Skip to main content

నేటి మోటివేషన్... బంగారు బాల్యం


కోతుల్లా కొండెంగల్లా దుంకుతూ
మోకాళ్లకు మోచేతులకు దెబ్బలు తాకినా
దులుపుకొని, ఉమ్మి మందు పెట్టుకొని 
ఆడే కోతి కొమ్మ‌చ్చి ఆటలు ఫ్లాష్ బ్యాక్ లా గుర్తొస్తున్నాయి       
కష్టాల ముళ్లు గుచ్చుకుంటున్నా
లెక్క చేయక ఆడిన సిర్రా గోనె.. గోటీల... ఆటల
తీపిగుర్తుల చెలిమె ఊరుతూనే వుంది 
మా కట్కూరు వాగులో
అనేక లోహాల పిసర్ల లాంటి ఇసుక రేణువుల్లో
అందంగా పిట్టగూళ్లు...చేసిన సైకత శిల్పులం.. 
శంఖులు.. కౌశికలు... రంగురంగుల రాళ్లను 
ఏరుకొని దాచుకున్న పురాతత్వ వేత్తలం.... 
గల గలా పారే స్ఫటికంలాంటి నీళ్లలో 
చేపల్తో పోటీపడి ఈదిన గజ ఈతగాళ్లం
అమాయకత్వం అణువణువు నిండి
టైమ్ మిషన్ లో ముందుకెళ్లినట్లు భావించి
బొమ్మలకు పెళ్లిళ్లు చేసి
పెద్ద మనుషుల మైనట్టు భావించిన బాల్యం 
నన్ను నీడలా వెంటాడుతోంది 
అమ్మా నాన్న కోప్పడ్డా
బుడుబుంగల్లా తప్పించుకొని
వానలో తడుస్తూ మట్టితో ఆనకట్టలు కడుతూ
కాలాన్ని కాయిదప్పడవలో తింపిన మధుర జ్ఞాపకాలు... 
బడికి వెళ్లననీ మంకు చేస్తే 
ఐదు పైసలిచ్చీ తన భుజాల కుర్చీ మీద
బడి గుడిలోకి తీసుకపోయిన నాన్న.. 
నా బాల్యపు మొక్కకు 
తన బతుకు ఎరువును వేసి 
కలుపు మొక్కల్ని తీసి పెంచిన అమ్మ గుర్తులు
పచ్చబొట్టులా...
బడికి తప్పిస్తే రకరకాలుగా శిక్షించి 
జీవన విద్యా సమరంలో
జయాపజయాల పాఠాల్ని ఉగ్గుపాలతో నేర్పి
జ్ఞాన జ్యోతిని వెలిగించిన గురువుల అభయ హస్తాలు...వెన్నంటే వున్నాయి 
కానీ నేటి బాల్యం యాంత్రికమైంది
సెల్ ఫోన్.. టీ వీ రిమోట్ రక్కసి బాహువుల్లో బందీ అయిపోతుంది మరి..

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

  1. Avunu. Balyam pothondhi. Antha cellphone mahima

    ReplyDelete

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

4th Class Evs భారత దేశ చరిత్ర (Imp Bits)

📗ఎల్లోరా గుహలు ఎవరి కాలంలో నిర్మంచబడ్డాయి A) శాతవాహనాలు B) గుప్తులు C) కాకతీయులు D) మొఘలులు 👉B 📗గాధాసప్తశతిని అనే గ్రంధాని వ్రాసిన హాలుడు ఏ వంశస్తుడు? A) గుప్తులు B) మొఘలులు C) శాతవాహనుల D) విజయనగర రాజు 👉C  📗అశోకుని స్తంబములో ఉన్న శిల్పకళ..? A) గుజరాజ్ B) రాజస్థాన్ C) కేరళ D) తమిళనాడు 👉B 📗శివాజి గురువు  ఎవరు ? A) తుకారాం B) రామదాసు C) నరసింహరాయలు D) సమర్ధరామదాసు 👉D 📗శ్రీ కృష్ణదేవరాయల పరిపాలన కాలం A) 1509 నుండి 1519 B) 1509 నుండి 1529 C) 1609 నుండి 1619 D) 1609 నుండి 1629 👉B 📗తుకారాం అనే భక్తుడు ఎవరి కాలంలోని వాడు ? A.శ్రీకృష్ణదేవరాయుల B.అక్బర్ C.శివాజి D.చంద్రగుప్తడు 👉C 📗మొఘల్ లో గొప్ప పరిపాలకుడు ? A.శివాజి B.అక్బర్ C.మహ్మద్ హాలీ ఖాన్ D.యూమయున్ 👉B  📗అక్బర్ ఏ మతానికి చెందినా వాడు ? A.హిందూ B.బౌద్ద C.జైన D.మహమ్మదీయ 👉D  📗రుద్రమ్మదేవి తండ్రి ఎవరు ? A.సమర్ధరామదాసు B.గణపతి దేవుడు C.రామప్ప దేవుడు D.వీరస్వామి దేవుడు  👉B 📗ఎవరి కాలంలో తెలుగు మాట్లాడే వారందర్నీ ఒక్...

నేటి మోటివేషన్... "ఖాళీ గానే ఉంటావు కదా"

ఈ మాటల్ని ఈ మధ్య పిల్లలు కూడా అమ్మను అనడం ప్రారంభించారు... "ఖాళీ గానే ఉన్నావు కదమ్మా నాకు అది చేసిపెట్టచ్చుగా" ఇలా అమ్మతో పిల్లలు అనడం సహజం అయిపోయింది... నాన్నగారి మాటలను విని పిల్లలుకుడా ఇలా తయారయ్యారు...ఖాళీగా ఉంటున్నాను అని వీళ్లంతా అనుకుంటున్నారు కదా! నేనెందుకు ఒకరోజు ఖాళీగా కూర్చోకూడదు అన్న ఆలోచనవచ్చింది నాకు...🤔 ఆలోచన రావడమే తరువాయి పిల్లలు, మావారు వెళ్ళాక ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నాను... సాయంత్రం అయింది.పిల్లలు ఇంటికి వచ్చారు... వస్తూనే... ఇంటిముందు పిల్లలు వేసుకున్న షూ పాలిష్ మూత తెరిచివుంది.చెప్పుల స్టాండు చిందరవందరగా ఉంది.."అమ్మ కు ఏమైంది ఇవన్నీ ఎందుకు సర్దలేదు..అనుకుంటూ..."అమ్మా!ఎక్కడున్నావు? ఆకలవుతుందే ఏమైనా పెట్టు"  జవాబులేదు..."తొందరగా కాస్త పాలైనా ఇవ్వమ్మా! అన్నారు.జవాబులేదు...అమ్మ పలకడం లేదేంటి అని అమ్మను వెతకసాగారు...ఇంతలో భర్త వచ్చారు.. రాగానే "లక్ష్మీ!తల పగిలిపోతోంది వేడిగా కాఫీ ఇవ్వు"అన్నాడు...జవాబులేదు.. భార్య వంటింట్లో ఉందేమో అని వెళ్లి చూసాడు... లేదు...ఎక్కడ ఉన్న పాత్రలు అన్నీ అక్కడే వాసనకొడుతూ ఉన్నాయి..బెడ్రూం లో ఉంద...