Skip to main content

Posts

Showing posts from 2025

10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు సువర్ణావకాశం

2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి లో 60% లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తో పాస్ అయిన విద్యార్ధిని విద్యార్ధులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ లేకుండానే నవోదయ ఎటపాక స్కూల్ నందు 11వ తరగతి సైన్స్ మరియు మ్యాథ్స్ గ్రూప్స్ లో డైరెక్ట్ గా సీటు ఇవ్వబడును. కావున విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దరఖాస్థులు నింపి పంపించడానికి చివరి తేదీ 20 ఆగష్టు 2025 . అడ్మిషన్స్ కేవలం మెరిట్ బేసిస్ మీదనే ఉంటుంది. ఎవరి సిఫార్సులు పని చేయవు.  మొత్తం ఖాళీల సంఖ్య: 52 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9494343022 (కె. టీ. ప్రసాద్)  9491191813 (శ్రీ భాస్కరాచారీ, సీనియర్ టీచర్)  9491768144 (శ్రీ కె. శేఖర్, కౌన్సిలర్) ముఖ్య గమనిక: 11వ తరగతిలో ఎంపికకు ఖాళీగా ఉన్న సీట్లు 12 నుంచి 52 కు పెంచబడినాయని చెప్పటానికి సంతోషిస్తున్నాము. అంటే ఒక సెక్షన్ పెంచబడింది. ఇట్లు ప్రిన్సిపాల్ ఇంచార్జి  కె టి ప్రసాద్ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

NMMS scholarship 2025: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025.. పూర్తి వివరాలు...

అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 🎯వివరాలు: 🌼 ఈ పథకానికి ఎంపికైన లక్ష మంది విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు.  🌼 తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది. 🎯అర్హత : విద్యార్థులు ప్రభుత్వ/ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు లేదా స్థానిక సంస్థల పాఠశాలల్లో 8వ తరగతిలో చదువుతూ ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదు. విద్యార్థులు 7వ తరగతిలో కనీసం 55శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు 5శాతం సడలింపు ఉంటుంది). 🎯గమనిక:- కేంద్రీయ విద్యాలయాలు, నవోదయలు, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. 🎯వయోపరిమితి: సాధారణంగా 13-15 సంవత్సరాల వయస్సులో 8వ తరగతి విద్యార్థులు అర్హలు. 🎯రాత పరీక్ష ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాత పరీక్షలు నిర్వహిస్తారు. 🎯పరీక్ష విధానం: 1. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్‌):  90 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉం...

Latest Job Notifications ....

లేటెస్ట్ ప్రైవేట్, స్టేట్ మరియి సెంట్రల్ నోటిఫికేషన్స్ మీకోసం... కింద ఉన్న లింక్ లో పొందుపర్చడంజరిగింది... Click here to get job notifications మీ పరిధిలో ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటే ఇక్కడ కామెంట్ బాక్స్ లో తెలుపగలరు... మీకు కాకపోయిన ఎవరికైనా ఉస్ అవ్వొచ్చు కదా..  ఈ లింక్ ప్రతీ రోజు అప్డేట్ చేయబడును... కావున సేవ్ చేసుకుని చెక్ చేసుకోగలరు... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

APPSC latest job notifications...

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు... తాజాగా విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్స్ మీకోసం... 1. Technical assistant notification 2. Agricultural officer notification 3. Endowment executive officer notification అలాగే మీకు ఈ జాబ్స్ సంబందించిన అన్ని రకాల మెటీరియల్స్ మన లక్ష్య ఉద్యోగ సోపానం గ్రూప్స్ నందు లభించును.. మన లక్ష్య ఎడ్యుకేషన్ గ్రూప్స్ లలో జాయిన్ అవ్వడానికి క్రింది లింక్ క్లిక్ చేయగలరు... Group link... ఏమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయగలరు... 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్.... హృదయం కదిలించే కథ

రవి సాప్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు... ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు. "పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ. పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ గంపను తనవైపు ఎత్తి పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఒకింత సంతోషంగా. అవ్వ వెళ్ళిపోయింది. "ఎంత ఆశో ఈ ముసలిదానికి... ఇవాళో రేపో చావబోతుంది... ఇంకా డబ్బు మూటలు కడుతున్నది" ముసిముసిగా ...

వేదించే కీళ్ల వాతానికి ఆయుర్వేద వైద్యం.

కూర్చోవడం,  లేవడం,  పడుకోవడం,  నడవడం,  పనిచేయడం మాములుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా, సవ్యంగా జరిగిపోతాయి.  అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ని మన వాడుక భాషలో కీళ్ళవాతం అని అంటూ ఉంటారు.  కీళ్ళవాతం బారిన పడ్డప్పుడు కీళ్లన్ని బిగుసుకుపోతాయి.  కీళ్లన్ని ఎర్రగా వాపు వచ్చేసి నొప్పి మంటతో బాధిస్తుంటాయి.  ఒక్కమాటలో చెప్పాలంటే కీళ్ళవాతం బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది.  వేదించే కీళ్ల వాతం జబ్బుకు ఆయుర్వేదం  గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ఇతర అంశం గురించి మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే, సరైన రోగ నిర్ధారణ, నిర్వహణ మరియు మార్గదర్శకత్వం కోసం డాక్టర్స్ ని సంప్రదించడం చాలా ముఖ్యం._ సాధ్యమైనంత వరకు డాక్టర్ ని కలవండి. చిట్కాలు , హోమ్ రెమిడ...

నేటి మోటివేషన్... ఏడు చేపల కథ

"ఏడు చేపల కథ " ఒక ప్రాచీన ప్రజల కథ (folk tale). ఇది ముఖ్యంగా పిల్లలలో ప్రజాదరణ పొందిన ఒక నీతికథ. ఈ కథలో ఏడు చేపలు, ఒక మత్స్యకారుడు, మరియు నీతి విషయాలపై దృష్టి ఉంటుంది. ఈ కథ వేరే వేరే రూపాల్లో వివిధ ప్రాంతాలలో వినిపించవచ్చు, అయితే ఇది చాలా సార్లు ఈ విధంగా ఉంటుంది: ఏడు చేపల కథ ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక మత్స్యకారుడు ఉండేవాడు. అతను నిత్యం నది దగ్గరకి వెళ్లి చేపలు పట్టేవాడు. ఒక రోజు అతను నదిలో వల వేసి, ఆశ్చర్యంగా ఏడు బంగారు రంగు చేపలు పట్టాడు. అవి సాధారణ చేపలు కావు — తలకు ముత్యపు ముక్కులు, కళ్లకు వజ్రాలా మెరుపులు! అతను ఆశ్చర్యపోయి, "ఇవి అమ్మితే నాకు జీవితాంతం ధనవంతుడ్ని చేస్తాయి," అని అనుకున్నాడు. కానీ అదే సమయంలో, ఆ చేపలు మాట్లాడటం మొదలుపెట్టాయి! చేపలు అతనిని వేడుకున్నాయి: "దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము నీకు మేలు చేస్తాం. మేము అసలు మాయ చేపలము. మమ్మల్ని వదిలితే నీకు నిజమైన సంపద వస్తుంది — ప్రేమ, శాంతి, సంతృప్తి." మత్స్యకారుడు కొంతసేపు ఆలోచించి, ధనవంతుడు కావాలనే లోభాన్ని వదిలి, మంచి మనసుతో ఆ చేపల్ని తిరిగి నీటిలో వదిలేశాడు. కొద్ది రోజుల్లో అతని జీవితంలో మార...

నేటి మోటివేషన్... ప్రశాంత జీవనం

ప్రతి వ్యక్తీ ప్రశాంతమైన జీవితాన్నే కోరుకుంటాడు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవనయానం కొనసాగాలని ఆకాంక్షిస్తాడు. ఒత్తిళ్లకు దూరంగా చింతలేని జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తాడు. కానీ ఆచరణలో అది సాధ్యమేనా? జీవితం సుఖదుఃఖాల సంగమం. కష్టాలూ సమస్యలు లేని వారంటూ ఎవరూ ఉండరు. అయితే వాటిని ఎంత నిబ్బరంగా ఎదుర్కొంటామన్న దానిపైనే మన జీవన నాణ్యత ఆధారపడి ఉంటుంది.  నిజానికి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణించడమే. అయితే ఆ సమస్యల వల్ల ఏర్పడే విపరిణామాలలో చిక్కుకోకుండా వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం మన వివేచన మీద ఆధారపడి ఉంటుంది. ప్రశాంతత కోసం మనం ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాం. కానీ, ప్రశాంతత అనేది మనలోనే, మనతోనే, మన ఆలోచనల్లోనే నిండి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ మనసును నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంచుకోగలిగితే ప్రశాంత అనుభూతిని ఆస్వాదించవచ్చు. సమస్యలనేవి సముద్రపు అలల్లా వచ్చి పోతూనే ఉంటాయి. వాటి ఒత్తిడికి అతీతంగా మసలుకుంటే మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.  సుఖదుఃఖాలు అనేవి రెండు తలుపులు లాంటివి. వాటిలో ఒకటి తెరుచుకుంటే ఇంకొకటి మూసుకుంటుంది. సమస్యలతో సంఘటనలతో నిమిత్...

నేటి మోటివేషన్... ఆత్మసంతృప్తి

భూలోకంలో ఒక మహారాజు జనరంజకంగా పాలించాడు. పుణ్యకార్యాలు చేశాడు. మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని, అక్కడ బంగారు కొండపై తన పేరు శాశ్వ తంగా చెక్కి ఉంటుందని నమ్మాడు. చనిపోయి స్వర్గానికి వెళ్లాడు. తన పేరు చూసు కోవాలన్న ఆత్రుతతో ఆ కొండ దగ్గరకు వడివడిగా వెళ్లాడు. దానిపై తన పేరు లేదు. విచారంగా ఉన్న అతణ్ని చూసి అక్కడి భటుడు నవ్వుతూ 'ఏదో ఒక పేరు చెరిపి నీది రాసుకో' అన్నాడు. మహారాజు ఆశ్చర్యపోయాడు. 'ఆ పని చేస్తే తరవాత వచ్చిన వాడు నా పేరు కూడా చెరిపేస్తాడు. అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో వినిపించదు. స్వర్గంలో కూడా కనిపిం చదు. ఇన్నాళ్లూ మంచి పనులు చేసి ఫలి తమేంటి...' అనుకున్నాడు. మంచి పనులు చేస్తే స్వర్గం, చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందని పార మార్థిక చింతన ఉన్నవాళ్లు నమ్ముతారు. ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీ కులు. చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానెయ్యమంటే ఒక పట్టాన వినరు. అందుకని 'చీకట్లో దయ్యాలు తిరుగుతాయి. ఆట ఆపి రండి' అనే వారు. దయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్లిపోతారు. దయ్యాలు లేవని తెలుసు. చీకట్లో పురుగూ పుట్రా, ముళ్లూ ర...

My school

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారి దినచర్య ఇలా ఉంటుంది.

1. They get up early morning - వీరంతా ఉదయం బ్రహ్మిముహూర్త సమయానికే (4 లేదా 5 గంటలకు) లేచి  🌿ఆ రోజులో ఏమేమి పనులు చెయ్యాలి,  🌿ఎలా చెయ్యాలి  🌿ముందు చెయ్యాల్సిన ముఖ్యమైన 👉మూడు పనులు ఏంటి అని ప్రణాళిక వేసుకుంటారు. 2. They folllow a morning ritual -  వీరందరికీ పొద్దున్నే లేవగానే క్రమం తప్పకుండా చేసే పనులు ఉంటాయట -  🌿వ్యాయామం లేదా యోగా చెయ్యడం,  🌿ధ్యానం చెయ్యడం,  🌿మంచి పుస్తకాలు చదవడం.   👉వీటిలో ప్రతి పనికి ఖచ్చితంగా కనీసం 20 నిముషాలు కేటాయిస్తారు. ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళు ఇవి అమలు చేస్తారు. 3. They spend 15 minutes each day on focused thinking -  🌿వీరు కనీసం ఒక 15 నిముషాలు  - జీవితంలో వారు ఏమి సాధించాలనుకుంటున్నారు..  🌿వాళ్ళ ప్రధమ లక్ష్యం ఏమిటి.. 🌿దానిని అందుకోవడానికి ప్రణాళిక ఏంటి..  🌿అది అందుకున్నాక జీవితం ఎలా ఉంటుంది..  🌿ఎన్ని రోజుల్లో అది సాధించాలి..  🌿ఈరోజు ఎలా ఉండబోతోంది -  అని కళ్ళు మూసుకుని రోజూ మననం చేసుకుంటూ ఉంటారు. 4. They spend time with people who inspire them -  🌿వాళ్ళ సమయ...

నేటి మోటివేషన్... మెదడుని ప్రశాంతంగా ఉంచడం

ఇంటర్నెట్, సోషల్ మీడియా కారణంగా చాలా మంది పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్లతోనే గడిపేస్తున్నారు. రాత్రి చాలా సేపు దానితోనే గడుపుతూ ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయమే ఆలస్యంగా మేల్కొనడం, లేవగానే ఫోన్ పట్టుకుని కూర్చోవడం వంటివి సాధారణమైపోయాయి. దీని కారణంగా మన మెదడు మొద్దుబారిపోతోందని... ఆలోచనా శక్తి, ఏకాగ్రత తగ్గిపోతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ పొద్దునే కొన్ని రకాల అలవాట్లను చేసుకుంటే... మెదడు చురుకుగా మారుతుందని వివరిస్తున్నారు. రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్రలేవడం ఎవరైనా సరే రోజూ దాదాపు ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల మన శరీరంలోని జీవగడియారం (సర్కాడియం రిథమ్) సరిగా సెట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. యోగా లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు, మెడిటేషన్ చేయండి ఉదయమే కాసేపు యోగా లేదా కండరాలను సాగదీసే స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో శరీరంలో ఒత్తిడి తగ...

నేటి మోటివేషన్.. ఏది నిజమైన ప్రేమ

ఒక ముసలి జంట, ఎప్పుడు చూసినా చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ఉండటం చూస్తే, ప్రేమకు అర్థంలా మాత్రమే కాదు, జీవితాన్ని చాలా ఆందంగా చేయి తిరిగిన చేనేతకారుడు అల్లిన గొప్ప వస్త్రంలా అనిపిస్తారు.  ఎన్నో రాత్రులు వారు బాగా దెబ్బలాడుకుని నిద్రపోయి, ఉదయం మళ్లీ ఒకరిని ఒకరు హత్తుకున్నారు కదా అని ఆలోచిస్తాను. ఎన్నో వాదనలు, గొడవలు వారిని విడదీసేందుకు సిద్ధంగా ఉండగా, వారి ప్రేమ మళ్లీ మళ్లీ వారిని కలిపింది కదా? అని ఆలోచిస్తాను  ఎన్నో అపార్థాలను వారు అధిగమించి, తాత్కాలికంగా కలిగిన బాధ కన్నా, వారి బంధం విలువైనదని అర్థం చేసుకున్నారు కదా? అని ఆలోచిస్తాను  ప్రేమ అంటే ఒక కథ కాదు, సంబంధాలు కేవలం భావోద్వేగాలపై ఆధారపడి ఉండవు. నిజమైన ప్రేమ అనేది, కఠినమైన సమయాల్లో, మనవారికోసం తీసుకునే ఒక నిర్ణయం. ఒకరి లోపాలను ఒకరు అంగీకరించడం, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ బలంగా ప్రేమించటం. పరస్పరం క్షమించుకోవడం, కలిసి ఎదగడం, ప్రతి ప్రేమకథకూ పరీక్షలు ఉంటాయనే నిజాన్ని అర్థం చేసుకోవడం. ఆ ముసలి జంట? వారు ఎప్పుడూ పడచువాళ్ళే అనిపిస్తారు. అప్పట్లో వారు కూడా గాఢమైన ప్రేమలో మునిగిపోయి, కొత్త జీవితం వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు. ...

నేటి మోటివేషన్... కష్టే ఫలి... చదివి చూడండి ఒకసారి

సమస్య చిన్నదైనా పెద్దదైనా ప్రయత్నించి చూడు గెలవకపోయినా ప్రయత్నం చేయకుండానే ఓడిపోయాను అన్న ఫీలింగ్ నీకు ఉండదు .. ఈ ప్రపంచంలో ఎంత విచిత్రమైనది అంటే అన్నీ ఉన్నవాడికి చేయాలన్న జ్ఞానం ఉండదు. అవయవాలు సరిగా లేకపోయినా వాళ్ళు ఏంటో నిరూపించుకోవాలి ప్రపంచంలో విజేతలుగా నిలబడాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని మనం బ్లెస్స్ చేయాలి అభినందించాలి .. నేను అనాటమీ న్యూరో క్లాసెస్ నేర్చుకుంటున్నాను అనాటమీ న్యూరో అంటే మన బ్రెయిన్ ద్వారా మన ఆలోచనలని ఎలా నియంత్రించవచ్చు ఎలా డైవర్ట్ చేయొచ్చు అదే క్లాస్ .. మన ఆలోచనలు మారడం వల్ల సగం సమస్యలు పోతాయి అంటే మన ఆలోచనలని మనం నియంత్రించడం ద్వారా మానసిక శరీరకమైన ఎన్నో సమస్యలకి పరిష్కారం మందులు కూడా లొంగనీ ఎన్నో జబ్బులకి మెడిసన్ దొరుకుతుంది.. మా క్లాసులో ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి హైట్ చాలా అంటే చాలా తక్కువ అండ్ ఏదో ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల టోటల్గా  బెడ్ మీద లేచి నడవలేదు చేతులు కూడా సహకరిస్తాయో లేదో తెలీదు కానీ ఆ అమ్మాయి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో గొప్ప మౌత్ పెయింటర్ గా నిలబడింది .. తనను చూస్తే చాలా చిన్న పిల్ల లాగా ఉంటుంది కానీ అంత కాన్ఫిడెన్స్ లెవ...

Global Commodity Producers and Exporters

1. Iron Ore    •  Producer:  Australia   •  Exporter:  Australia 2. Copper    •  Producer:  Chile   •  Exporter:  Chile 3. Gold    •  Producer:  China   •  Exporter:  Switzerland 4. Silver    •  Producer:  Mexico   •  Exporter:  Mexico 5. Aluminium (Bauxite)    •  Producer:  Australia   •  Exporter:  Australia 6. Nickel    •  Producer:  Indonesia   •  Exporter:  Indonesia 7. Platinum    •  Producer:  South Africa   •  Exporter:  South Africa 8. Lithium    •  Producer:  Australia   •  Exporter:  Australia 9. Coal    •  Producer:  China   •  Exporter:  Australia 10. Zinc    •  Producer:  China   •  Exporter:  Peru 11. Steel    •  ...

టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ కి అప్లై చేయడాని

టాటా క్యాపిటల్ పంక్ స్కాలర్షిప్ కి అప్లై చేయడానికి  ఈ నెల 15 చివారితేది 👉 ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్  👉 డిప్లొమా , డిగ్రీ చదివే వాళ్ళు అప్లై చేయవచ్చు https://www.buddy4study.com/page/the-tata-capital-pankh-scholarship-programme లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము లక్ష్య ఉద్యోగ సోపానం వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సుమారు 25,000 మందికి పైగానే మా సేవలను అందిస్తున్నాము... మీ వద్ద ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాతో పంచుకోండి... మేము మా మెంబెర్స్ కి షేర్ చేస్తాము 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

యూనివర్స్ కి సంబందించిన 50 ముఖ్యమైన ప్రశ్నలు..

1. సౌరకుటుంబం మణిహారంగా ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 2. ఏ గ్రహాన్ని God of Agriculture గా పేర్కొంటారు? A. శనిగ్రహం 3. సౌరకుటుంబంలో రెండవ అతిపెద్ద గ్రహం ఏది? A. శనిగ్రహం 4. సౌరకుటుంబంలో అత్యల్ప సాంద్రత గల గ్రహం ఏది? A. శనిగ్రహం 5. Orange Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 6. అందమైన వలయాలు గ్రహం ఏది? A. శనిగ్రహం 7. Golden Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. శనిగ్రహం 8. శనిగ్రహానికి గల ఉపగ్రహాలు ఎన్ని?" A. 82 ఉపగ్రహాలు (ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29) 9. Green Planet అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 10. God of the Sky అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 11. గతితప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. యురేనస్ 12. యురేనస్ కు గల ఉపగ్రహాలు ఎన్ని? A. 27 (మిరిండా, ఏరియల్, టిటానియా ముఖ్యమైనవి) 13. నిర్మాణుష్య గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? A. నెప్ట్యూన్ 14. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం? A. నెప్ట్యూన్ 15. సౌరకుటుంబంలో అతిశీతల గ్రహం ఏది? A. నెప్ట్యూన్ 16. నెప్ట్యూన్ కి గల ఉపగ్రహాలు ఎన్ని? A. 14 ఉపగ్రహాలు 17. అంతర గ్రహాలు అని వేటిని అంటారు? A. ...

కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జారీ చేసిన G.O.MS.No.2 – సమగ్ర ఆదేశాలు

ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.MS.No.2 ద్వారా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి. ఈ ఆదేశాలలో ఉన్న ముఖ్యాంశాలు, పాజిటివ్ మరియు నెగటివ్ అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషించబడింది. ముఖ్యాంశాలు: 1.MTS: ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, మరియు సమాజాల్లో ఖాళీగా ఉన్న నిబంధిత పోస్టులపై నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే న్యూనత పేస్కేల్ వర్తిస్తుంది. MTS ద్వారా నెలవారీ చెల్లింపులు కలిపి ఒకే రూపంలో అందిస్తారు. అయితే, ఈ పేమెంట్‌లో అదనపు అలవెన్స్‌లు, వార్షిక పెంపులు ఉండవు. 2. మాతృత్వ సెలవులు: వివాహిత మహిళా ఉద్యోగులకు రెండు ప్రసవాలకు 180 రోజుల చెల్లింపు మాతృత్వ సెలవు కల్పించడం ఈ ఉత్తర్వుల్లో ప్రధానమైన పాజిటివ్ అంశం. ఈ కాలంలో EPF, ESI వంటి అన్ని ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. 3. ఎక్స్‌గ్రేషియా: అపఘాత మృతి చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, సహజ మృతికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ...

7 జనవరి 2025 రోజువారీ కరెంట్ అఫైర్స్ క్విజ్

Q1. ఇటీవల 'జాతీయ పక్షుల దినోత్సవం' ఏ రోజున జరుపుకున్నారు? (ఎ) 05 జనవరి (బి) 04 జనవరి (సి) 03 జనవరి (డి) 02 జనవరి జవాబు (ఎ) 05 జనవరి Q2. ఇటీవల, నోమురా భారతదేశ GDP 2025 ఆర్థిక సంవత్సరంలో కింది వాటిలో ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేసింది? (ఎ) 6.9% (బి) 8.2% (సి) 6.7% (డి) 5.6% జవాబు (సి) 6.7% Q3. కింది వాటిలో ఏ రాష్ట్రంలో ఏనుగుల సంఖ్య 5828కి పెరిగింది? (ఎ) పశ్చిమ బెంగాల్ (బి) మణిపూర్ (సి) అస్సాం (డి) మిజోరం జవాబు (సి) అస్సాం Q4. ఇటీవల US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్‌గా ఎవరు మారారు? (ఎ) మైక్ జాన్సన్ (బి) స్కాట్ బెస్సెంట్ (సి) కరోలిన్ లెవిట్ (డి) పైవేవీ కాదు జవాబు (ఎ) మైక్ జాన్సన్ Q5. ఇటీవల విడుదల చేసిన ప్రపంచ కాలుష్య ర్యాంకింగ్‌లో కింది వాటిలో ఏది అగ్రస్థానంలో ఉంది? (ఎ) ఇస్లామాబాద్ (బి) న్యూఢిల్లీ (సి) టోక్యో (డి) హనోయి జవాబు (డి) హనోయి Q6. డాక్టర్ రాజగోపాల్ చిదంబరం ఇటీవల మరణించారు. కింది వారిలో అతను ఎవరు? (ఎ) అణు శాస్త్రవేత్త (బి) రచయిత (సి) జర్నలిస్ట్ (డి) పైవేవీ కాదు జవాబు (ఎ) అణు శాస్త్రవేత్త Q7. కింది వాటిలో 2023లో ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తులు ఎగుమతిదారుగా ...

7 జనవరి 2025 కరెంట్ అఫైర్స్

👉జాతీయ పక్షుల దినోత్సవం : పక్షుల సంరక్షణ మరియు అవగాహన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ జనవరి 5న జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 👉నోమురా యొక్క GDP అంచనా : ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రతిబింబిస్తూ 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ GDP 6.7%గా ఉంటుందని నోమురా అంచనా వేసింది. 👉ఏనుగుల జనాభా పెరుగుదల : అస్సాంలో ఏనుగుల సంఖ్య 5828కి పెరిగింది, ఇది విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. 👉US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ : మైక్ జాన్సన్ US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ అయ్యారు, శాసన కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. 👉గ్లోబల్ పొల్యూషన్ ర్యాంకింగ్ : పర్యావరణ సవాళ్లపై దృష్టి సారిస్తూ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ పొల్యూషన్ ర్యాంకింగ్‌లో హనోయి అగ్రస్థానంలో ఉంది. 👉డాక్టర్ రాజగోపాల్ చిదంబరం వర్ధంతి : అణు పరిశోధనలో వారసత్వాన్ని మిగిల్చి, ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల్ చిదంబరం కన్నుమూశారు. 👉టెక్స్‌టైల్ మరియు అపెరల్ ఎగుమతిదారుగా భారతదేశం : 2023లో భారతదేశం తన ప్రపంచ మార్కెట్ ఉనికిని ప్రదర్శిస్తూ ప్రపంచంలో ఆరవ అతిపెద్ద వస్త్ర మరియు దుస్తులు ఎగుమతిదారుగా అవతర...

Fake Universities in India

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) భారతదేశంలో నకిలీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాల జాబితాను నిరంతరం విడుదల చేసింది. ఈ సంస్థలు చట్టబద్ధమైన అనుమతులేకుండా డిగ్రీలు అందిస్తున్నట్లు గుర్తించబడ్డాయి. విద్యార్థులు తమ ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల చెల్లుబాటు కోసం అధికారిక UGC లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా ధృవీకరించుకోవడం ఎంతో అవసరం. నకిలీ విశ్వవిద్యాలయాలు అంటే ఏమిటి ? నకిలీ విశ్వవిద్యాలయాలు అనేవి చట్టబద్ధమైన నియంత్రణ సంస్థల గుర్తింపును పొందకుండా చట్టవిరుద్ధంగా డిగ్రీలు అందిస్తాయి. ఇవి ఆశావహ విద్యార్థులను అక్రమ ధృవపత్రాలు అందించి మోసగిస్తాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇటీవల 2024 మే నాటికి భారతదేశంలో 21 నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విడుదల చేసింది, వీటిని వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయి. UGC ప్రకారం 2024 మే నాటికి నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా మరింత స్పష్టమైన అవగాహన కోసం విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు వివరాల కోసం : 9494524363 క్రమ సంఖ్య రాష్ట్రం విశ్వవిద్యాలయ పేరు : 1 . ఆంధ్ర ప్రదేశ్ క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, #32-32-2003, 7...

నెలల వారీగా తేదీ ---- ప్రత్యేకత

జనవరి » 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం   » 19 - ప్రపంచ శాంతి దినోత్సవం   » 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం   » 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం   ఫిబ్రవరి » రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం  ఫిబ్రవరి రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం » 14 - ప్రేమికుల దినోత్సవం » 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం   మార్చి » 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం  మార్చి 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం » 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం » 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం   » 22 - ప్రపంచ నీటి దినోత్సవం   » 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే   » 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం   ఏప్రిల్ » 1 - ఆల్ ఫూల్స్ డే   » 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం   » 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం   » 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం   » 18 - ప్రపంచ సాంస్కృతిక దిన...

నేటి ఆరోగ్య సూత్ర... ఈ రోజు మనం ఉప్పు స్టోరీ గురించి తెలుసుకుందాం

▪️రాక్ సాల్ట్ అంటే ,దొడ్డు ఉప్పు, కల్లుప్పు, రాళ్ళ ఉప్పు ...ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా!. ▪️అయితే ఈ రాక్ సాల్ట్" కి, సన్న ఉప్పు అంటే టేబుల్ సాల్ట్ కి ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం. ▪️మనిషి తన ఆహారంలో సముద్రపు ఉప్పు తగిలితే మంచి రుచి వస్తుందనే విషయం కనుక్కున్నప్పటి నుంచీ తరతరాలుగా వేల ఏళ్లుగా… సముద్రపు ఉప్పునే వాడుతూ వస్తున్నాడు. ▪️అప్పట్లో బీపీలు లేవు ! ఒంట్లో ఎముకల నొప్పులు లేవు.!! థైరాయిడ్ సమస్యల్లేవు.!!! ఊళ్లల్లో కిరాణ షాపుల ముందు బస్తాల కొద్దీ ఈ కల్లు ఉప్పు బస్తాలు జస్ట్ అలా బయటే వదిలేసేవారు. ఎందుకంటే ఉప్పును ఎవరూ దొంగతనం చేయరు. ▪️ ఎవరైనా ఉప్పు ఉచితంగా అడిగితే నిరాకరించవద్దనే నియమం కూడా అప్పట్లో ఉండేది. ♦️▪️ ఆ రోజులు పోయాయి ▪️అంతా సన్న ఉప్పు(టేబుల్ సాల్ట్) అదీ అయోడైజ్డు ఉప్పు మన కిచెన్లలోకి వేగంగా వచ్చేసింది ! ▪️కల్లు ఉప్పుతో పోలిస్తే ఇది సన్నగా, అంటుకోకుండా ఉండటంతో అందరూ దీన్నే ప్రిఫర్ చేస్తున్నారు… ▪️కానీ, ఇది మన ఆరోగ్యానికి విపరీతంగా హాని చేయడం మొదలుపెట్టింది. ♦️ అదెలా స్టార్టయిందంటే..? ▪️ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు అయోడిన్లోపం వల్ల , "గాయిటర్  అనే వ్యాధి...