తన గురించి తాను తెలుసుకోవడమే విద్య అన్నారు స్వామి చిన్మయానంద. విద్య అనేది జనంలో ఆస్తికతను పెంచాలి తప్ప నాస్తికతను పెంచకూడదు.
మనం ఏం చదువుకున్నామో అది మన జీవితంలో ఉపయోగపడాలి. ఈ రోజు గమనిస్తే, మనం చదివిన చదువుకి, చేసే పనికి ఎంతమాత్రం పోలిక ఉండదు. వేదం అంటుంది కేవలం చదవడమే కాదు, మీరు చదివిన చదువు మీకు మీ జీవితంలో ఉపయోగపడాలి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడాలి, మీరు నేర్చుకున్న విద్యతో కొత్త విషయాలను వెలుగులోకి తేవాలి అంటే ముందుగా మీరు నేర్చుకున్న విద్య మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది మీ మనసులోకి దట్టించకూడదు, మీకు మీరుగా స్వేచ్చగా తెలుసుకునేంత ఆసక్తిగా ఉండాలి. విద్య మీ సంస్కారాన్ని వృద్ధి చేయాలి, మీ జీవితాన్ని, మీ ద్వారా సమస్త సమాజాన్ని ఉద్ధరించాలి. మీలో స్వార్ధాన్ని తొలగించాలి. మీ ధృక్పదాన్ని మార్చాలి. నేను, నా కుటుంబం అనే భావన నుంచి సమస్త ప్రపంచం నా కుటుంబమే (వసుదైవ కుటుంబకం) అన్న భావన తీసుకురావాలి. విద్య దైవాన్ని దర్శింపజేయాలి. మీలో మీకు తెలియని రహస్యాలను తెలియజేయాలి. మీలో ఉన్న సమస్త శక్తిని బహిర్గతం చేయాలి. ఆత్మ తత్వాన్ని భోధించాలి. అదే నిజమైన విద్య.
Comments
Post a Comment