మొట్టమొదట నీవు చేయవలసిన పని ఇది. దీనికి శాస్త్రాలు,పాడిత్యము అక్కర్లేదు.
"నేను" అను తలంపు పుట్టిన తర్వాతే ,ఈ "నేను" ను ఆశ్రయించుకొనే -క్షణక్షణం మారే తలంపులు పరంపరగా పుడుతున్నాయి .కనుక ఈ"నేనెవరు?" అని నిరంతరం ప్రశ్నిస్తే ఈ నేను అదృశ్యమై నిజమైన "నేను" అనుభవమవుతుంది.
నిద్రపోయే ముందు ,నిద్ర నుండి మేల్కొన్న వెంటనే "నే నెవడను?"అని ప్రశ్నించుకోవాలి .ఇవి ధ్యానానికి ఉత్తమ సమయాలు .అప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది.
"నే నెవడను?" అను విచారణకు ఇతర సాధనాలకు ఒకటే వ్యత్యాసం. ఇతర సాధనాలకు మనస్సు ఉపకరణ .విచారణలో మనస్సు యొక్క మూలాన్నే వెతకటం. అందుచేత విచారణ మార్గం విశిష్టమైనది .సూటి మార్గం.
ఇతర సాధనాలలాగా"నే నెవడను?" విచారణకు భావనా మాత్రం కాదు .ప్రత్యక్షానుభవం నుండి సూటిగా ఆత్మకు పయనించటం." నేను "అను అనుభవం సర్వులకూ నిత్య ప్రత్యక్షం.ఈ" నేను "సాక్షాత్తు ఆత్మనుండి పుట్టుకు వస్తోంది .కనుక మనం"నేను" ను పట్టుకుంటే సూటిగా ఆత్మలోకానికి వెళతాం.అందుకే ఇది ప్రత్యక్ష మార్గం.
తాను(నేను)పుట్టిన చోటేది? అని అన్వేషించి,తనకు(నేనుకు) మూలమైన ఆత్మను తెలుసుకున్న వాడే నిజమైన పుట్టిన వాడు .ఆ రోజే నిజమైన జయంతి .ఈ మునీంద్రుడే నిత్యుడు.నవీనుడు.
Comments
Post a Comment