Skip to main content

నేటి మోటివేషన్... మంచి కథ సంతృప్తి కథ


ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.

       అప్పుడే.. ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.
 
      హమ్మయ్య.. అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.

      నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.

         ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.
     
ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.

      ‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.

     అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.

     "కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు. నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు కృతజ్ఞతలు చెప్తారు. ఎవరికీ ఏమీ ఇవ్వలేని నాకు, ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.

      నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే. ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.

మనం ధనవంతులం, స్థితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైన "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. ఒకరికి ఇవ్వడంలో గల "సంతృప్తి", మరెందులోనూ రాదని అర్థమైంది

మిత్రులారా దయచేసి సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి. మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం.!
"మానవసేవే మాధవసేవగా తరిద్దాము."
🌹🌹 🌹🌹 🌹🌹 🌹🌹

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

  1. చాలా అద్భుతంగా ఉంది సార్... నేను ఒక కండక్టర్ ని... నేను డ్యూటీ లో ఉన్నపుడు కూడా ఇలాగే చేస్తుంటా...ఆ తృప్తే వేరు....

    ReplyDelete

Post a Comment

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺