జపాన్ ప్రధాని పదవిని వీడనున్న
షింజో అబె
🌍ప్రపంచంలోనే ఆర్థికంగా శక్తిమంతమైన మూడో దేశమైన జపాన్‌ను సుదీర్ఘకాలం పరిపాలించిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన షింజో అబె అనారోగ్య కారణాలతో పదవి వీడనున్నారు.
💠ఆగస్టు 31న పదవి నుంచి వైదొలుగుతానని ఆగస్టు 28న షింజో అబె ప్రకటించారు. తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోకుండానే పదవి వీడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుక్త వయసులో ఉన్నప్పట్నుంచి అల్సరేటివ్ కాలిట్స్ అనే పెద్ద పేగుకి సంబంధించిన సమస్యతో అబె బాధపడుతున్నారు.
🔰2006లో తొలిసారిగా జపాన్‌కు ప్రధాని అయిన 65 ఏళ్ల అబె అనారోగ్య సమస్యలతో ఏడాదికే రాజీనామా చేశారు. తిరిగి 2012లో అధికారంలోకి వచ్చిన ఆయన తన ఆర్థిక విధానాలతో గుర్తింపు పొందారు.
💥2021 ఏడాది సెప్టెంబర్‌తో ఆయన పదవీకాలం ముగిసిపోతుంది.
జెఫ్ బెజోస్ సరికొత్త రికార్డు
200బి.డాలర్లుకు పైగాసంపద
🌍ప్రపంచంలోనే అత్యంత ధనవంతుకైన జెఫ్ టెజోస్ మరో రికార్డును సృష్టించారు.
💰ప్రపంచంలోనే తొలిసారిగా 200 బి డాలర్ల(దాదాపు రూ.15 లక్షల కోట్లు )
నంపదను అధిగమించిన తొలి వ్యక్తి
అయ్యారు.
💠బ్లూమ్‌బర్ల్ బిలియనీర్ సూచీ ప్రకారం... అమెజున్ సీఈఓ సంపద బుధవారం నాటికి 202 బిలియన్ డాలర్లకు చేరింది. కంపెనీ షేర్లు రాణించడం ఇందుకు నేపథ్యం.
💫జనవరి నుంచి ఈయన సంపద 8 బి. డాలర్లు పెరగడం గమనార్హం. గత మూడు నెలల్లోనే అమెజాన్ కంపెనీ షేరు 25 శాతం; ఈ ఏడాది మొత్తం మీద 88 శాతం మేర పెరగడం విశేషం.
ఐఎన్ఎస్ విరాట్ విమాన వాహక నౌక డిస్ మాటిల్...
🛳30 ఏళ్లకు పైగా భారత నావికాదళానికి సేవలందించిన INS విరాట్ అనే విమాన వాహక నౌకను గుజరాత్ లోని అలంగ్ వద్ద కూల్చివేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితం ఓడ రద్దు చేయబడింది.
🛳ఐఎన్ఎస్ విరాట్ భారత నావికాదళంలో ఎక్కువ కాలం పనిచేసిన ఓడ. దీనిని 1987 లో భారత నావికాదళంలో చేర్చారు.
⚓️దీనిని ఇటీవల ఒక మెటల్ స్క్రాప్ సంస్థ 38.54 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ నౌకను ముంబైలోని నావల్ డాక్‌యార్డ్ నుండి అలంగ్ వద్ద ఉన్న షిప్ బ్రేకింగ్ యార్డ్‌కు తీసుకెళ్లాలి.
⚒ఓడను పూర్తిగా స్క్రాప్ చేయడానికి తొమ్మిది నుండి పన్నెండు నెలలు పడుతుంది
యూపీ, తమిళనాడులో పరిశ్రమల కారిడార్
🔰కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్ స్థారుు పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
💠ఆటోమేటిక్ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 26న జరిగిన రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఈ మేరకు తెలిపారు.
Comments
Post a Comment