Skip to main content

నేటి వార్తలు...



పాఠశాలల్లో జంక్‌ ఫుడ్‌ విక్రయాలకు కట్టడి! 50 మీటర్లలోపు ప్రచారం కూడా నిషిద్ధం: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదన: పిల్లల ఆరోగ్యాలకు హాని కలిగించే ఆహారాన్ని (జంక్‌ ఫుడ్‌) పాఠశాలల్లోనూ వాటి పరిసరాల్లోనూ అమ్మకుండా, ప్రచారం కూడా చేయకుండా కట్టడి చేయనున్నారు. ఈ లక్ష్యంతో ది ఫుడ్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలతో కూడిన ముసాయిదాను రూపొందించి మంగళవారం విడుదల చేసింది.

> *మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం: పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో దిల్లీ కాలుష్య ఛాంబర్‌లా మారిన నేపథ్యంలో పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పశువుల ప్రాణాలు పోతే పట్టించుకునే ప్రభుత్వాలకు మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించింది.*

> ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌: అశ్వత్థామరెడ్డి: ఈనెల 9న మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిలియన్‌ మార్చ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సంపూర్ణ మద్దతిచ్చారని అన్నారు. అలాగే మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగ సంఘాల మద్దతు కోరతామని అన్నారు.*

> మరోసారి ఐరాసలో పాక్‌కు బుద్ధిచెప్పిన భారత్‌: పాకిస్థాన్‌ వక్రబుద్ధి మారడం లేదు. కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన ప్రతి వేదికపై పాక్‌కు భారత్‌ దీటుగా సమాధానం ఇస్తూ వస్తోంది. అయినా ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కశ్మీర్‌ని పావుగా వాడుకోవాలని చూస్తోంది

> ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదు’. హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించిన అధికారులు: ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో అధికారులు హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఈ అఫిడవిట్లు దాఖలు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయిలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నివేదికలో పేర్కొన్నారు.*

> హిట్‌మ్యాన్‌ ముందు టీ20 ‘శతక’ ఘనత: టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌శర్మ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. 100 అంతర్జాతీయ టీ20లు ఆడిన తొలి భారతీయుడిగా అవతరించనున్నాడు. ప్రపంచ క్రికెట్లో శతక మ్యాచ్‌ల ఘనత అందుకోనున్న రెండో ఆటగాడు హిట్‌మ్యాన్‌ కానున్నాడు.


                         నేటి సుభాషితం

ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు."

You did not wake up TODAY to be Mediocre."


                         మంచి పద్యం

పిచ్చిపిచ్చిగ దోచుకోండీ
వెర్రి వాళ్ళీ జన సమూహం
అంగుష్టములకు ఓటు వేస్తరు
అనామకులీ ముఖాలు.......!


(యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288)


                            నేటి జీ.కె

ప్రశ్న: రాజ‌స్థాన్‌లోని ఖేత్రి ఎందుల‌కు ప్రసిద్ధి గాంచిన‌ది?

జ: నికెల్

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ