని వచ్చే డిసెంబర్‌ 11న ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నప్పటికీ ఇంతలోనే ఆయన కన్నుమూశారు.

🇮🇳 1969లో కాంగ్రెస్‌నుంచి చీలి ఏర్పడిన బంగ్లా కాంగ్రెస్‌ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ఆయన బ్యాంకుల జాతీయకరణ సమయంలో పార్లమెంటులో చేసిన  ప్రసంగం ద్వారా ఇందిరాగాంధీ దృష్టిని ఆకర్షించారు.

🇮🇳 1971లో జాతీయ కాంగ్రెస్‌లో చేరిన ఆయన మధ్యలో మూడేళ్లు తప్ప మిగిలిన కాలం ఆపార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు.

🇮🇳 కోల్‌కతాలోని డిప్యూటీ   అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో గుమస్తాగా ప్రణబ్‌ కెరీర్‌ ప్రారంభించారు.

🇮🇳 అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా కూడా కొద్దికాలం పనిచేశారు. జాతీయోద్యమంలో తన తండ్రి నిర్వహించిన పాత్రతో స్ఫూర్తి పొందిన ప్రణబ్‌ 1969లో ఇందిర ప్రోత్సాహంతో రాజ్యసభ సభ్యుడిగా పూర్తిస్థాయిలో ప్రజా జీవితంలోకి వచ్చారు.

🇮🇳 2004-12 మధ్య పరిపాలన సంస్కరణలు; సమాచార హక్కు; ఉపాధి హక్కు; ఆహార భద్రత; ఇంధన భద్రత; ఐటీ; టెలీకమ్యూనికేషన్స్‌ రంగాల్లోనూ.. విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, మెట్రోరైళ్ల ఏర్పాటులోనూ ఆయనది కీలకపాత్ర.

🇮🇳 1970, 80ల్లో గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్‌ ఏర్పాటులోనూ ఆయనదే ప్రముఖపాత్ర. కేంద్రం, రాష్ట్రాల మధ్య వనరుల పంపకానికి సంబంధించి 1991లో గాడ్గిల్‌-ముఖర్జీ ఫార్ములా రూపొందించిందీ ఆయనే.

🇮🇳 స్వగ్రామం: పశ్చిమబెంగాల్‌లోని బీర్భం జిల్లా మిరాటీ

🌸రాజకీయ సోపానం🌸

👉 1966లో బెంగాల్‌ కాంగ్రెస్‌లో చేరిక

👉 1969, 75, 81, 93, 99లో రాజ్యసభకు ఎన్నిక.

👉 1980-85 మధ్య కాలంలో రాజ్యసభానేతగా వ్యవహరించారు.

👉 పారిశ్రామిక అభివృద్ధి సహాయ మంత్రి (1973-74)

👉 నౌకాయానం, రవాణా సహాయ మంత్రి (జనవరి 1974- అక్టోబరు 1974)

👉 ఆర్థికశాఖ సహాయమంత్రి (అక్టోబరు 1974- డిసెంబరు 1975)

👉 రెవెన్యూ, బ్యాంకింగ్‌ శాఖ మంత్రి-స్వతంత్రహోదా (1975-1977)

👉 వాణిజ్యం, ఉక్కు, గనుల శాఖ మంత్రి-కేబినెట్‌ (1980-82)

👉 ఆర్థికశాఖ మంత్రి (1982-84)

👉 ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు (1991-96)

👉 వాణిజ్యశాఖ మంత్రి (1993-95)

👉 విదేశాంగ మంత్రి (1995-96)

👉 2004లో జాంగీపుర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక

👉 జూన్‌ 2004 నుంచి లోక్‌సభ నేతగా బాధ్యతలు

👉 రక్షణశాఖ మంత్రి (2004-06)

👉 విదేశాంగ శాఖ (2006-09)

👉 ఆర్థికశాఖ (జనవరి 2009- జూన్‌ 2012)

👉 2012-17: భారత రాష్ట్రపతిగా పనిచేశారు

🇮🇳 సరళీకరణలకు ముందూ-తర్వాతా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా ప్రత్యేకత పొందారు. 7 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

🇮🇳 1984లో ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యూరో మనీ జర్నల్‌ సర్వేలో గుర్తింపు పొందారు. 2010లో ఆసియాలోనే ‘ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా గుర్తింపు లభించింది.

 👉 1997: ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు.

 👉 2008: పద్మవిభూషణ్‌

👉 2011: భారత ఉత్తమ  పాలనాదక్షుడి అవార్డు

 👉 2019: దేశ అత్యున్నత  భారతరత్న పురస్కారం.

🇮🇳 2017 ఏప్రిల్‌ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. రాష్ట్రపతి హోదాలో ఆయనకు అదే చివరి పర్యటన.

🇮🇳 రాష్ట్రపతి హోదాలో శీతాకాలం విడిదికి వచ్చిన ఆయన 2015 జులై 5న యాదాద్రి దివ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన నాలుగో రాష్ట్రపతి ఈయన.👉 కోల్‌కతాలోని ఆయుధ కర్మాగారాల బోర్డు ఛైర్మన్‌గా, డైరెక్టర్‌ జనరల్‌గా సీఎస్‌ విశ్వకర్మ బాధ్యతలు స్వీకరించారు.

👨‍⚖ న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినందుకు కోర్టు ధిక్కరణ నేరం కింద సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఒక రూపాయి జరిమానా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

👨‍⚖ క్షమాపణలు కోరడానికి అవకాశమిచ్చినా ఆయన నిరాకరించడంతో ఈ జరిమానాను విధిస్తూ జస్టిస్‌ అరుణ్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది

👨‍⚖ అటార్నీ జనరల్‌ - కె.కె.వేణుగోపాల్‌

✈️ ముంబయి అంతర్జాతీయ విమనాశ్రయం అదానీ గ్రూపు చేతికి వెళ్లిపోతోంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు అదానీ గ్రూపు, జీవీకే గ్రూపు వెల్లడించాయి.

✈️ తద్వారా దేశంలోని రెండో అతిపెద్ద విమానాశ్రయాన్ని అదానీ గ్రూపు దక్కించుకున్నట్లు అవుతోంది.

✈️ ఇరుపక్షాలు అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం జీవీకే గ్రూపు సంస్థల నుంచి, ఎంఐఏఎల్‌ (ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌) లో 50.5 శాతం వాటాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన విమానాశ్రయ ఆస్తుల హోల్డింగ్‌ కంపెనీ- అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (ఏఏహెచ్‌ఎల్‌) సొంతం చేసుకుంటుంది.

🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺