Skip to main content

Posts

Showing posts from August, 2025

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025.. పూర్తి వివరాలు...

అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 🎯వివరాలు: 🌼 ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.  🌼 తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది. 🎯అర్హత : విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతిలో చదువుతూ ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది). 🎯గమనిక:- కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. 🎯వయోపరిమితి: సాధారణంగా 13-15 సంవత్సరాల వయస్సులో 8వ తరగతి విద్యార్థులు అర్హలు. 🎯రాత పరీక్ష ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 🎯పరీక్ష విధానం: 1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌):  90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉం...

Latest Job Notifications ....

లేటెస్ట్ ప్రైవేట్, స్టేట్ మరియి సెంట్రల్ నోటిఫికేషన్స్ మీకోసం... కింద ఉన్న లింక్ లో పొందుపర్చడంజరిగింది... Click here to get job notifications మీ పరిధిలో ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే ఇక్కడ కామెంట్ బాక్స్ లో తెలుపగలరు... మీకు కాకపోయిన ఎవరికైనా ఉస్ అవ్వొచ్చు కదా..  ఈ లింక్ ప్రతీ రోజు అప్డేట్ చేయబడును... కావున సేవ్ చేసుకుని చెక్ చేసుకోగలరు... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC latest job notifications...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు... తాజాగా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్స్ మీకోసం... 1. Technical assistant notification 2. Agricultural officer notification 3. Endowment executive officer notification అలాగే మీకు ఈ జాబ్స్ సంబందించిన అన్ని రకాల మెటీరియల్స్ మన లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్స్ నందు లభించును.. మన లక్ష్య ఎడ్యుకేషన్ గ్రూప్స్ లలో జాయిన్ అవ్వడానికి క్రింది లింక్ క్లిక్ చేయగలరు... Group link... ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయగలరు... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్.... హృదయం కదిలించే కథ

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు. "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ. పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా డబ్బు మూటలు కడుతున్నది" ముసిముసిగా ...

వేదించే కీళ్ల వాతానికి ఆయుర్వేద వైద్యం.

కూర్చోవడం,  లేవడం,  పడుకోవడం,  నడవడం,  పనిచేయడం మాములుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా, సవ్యంగా జరిగిపోతాయి.  అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ని మన వాడుక భాషలో కీళ్ళవాతం అని అంటూ ఉంటారు.  కీళ్ళవాతం బారిన పడ్డప్పుడు కీళ్లన్ని బిగుసుకుపోతాయి.  కీళ్లన్ని ఎర్రగా వాపు వచ్చేసి నొప్పి మంటతో బాధిస్తుంటాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే కీళ్ళవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది.  వేదించే కీళ్ల వాతం జబ్బుకు ఆయుర్వేదం  గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం._ సాధ్యమైనంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమిడ...

నేటి మోటివేషన్... ఏడు చేపల కథ

"ఏడు చేపల కథ " ఒక ప్రాచీన ప్రజల కథ (folk tale). ఇది ముఖ్యంగా పిల్లలలో ప్రజాదరణ పొందిన ఒక నీతికథ. ఈ కథలో ఏడు చేపలు, ఒక మత్స్యకారుడు, మరియు నీతి విషయాలపై దృష్టి ఉంటుంది. ఈ కథ వేరే వేరే రూపాల్లో వివిధ ప్రాంతాలలో వినిపించవచ్చు, అయితే ఇది చాలా సార్లు ఈ విధంగా ఉంటుంది: ఏడు చేపల కథ ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక మత్స్యకారుడు ఉండేవాడు. అతను నిత్యం నది దగ్గరకి వెళ్లి చేపలు పట్టేవాడు. ఒక రోజు అతను నదిలో వల వేసి, ఆశ్చర్యంగా ఏడు బంగారు రంగు చేపలు పట్టాడు. అవి సాధారణ చేపలు కావు — తలకు ముత్యపు ముక్కులు, కళ్లకు వజ్రాలా మెరుపులు! అతను ఆశ్చర్యపోయి, "ఇవి అమ్మితే నాకు జీవితాంతం ధనవంతుడ్ని చేస్తాయి," అని అనుకున్నాడు. కానీ అదే సమయంలో, ఆ చేపలు మాట్లాడటం మొదలుపెట్టాయి! చేపలు అతనిని వేడుకున్నాయి: "దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము నీకు మేలు చేస్తాం. మేము అసలు మాయ చేపలము. మమ్మల్ని వదిలితే నీకు నిజమైన సంపద వస్తుంది — ప్రేమ, శాంతి, సంతృప్తి." మత్స్యకారుడు కొంతసేపు ఆలోచించి, ధనవంతుడు కావాలనే లోభాన్ని వదిలి, మంచి మనసుతో ఆ చేపల్ని తిరిగి నీటిలో వదిలేశాడు. కొద్ది రోజుల్లో అతని జీవితంలో మార...

నేటి మోటివేషన్... ప్రశాంత జీవనం

ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.  నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.  సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్...

నేటి మోటివేషన్... ఆత్మసంతృప్తి

భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వ తంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. తన పేరు చూసు కోవాలన్న ఆత్రుతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్లాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతణ్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ 'ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో' అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. 'ఆ పని చేస్తే తరవాత వచ్చిన వాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు. స్వర్గంలో కూడా కనిపిం చదు. ఇన్నాళ్లూ మంచి పనులు చేసి ఫలి తమేంటి...' అనుకున్నాడు. మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పార మార్థిక చింతన ఉన్నవాళ్లు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీ కులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానెయ్యమంటే ఒక పట్టాన వినరు. అందుకని 'చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. ఆట ఆపి రండి' అనే వారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్లిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగూ పుట్రా, ముళ్లూ ర...