Skip to main content

తెలుసుకుందాము... రోజుకో కొత్త విషయం...


పాములు, బొద్దింకలు పర్యావరణానికి ఏవిధంగా దోహదకారులవుతున్నాయి?
How Snakes and cockroaches protect Environment?

ఈ విశాల విశ్వంలో మనకు తెలిసినంతవరకు భూమి తర్వాత మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు కానరాలేదు. భూమ్మీద జీవం ఆవిర్భవించి సుమారు 400 కోట్ల సంవత్సరాలైంది. ఎన్నో లక్షల రకాల వృక్ష జాతులు, వేలాదిగా జంతుజాతులు ఈ భూమ్మీద పరిణామం చెంది పర్యావరణానికి అనుకూలంగా ప్రకృతివరణం (Natural selection) ప్రకారం జీవనం సాగిస్తున్నాయి. పరస్పరం సహకరించుకుంటూ, ఘర్షించుకుంటూ, సహజీవనం సాగిస్తూ జీవావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని సమతుల్యం చేయగలుగుతున్నాయి. ప్రకృతినెదిరించే సామర్థ్యం జంతువులకు, వృక్షాలకు లేదు. కానీ మానవుడికున్న తెలివి, అవసరాల కారణంగా ప్రకృతిని ఎదురించి, పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఫలితంగా జీవ వైవిధ్యంలో తేడాలు సంభవిస్తున్నాయి. విపరీతమైన పట్టణీకరణ, జల ప్రణాళికల వల్ల ఎలుకలు, కప్పలు, పాములు, బొద్దింకలు పిచ్చుకలు, గాడిదలు, నక్కలు, రాబందులు, పులులవంటి పలు జంతువుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. బొద్దింకలు పలు రకాల మురికి పదార్థాలు తినికూడా బతుకుతాయి. ఒక అంచనా ప్రకారం అత్యంత స్వల్పంగా పరిణామం చెందిన అతి పురాతన జీవి బొద్దింక. ఎందుకంటే దాని జీవన విధానం ప్రకృతి ఆటుపోట్లను తట్టుకోగలగడమే కారణమంటున్నారు. పంటల్ని, ధాన్యాన్ని తినే ఎలుకల్ని భక్షించేవే పాములు. పాముల్లో ఎన్నో రకాలున్నా నేలమీద సంచరించే పాముల్లో మూడు మాత్రమే విషసర్పాలు. కానీ మనం అన్నింటినీ భయంతో చంపుతున్నాం. కానీ పాములు, బొద్దింకలు కూడా ప్రకృతికి అవసరమే.


🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Post a Comment

Popular posts from this blog

DSC ఫలితాలు విడుదల

DSC ఫలితాలు విడుదల వ్యక్తిగత లాగిన్లో ఫలితాలు చూసుకోవచ్చు..! https://apdsc.apcfss.in/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఏపీ డీఎస్సీ అన్ని జిల్లాల కట్ ఆఫ్స్

Click here to get all district cutoffs pdf  సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి ఎవరు వెళ్లాలి అని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు... ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం కల్లా అర్హులైన అభ్యర్థుల apdsc.apcfss.in వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్ నందు ఇంటిమేషన్ లెటర్స్ అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా అర్హులైన వారికి సర్టిఫికెట్ అప్లోడ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది.  కావున నేటి రాత్రి/ రేపు ఉదయం అభ్యర్థులు వారి వ్యక్తిగత లాగిన్ ను పరిశీలించగలరు.. 🏹 Lakshya🇮🇳Charitable📚Society 🩺

రోజుకి రూ. 1.50/- పోస్టల్ డిపార్ట్మెంట్ భీమా రక్షణ రూ. 10 లక్షలు

సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో పెద్ద భరోసా కల్పించేందుకు భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ (India Post) మరో ముఖ్యమైన భీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. India Post Payments Bank (IPPB) ద్వారా ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి ఈ పథకం అందిస్తున్నారు. ☛ తక్కువ ప్రీమియం – పెద్ద రక్షణ రోజుకి కేవలం రూ.1.50 చెల్లిస్తే రూ.10 లక్షల రక్షణ. రోజుకి రూ.2 చెల్లిస్తే రూ.15 లక్షల రక్షణ ☛ అర్హతలు వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలందరికీ ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ఏ పోస్టాఫీసులోనైనా లేదా IPPB ద్వారా సులభంగా పాలసీ పొందవచ్చు. ☛ ప్రధాన ప్రయోజనాలు ప్రమాదాల సమయంలో తక్షణ రక్షణ హాస్పిటల్ ఖర్చులకు సహాయం కుటుంబానికి ఆర్థిక భరోసా తక్కువ మొత్తంతో ఎక్కువ సెక్యూరిటీ ➥రోజువారీ జీవితంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, కుటుంబానికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ భీమా రక్షణ ద్వారా పెద్ద భరోసా కల్పించవచ్చు. గ్రామీణ ప్రజలకు, కూలీలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులకు ఇది ఎంతో ఉపయోగకరం. 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺