Skip to main content

నేటి మోటివేషన్...



 జీవితంలో ఏం కావాలనుకుంటారో అది చాలామందికి దక్కదు దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది.
దక్కినదాంట్లోనే ఆనందం* *వెతుక్కునేవాళ్లు మరో రకం. తృప్తి, అసంతృప్తి అనేవి* మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సినదానికోసం ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. గమ్యం చేరుకున్నప్పుడు ఆనందం ఎలాగూ ఉంటుంది. ఒకవేళ చేరుకోకపోయినా ఆ ప్రయాణంలోని కుతూహలాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగాలి. లోకంలో గెలుపునే ఆనందంగా తీసుకుంటారంతా. ప్రక్రియ, ప్రయాణం, ప్రయత్నం- మూడింటిలోనూ ఆనందం ఉంటుందని గ్రహించాలి.

వైకుంఠపాళి అందరికీ తెలిసిన ఆట. పాములు, నిచ్చెనలు, పాచికలు వేయడం, ముందుకు అడుగులు వేయడం... మెట్టుమెట్టుకూ ఒక అనిశ్చితి, అనుమానం, ఆతురతతో కూడిన నిరీక్షణ. ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరేసరికి అక్కడ నోరు తెరచుకున్న పామో, పైకి చేర్చే నిచ్చెనో దర్శనమిస్తాయి. పాము నోట్లో పడకుండా తప్పించుకున్నప్పుడు ఒక నిశ్చింత. ఏది ఎప్పుడు ఎవరికి ప్రాప్తిస్తుందో తెలియదు. ఆడేవారి చేతిలో ఉన్నది పాచికలు వేయడం మాత్రమే. జరిగేదంతా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందనుకోవాలి. అదృష్టం, దురదృష్టం అన్నవి జీవన క్రీడ సాగించే మనిషి చేతుల్లో లేదనే తాత్విక భావానికి వైకుంఠపాళి దర్పణం పడుతుంది. అందుకే దాన్ని మోక్షపటం అంటారు.

మనిషి నిమిత్తమాత్రుడు. జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులు, ఆటుపోట్లు జూదంగా గోచరిస్తున్నప్పుడు మనిషి చేతిలో ఏముందనే సంశయం తలెత్తక మానదు. అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయిపోయే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం? వాహనం మీద ఎటువంటి నియంత్రణా లేకుండా నడిపే రీతిలో సాగిపోతుంది జీవితం. ఇటువంటి పరిస్థితులను చూసే ఆటే ఆడకూడదని భావించడం సబబు కాదు.

కొన్నిసార్లు సర్పం తోక భాగానికి పక్కనే అదృష్టపు నిచ్చెన అందలం ఎక్కించడానికి సిద్ధంగా ఉంటుంది. అదృష్టం చివరన దురదృష్టమూ పొంచి ఉంటుంది. మనిషికి ఎప్పుడు, ఏది ఎదురవుతుందో తెలియదు. ఆశ్చర్యాలు, సాహసాలు, చర్య, ప్రతిచర్యల సమాహారమే జీవితం. మంచి పనుల సంచితాల ఫలితం నిచ్చెనలైతే, చెడు పనుల పర్యవసానం పాములుగా భావించాలి. మంచి చెడుల నిర్ధారణకు ఏ మార్గమూ ఉండదు. ఎదురయ్యే ఫలితాలను అనుసరించే అర్థం చేసుకోవాలి. సహజ శక్తులే సర్వం నడిపిస్తాయి. మనిషి పాములు, నిచ్చెనల మధ్య ప్రయాణం సాగించడమే. ఆటలో అంతా తనవల్లే జరుగుతోందనే భ్రమలో మనిషి ఉంటాడు. ‘నువ్వేం చేయడంలేదు. అంతా నేనే... నువ్వు కేవలం నిరీక్షకుడివే’ అంటాడు గీతలో కృష్ణుడు.

జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్నిబట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఈ వైకుంఠపాళిలో ఎవరూ ఏదీ ఊహించలేరు, నియంత్రించలేరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవిత సత్యం. ఆశ నిరాశల మధ్య ఊగిసలాట తప్పదు. మనిషి తన భావోద్వేగాలనే కాకుండా క్రీడలో తోటివారి భావాలను చూసి ఆనందం పొందాలి. జీవనక్రీడలో స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని సంపాదించుకోవాలి. పరమానందంతో పరమపద సోపానాన్ని చేరాలి!

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC సూపర్‌వైజర్ గ్రేడ్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. మహిళా అభ్యర్థులకు మంచి అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విద్యార్హతలు కలిగిన మహిళా అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అర్హులైన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఉద్యోగ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టు పేరు సూపర్‌వైజర్ గ్రేడ్-1. మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 29 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్హతలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అర్హత కలిగిన విద్యా విభాగాలు: - ఫుడ్ సైన్స్ ...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో...

AP TET official question bank practice and mock tests ఒకే పేజీ లో... 💫Official Question Bank నుంచి 5×630 మొత్తం 3150 Questions ను వరుసగా 30 బిట్స్ కి ఒకటి చొప్పున మొత్తం Practice Tests చేయడం జరిగింది. 💡 ప్రశ్నలు చదవడం మాత్రమే కాదు… 👉 మీరు స్వయంగా Test రాసి 👉 వెంటనే Answer Check చేసి 👉 మీ Preparation Level తెలుసుకోండి! ⚡ Practice Mode + Actual Exam Mode 📊 Score & Answer Review కూడా వెంటనే! 🎯 AP TETకి సిద్ధమవుతున్న ప్రతి అభ్యర్థి ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి. 👇 Practice & Mock Tests ఇక్కడ: 🔗 https://ganaweb.in/ap-tet-official-paper-1a-practice-test/ 🔥 ఈరోజు ఒక Test… మీ Preparationలో ఒక Step ముందుకు! Lakshya Educational Groups