ఒక club లో ఓ సారి ఓ కార్యక్రమం లో, “నీకు గతంలో మళ్ళీ వెళ్లి జీవించే అవకాశం యిస్తే నీ జీవితంలో ఏ సమయాన్ని మళ్ళీ జీవించాలని కోరుకుంటావు ?” అని అడిగారు చాలా మంది బాల్యమని, student life అని, job లో చేరిన రోజని ఇలా రకరకాలు చెప్పారు. కాని, మంథా శ్రీనివాస్ అనే ఆయన యిలా చెప్పారు, “మళ్ళీ అలాంటి అవకాసం వస్తే, మా అమ్మ గర్భంలోకి వెళ్లి ఆ 9 నెలలు మళ్ళీ గడపాలని వుంది అని. నేనెవరో తెలియకపోయినా నే బీజం పోసుకున్నానని అమ్మా, నాన్నా మురిసిపోతారు. నన్ను చూడకపోయినా నాకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరో మహారాజో, చక్రవర్తో వస్తున్నట్లు ఈ ప్రపంచలోకి నా రాక కోసం మాసాలు, రోజులు, గంటలు, నిమిషాలు లెక్క కట్టుకుని మరీ మురిసిపోతుంటారు. తన జన్మకి ప్రమాదం వుందని తెలిసి కూడా, అదేమీ ఓ విషయమే కాదన్నట్టు నా రాక కోసం అమ్మ ఎదురు చూసే ఆ ఊహని ఆస్వాదిస్తూ, అమ్మ కడుపులో వెచ్చగా, సురక్షితంగా ఆ 9 నెలలు గడపాలని వుంది” అది విన్న వారంతా ఆ గదిలో speechless అయిపోయాము. speechless మాత్రమే కాదు అందరూ ఓ భావోద్వేకంలోకి వెళ్లి పోయారు. యింకో ఆయన ఆ speech ఎలావుందో చెప్పటానికి స్టేజ్ మీదకి వెళ్లి మాట్లాడుతూ...