Skip to main content

పాఠశాల అసెంబ్లీ కొరకు వార్తలు...



                         నేటి వార్తలు

> వ్యవస్థకు చెడ్డపేరు తేవద్దు: బీసీఐ: దేశ రాజధాని దిల్లీలో న్యాయవాదులు, పోలీసులకు మధ్య జరుగుతున్న ఘర్షణలకు ముగింపు పలకాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) కోరింది.

> ఇకపై ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, మండల, జడ్పీ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

> పాఠశాల బస్సు కింద పడి విద్యార్థి మృతి: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దేవరోని తండాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి ఇస్లావత్‌ రాకేశ్‌ (7) అనే బాలుడు మృతి చెందాడు. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

> సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు: మోదీ: కోల్‌కతాలో అంతర్జాతీయ ఐదో సైన్స్‌ ఫెస్టివల్‌ను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు. కృషి, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తే సైన్స్‌లోనైనా, జీవితంలోనైనా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. మానవీయ విలువలతో కూడిన శాస్త్ర సాంకేతికతను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని మోదీ గుర్తుచేశారు.

> సముద్రమట్టాల పెరుగుదలతో భారత్‌కు ముప్పు: మావనవాళి మనుగడకు వాతావరణ మార్పులు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర మట్టాలు పెరగడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. దీనివల్ల జపాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ సహా భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

> పాక్‌పై ఆసీస్‌ విజయం: స్టీవ్ స్మిత్ (80*; 51  బంతుల్లో 11×4, 1×6) అదరగొట్టడంతో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి 1-0తో ఆసీస్‌ ఆధిక్యంలో నిలిచింది.


                         నేటి సుభాషితం

"తెలివి తన గురించి మాత్రమే ఆలోచింపచేస్తే ,  జ్ఞానం మొత్తం సమాజాన్ని గురించి ఆలోచింప చేస్తుంది."

"Sometimes you WIN."
"Sometimes you LEARN


                         మంచి పద్యం

అమృతం అందించటంలో
అమ్మకన్నా  దేవతెవరూ
తనువు పంచిన తల్లి ఋణమూ
ప్రాణ్రమిస్తే తీరునా........!


(యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288)

                            నేటి జీ.కె

ప్రశ్న: ర‌ష్యాలో 1917 విప్లవం వ‌ల్ల ఇత‌ని ప‌రిపాల‌న అంత‌మైన‌ది?

జ: జార్ ల

🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts from this blog

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల... Top sites మీకోసం....

Link 1 Link 2 Link 3 Link 4 Link 5 Link 6 Link 7 Link 8 Link 9 Link 10 Link 11 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ