చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. ఆయన ఎంత గొప్ప శిల్పకారుడంటే, ఆయన చెక్కిన శిల్పాలలో జీవ కళ ఉట్టిపడుతూ ఉండేది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఆ శిల్పికి, ఆయన శిల్పకళా నైపుణ్యానికి ఎంతో పేరుండేది.
దానితో ఆయన తన నైపుణ్యంపై ఎంతో గర్వపడేవాడు.
కాలక్రమంలో, ఆయనకు తాను మరణించే సమయం ఆసన్నమైనదని, ఇంకా ఎక్కువ రోజులు తాను బతకననే అందోళనలో పడిపోయాడు. అందుకే తనను తీసుకెళ్ళేందుకు వచ్చిన యమదూతలను భ్రమింపజేయడానికి ఒక పథకం వేశాడు.
అచ్చం తనలాగే ఉండే పది ప్రతిమలను తయారు చేసుకొని వాటి మధ్య కూర్చున్నాడు.
యమదూతలు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చి అక్కడున్న ప్రతిమలను చూసి ఆశ్చర్యంతో ఇరకాటంలో పడిపోయారు.
అక్కడున్న ప్రతిమలకు అసలైన మనిషికి తేడా తెలుసుకోలేక “ఆ శిల్పి ప్రాణం తీసుకెళ్ళలేకపోతే సృష్టి నియమం ఉల్లంఘించినట్లవుతుంది.
సత్యం తెలుసుకోవడానికి ప్రతిమలను పగలగొడితే కళను అవమానించినట్లవుతుంది” అని ఆలోచిస్తూ నిలబడిపోయారు..
అంతలో మానవ సహజమైన లోపాల పట్ల అవగాహన ఉన్న ఒక యమదూతకు ఒక ఆలోచన వచ్చింది.
అతను ఆ ప్రతిమల వంక చూస్తూ "నిజంగా శిల్పి ఎంత అందమైన ప్రతిమలను తయారు చేశాడు.
కాని ఈ ప్రతిమలలో ఒక చిన్న లోపం ఉంది.
అతను నా ముందుండి ఉంటే చెప్పేవాణ్ని ఆ లోపం ఏమిటో" అన్నాడు. అది విని ఆ శిల్పికి ఎక్కడలేని కోపం వచ్చింది.
నా జీవితమంతా శిల్ప కళ కోసమే అంకితం చేశాను.
నేను చెక్కిన ప్రతిమలలో లోపమా ?* అని మనసులో అనుకుంటూ బయటికి అడిగాడు "ఏం లోపం ఉంది" అని.
వెంటనే యమదూతలు అతన్ని పట్టుకుని అన్నారు.
"ఇదే నీలో ఉన్న లోపం. ప్రాణం లేని ప్రతిమలు అహంకారంతో మాట్లాడవు".
ఈ కథలో నీతి ఏమిటంటే....నేను ఏ తప్పూ చేయను, నేను 100% కరెక్ట్ అనే అహంకారం వల్ల అనుకోని బాధలు, చిక్కులు తప్ప మరేది పొందలేమని...అహంకారంతో విర్రవీగేవారు ఎంతటివారైనా అంతరించక తప్పదని... చరిత్రలో ఎన్నో సాక్ష్యాలున్నాయి. 🔮🔮🔮
Comments
Post a Comment