> ఇక 30 సెకన్లు మోగాల్సిందే: ట్రాయ్: ఇన్‌కమింగ్ కాల్ రింగ్ సమయం విషయంలో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి చెక్ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్ల విషయంలో ఇన్‌కమింగ్ కాల్ రింగ్ టైమ్‌ను 30 సెకన్లుగా నిర్ణయించింది.
> ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీపై హైకోర్టు అసహనం: ఆర్టీసీ సమ్మె, ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ సమర్పించిన నివేదికపై హైకోర్టులో శుక్రవారం సుదీర్ఘ వాదనలు సాగాయి. ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, ఇవాళ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. సునీల్‌శర్మ ఇచ్చిన నివేదికను పరిశీలించిన హైకోర్టుఅసహనం వ్యక్తం చేసింది.
> నవంబరు 30 నుంచి ఝార్ఖండ్ ఎన్నికలు. ఐదు దశల్లో పోలింగ్.. ఫలితాలు డిసెంబరు 23న: ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో 81 నియోజక వర్గాలున్నాయి.
> కొత్త నాయకుడెవరో మాకు తెలుసు :ట్రంప్: ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికా మట్టుబెట్టిన తర్వాత అతడి స్థానంలో మరో వ్యక్తి అబు ఇబ్రహిమ్ అల్-హషిమి అల్-ఖురైషీని నియమిస్తున్నట్లు ఆ ఉగ్ర సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
> కలెక్టర్ ఎదుట కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం: అనంతపురం నగరంలోని అంబేడ్కర్ భవన్‌లో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఎదుట ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
> ఒలింపిక్స్ బెర్త్‌కు అడుగు దూరంలో భారత్: భారత మహిళా, పురుషుల హాకీ జట్లు ఒలింపిక్స్ బెర్త్ సాధించడానికి అడుగు దూరంలో నిలిచాయి. భువనేశ్వర్ వేదికగా శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లో రష్యాపై పురుషుల హాకీ జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది.
నేటి సుభాషితం
"అర్ధం.. అపార్ధం".. రెండింటికి ఒక అక్షరమే తేడా
"అర్ధం" చేసుకుంటే స్నేహమవుతుంది... "అపార్ధం" చేసుకుంటే శత్రుత్వమవుతుంది..."
"There's nothing more inspiring than the complexity and beauty of the human heart."
మంచి పద్యం
యుద్ధమే అనువార్యమైతే
కాలమే స్థంబించు దేవా
నేల కూలిన శరీరాలకు
శాంతి గీతం దేనికోయ్...!
(యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288)
నేటి జీ.కె
ప్రశ్న: చోళుల సామ్రాజ్యంలో ఒక విభాగంగా పరిపాలించిన అతిపెద్ద గ్రామాన్ని ఏమని పిలిచేవారు?
జ: తణియూరు
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment