Skip to main content

నేటి మోటివేషన్..



ఒక club లో ఓ సారి ఓ  కార్యక్రమం లో,  “నీకు గతంలో మళ్ళీ వెళ్లి జీవించే అవకాశం యిస్తే నీ జీవితంలో ఏ సమయాన్ని మళ్ళీ జీవించాలని కోరుకుంటావు ?” అని అడిగారు 

చాలా మంది బాల్యమని, student life అని, job లో చేరిన రోజని ఇలా రకరకాలు చెప్పారు. 
కాని, మంథా శ్రీనివాస్ అనే ఆయన యిలా చెప్పారు, “మళ్ళీ అలాంటి అవకాసం వస్తే, మా అమ్మ గర్భంలోకి వెళ్లి ఆ 9 నెలలు మళ్ళీ గడపాలని వుంది అని. నేనెవరో తెలియకపోయినా నే బీజం పోసుకున్నానని అమ్మా, నాన్నా మురిసిపోతారు. నన్ను చూడకపోయినా నాకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరో మహారాజో, చక్రవర్తో వస్తున్నట్లు ఈ ప్రపంచలోకి నా రాక కోసం మాసాలు, రోజులు, గంటలు, నిమిషాలు లెక్క కట్టుకుని మరీ మురిసిపోతుంటారు. తన జన్మకి ప్రమాదం వుందని తెలిసి కూడా, అదేమీ ఓ విషయమే కాదన్నట్టు నా రాక కోసం అమ్మ ఎదురు చూసే ఆ ఊహని ఆస్వాదిస్తూ, అమ్మ కడుపులో వెచ్చగా, సురక్షితంగా ఆ 9 నెలలు గడపాలని వుంది”

అది విన్న వారంతా ఆ గదిలో speechless అయిపోయాము. speechless మాత్రమే కాదు అందరూ ఓ భావోద్వేకంలోకి వెళ్లి పోయారు. యింకో ఆయన ఆ speech ఎలావుందో చెప్పటానికి స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడుతూ మాట్లాడుతూ గద్గదస్వరముతో మాట్లాడలేక పోయాడు.

భగవంతుని ఎవరూ చూడలేదు...కాని అమ్మే కదా ప్రత్యక్ష దైవం. 

జన్మించక ముందు అమ్మ గర్భంలో వెచ్చదనం
జన్మించాక అమ్మ కమ్మని ఒడిలో వెచ్చదనం

అమ్మ పెట్టిన ముద్దు 
అమ్మ పెట్టిన ముద్ద 

పుట్టిన్రోజున అమ్మ హడావుడి
పొద్దున్నేలేపి తలంటు పోసి   
కంట్లో కుంకుడుకాయ రసం వెళ్లి 
కళ్ళు మండి నేను ఏడుస్తుంటే
అమ్మ కొంగుచివరని ముడిగా చేసి 
దానిమీద నోటితో వెచ్చని గాలి ఊది 
ఆ వెచ్చదనాన్ని నా కను రెప్ప మీద 
పెడుతూ నను ఒదారుస్తూ అమ్మ 
పడే గాభరా, కంగారు, ఆవేదన 
కొత్త బట్టలు వేసి 
నేనేదో దేవుడ్నైనట్టు బొట్టు పెట్టి 
నాకు హారతిచ్చి, నోట్లో మిఠాయి పెట్టి 
మురిసే పోయే అమ్మ
ఓ అద్భుత అనుభూతి! ఆనందం ! 

నే జన్మించక ముందు కూడా భూమి 
సూర్యుని చుట్టూ భ్రమణం చేస్తూంది  
ఈ రోజుకి నేను జన్మించిన తరువాత  
భూమితో పాటు నేనూ కూడా యింకో భ్రమణం సూర్యుని చుట్టూ పూర్తి చేశా 
భ్రమణం నేను చేశానా ?
భ్రమిస్తున్నానా ? అలా?

అమ్మ గర్భంలోకి వచ్చాను 
భూ గర్భంలోకి చేరుతాను 
మళ్ళీ అదే వెచ్చదనం ?
మళ్ళీ వచ్చే వెచ్చదనం !

యిది ఉదాసీనత కాదు 
యిది వైరాగ్యం కాదు 
యిది వైకల్యం కాదు
మరి ఏమిటిది ? 
యిది వేదన కాదు 
వేడుకా కాదు 
యిది ఒక ప్రయాణం  

ఓ అద్భుత అనుభూతి 
అమ్మ పంచిన ప్రేమ 
నాన్న యిచ్చిన వూత
జీవిత భాగస్వామితో పయనం 
పుత్ర పుత్రికోత్సాహం 
స్నేహితులతో నవ్వులపువ్వులు 🤲🙏

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Flash flash.... AP Students Attendance App updated

Flash flash  Ap teacher's attendance app updated just now... In this update you have update your TIS details individually  Click here to get the update  Students attendance latest update link 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺