> చైనాకు భారత్ వార్నింగ్! అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు : జమ్మూకశ్మీర్ విభజనను తప్పుబట్టిన చైనాకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
> నవంబర్ 2న తెలంగాణ కేబినెట్ భేటీ: తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి వర్గం శనివారం సమావేశం కానుంది.
> అమెరికాలో ‘తెలుగు’ వెలుగులు. 79శాతం పెరిగిన తెలుగు మాట్లాడేవారి సంఖ్య: అమెరికాలో తెలుగు భాషకు బలం పెరుగుతోంది. గత ఎనిమిదేళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక ఎప్పటిలాగే అమెరికాలో ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాషగా హిందీ ప్రథమ స్థానంలో నిలిచింది*
> *పోలీసుల ఆధ్వర్యంలో సమైక్యతా పరుగు: విజయనగరం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్‌వల్లభాయ్‌పటేల్ 144వ జయంతిని పురస్కరించుకుని పోలీసులు గురువారం ఉదయం జాతీయసమైక్యతా పరుగు నిర్వహించారు.*
> *వయసు పన్నెండేళ్లు.. వేతనం పాతికవేలు. మూడు రోజులు బడికి, మూడు రోజులు విధులకు.. డాటా సైంటిస్టుగా రాణిస్తున్న సిద్ధార్థ్: మణికొండకు చెందిన రాజా ,మానస కూడా ఐటీ ఉద్యోగులు వారి కుమారుడు సిద్దార్థ్(12) ఏడో తరగతి చదువుతున్నాడు. పిన్నవయసులో ఐటీ రంగంలో డాటా సైంటిస్ట్‌గా ఉద్యోగం సంపాదించి ఔరా అనిపించాడు.*
> *టీ20 ప్రపంచకప్‌కు తొలిసారిగా నమీబియా: వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు మరో కొత్త జట్టు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఒమన్‌ను ఓడించి తొలిసారిగా నమీబియా ప్రపంచకప్‌కు బెర్త్ సాధించింది.*
నేటి సుభాషితం
ఓటమంటే అంతం కాదు.. గెలుపంటే ప్రారంభం కాదు.. ఓటమి అనుభవంతో..గెలుపు బాటని వెతికే వారే.. నిజమైన విజేతలు.."
"Things work out BEST For those who make the BEST of the way Things work out."
మంచి పద్యం
ఓ చిరు నవ్వును విసురుచాలు
గెలువ వచ్చు ప్రపంచాన్న
అనాగరికపు మూర్కుడా అణు
బాంబులు దేనికోయ్.....!
(యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288
నేటి జీ.కె
ప్రశ్న: ప్రపంచంలో ఏ దేశానికి పొడవైన తీర ప్రాంతం ఉంది?
జ: కెనడా
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment