Skip to main content

నేటి మోటివేషన్... పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ.

భయంతో..
ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...

ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి.

ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి...

తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.

అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు..

' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే...

👉నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు... కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.

👉అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు,ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు. ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు... 

👉నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు..

👉కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు... కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు..

👉నిజమే కదా! పాత కథే అయినా ధైర్యాన్నిచ్చే చక్కని కథ.
కష్టాలను తరిమికొట్టండి... ఆనందంగా జీవించండి...🍁

Comments

Post a Comment

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఒకటి బాగా గుర్తు పెట్టుకో..

ఏదైనా మాట్లాడేటప్పుడు గానీ, రాసేటప్పుడు గానీ అది నీ ఎమోషన్ నుండి వస్తున్న భావనా లేక రేషనల్ థింకింగ్ నుండి వస్తున్న భావనా నీ థాట్ ప్రాసెస్‌ని అబ్జర్వ్ చెయ్యడం ద్వారా గమనించు! ఎమోషన్ నుండి వస్తున్న భావన అయితే మాట్లాడకుండా, రాయకుండా కొంతసేపు ఆగు. ఏ ఎమోషన్ అయినా 7 నిముషాలకి మించి ఉండదు. ఆ 7 నిముషాలు ఓపిక పట్టు. హడావుడి పడిపోయి ఆ ఎమోషన్ నుండి మాట్లాడావే అనుకో.. నీ ఎమోషన్ ఓ సెలయేరులో రాయిలా ఇతరుల మనస్సుల్లో కూడా వారి మానసిక స్థాయిలను బట్టి పాజిటివ్ లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ సృష్టిస్తుంది. ఆ వైబ్రేషన్స్ వారిలో మళ్లీ రియాక్టివ్ ఎమోషన్ సృష్టించి నీకు వాళ్లు దూరం కావడం కావచ్చు, ఇంకా చాలానే జరగొచ్చు. సోషల్ మీడియానే తీసుకుంటే ఫేస్‌బుక్ లాంటివి ఎందుకు పాపులర్ అయ్యాయంటే.. they are providing people an opportunity to express the emotions. యాక్షన్, రియాక్షన్ ఎమోషన్స్ అన్నీ కలగలిసి సోషల్ మీడియాలో యాక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్లకి బిజినెస్ అవుతుంది. మనకు మనస్సు పాడై తలనొప్పులు మిగులుతాయి. సో ఎమోషనల్ బీయింగ్‌గా ఉండకు.. కొన్నిసార్లు నేనూ ఎమోషన్స్‌కి గురి కావచ్చు, దీనికి ఎవరూ అతీతం కాదు. కానీ నే...

నేటి మోటివేషన్... అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద...

సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె. మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు. ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను. "రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధ...