నేటి వార్తలు
> తహసీల్దార్ సజీవ దహనం: హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘోరం చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
> గడువు దాటితే ఏ ఒక్కరినీ చేర్చుకోం: కేసీఆర్: గడువు లోపు విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలోకి చేర్చుకోవద్దని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళవారం అర్ధరాత్రిలోపు విధుల్లో చేరాలని సూచించారు.
> ఎవ్వరూ విధుల్లో చేరలేదు.. వాళ్లూ వచ్చేశారు: నవంబరు 5వ తేదీలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా డెడ్‌లైన్ విధించినా ఎవరూ చేరలేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ‘‘సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధించినా ఎవ్వరూ విధుల్లో చేరలేదు. చేరే ప్రసక్తే లేదని చెప్పారు. నిన్న 11 మంది విధుల్లో చేరితే.. ఐదుగురు ఈరోజు మళ్ళీ వచ్చేశారు.
> ఆర్‌సెప్ ఒప్పందానికి భారత్ దూరం: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సెప్) ఒప్పందంలో భారత్ చేరడం లేదు. తాము లేవనెత్తిన ఆందోళనలపై ఈ ఒప్పందంలో ఎలాంటి ప్రస్తావన లేకపోవడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
> సరి-బేసి’తో ఏం సాధిద్దామని?: సుప్రీం. దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం. ప్రజలు దిల్లీని వదిలిపోవడం కాదు కాలుష్యాన్నే తరిమికొట్టాలి: దిల్లీలో వాయు కాలుష్య తీవ్రతపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యానికి కారణాలు, నివారణ చర్యలపై సోమవారం సుదీర్ఘంగా విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలను జారీ చేసింది.
> టీ20 ప్రపంచకప్‌కు కొత్త ఫార్మాట్: షెడ్యూల్ విడుదల: పొట్టి ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది. ఈసారి ప్రపంచకప్‌లో పపువా న్యూగినియా, ఐర్లండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న దేశాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మొత్తం 16 దేశాలు ఈ మెగాటోర్నీలో తలపడనున్నాయి.
> ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయనను హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నేటి సుభాషితం
"నిజాయితీ అనేది ఇతరులు మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు కనపరిచే ప్రవర్తన కాదు. అది మీలో మీరు ఉండే విధానం."
"Exceptional people long shirt doing their best is all they can do."
మంచి పద్యం
తల్లి చెల్లీ అక్క ఆలీ
ఆడదే లేకుంటె శూన్యం
అడుగు దేవా పురుషలోకం
ఆదరించదు ఎందుకోయ్.!
(యనగందుల దేవయ్య" గారిచే రచించబడిన "ముత్యాల సరాలు" అనే శతక పద్యాలు. వీరు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం, పైనంపల్లి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పని చేయుచున్నారు. వారి సెల్ నెం: 9666036288)
నేటి జీ.కె
ప్రశ్న: మొదటి బాజీరావు బస్సైన్, సాల్‌సెట్టిలను ఎవరి నుంచి ఆక్రమించాడు?
జ: పోర్చుగీసువారు
🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝
Comments
Post a Comment