Skip to main content

రైతన్నకు అండగా నిలిచిన లక్ష్య...

వీరన్నపేట గ్రామం, చేరియలమండలం, సిద్దిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న మల్లయ్య గారికి  లక్ష్య ఫౌండేషన్ వారు  ₹17,000 ఆర్థిక సహాయం చేయటం జరిగింది...

రెండు తెలుగు రాష్ట్రాల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా గత నాలుగు  సంవత్సరాలుగా  లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్స్ ద్వారా ప్రతిరోజు ఇరవై వేల మందికి పైగా  అన్నిరకాల ఉద్యోగ, ఎడ్యుకేషన్ సమాచారం పంపుతూ... ఎంతో మందికి చదువు విషయంలో సహాయపడుతున్నారు. వారు  అందరూ ఏర్పాటు చేసిందే ఈ లక్ష్య ఫౌండేషన్.

వివరాల్లోకి వెళ్తే... గతనెల 2వ తేదీన ట్రాక్టర్ ప్రమాదంలో కాలికి గాయం అయ్యి ఇప్పటికే రెండు సర్జరీలు అయ్యి, ఇంకో సర్జరీ కోసం సరిపడినంత ధనం లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మల్లయ్యకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సభ్యులను కలిగిన లక్ష్య ఫౌండేషన్ వారు... ₹17,000 సహాయం చేయటం నిజంగా ఎంతో గొప్ప విషయం... అని స్థానికులు కొనియాడారు... రాష్ట్రాలుగా విడిపోయినా సరే... మానవత్వంగా మేమందరం ఎప్పటికి కలిసే ఉంటాము... ఇలా ప్రాంతాలుగా వేరైనా... మానవత దృక్పధంతో మల్లయ్యకు సహాయం చేయటం ఎందరికో స్ఫూర్తినిస్తుంది అని స్థానికులు అన్నారు...

ఈ విషయాన్ని లక్ష్య ఫౌండేషన్ ఛైర్మన్ అయిన శివారెడ్డి దృష్టికి తీసుకెళ్లి తమకెంతో సహాయం పడిన రాజ్ కుమార్ గారికి తామెంతో రుణపడి ఉంటామని మల్లయ్య కుటుంబ సభ్యులు చెప్పారు..

ఆసరా లేదని అక్షరం
డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు...
చేతనైంతలో చేసుకుంటూ పోదాం..
అనే ఆశయంతో చేయి చేయి కలుపుకుంటూ ముందుకు పోతున్న లక్ష్య ఫౌండేషన్ టీమ్ ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం.


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝


Comments

Post a Comment

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺