Skip to main content

నేటి మోటివేషన్... గర్వము దరి చేరరాదు



అదొక పల్లెటూరు. అపుడే సూర్యుడస్తమించాడు. చీకటి నలుదెసల అలముకుంటున్నది. వీధి దీపాలు లేని కుగ్రామమది. పొలాలకు వెళ్ళిన కర్షకులు గేదెలను తోలుకొని ఇళ్ళకు చేరుతున్నారు. దోవ సరిగా కానరావడం లేదు. మిణుగురు పురుగులు ఆ చీకటిలో ఎగురుతూ అందమైన కాంతులనిస్తున్నాయి. “మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని గర్వంతో ఎగురుతున్నాయి.

కొద్దిసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మినుకుమినుకుమని ప్రకాశిస్తున్నాయి. నక్షత్రాల వెలుగులో కొద్దిగా దోవ కనిపిస్తూ వున్నది. తమకంటే ఎక్కువ కాంతినిచ్చే నక్షత్రాలు ప్రకాశించడం వలన మిణుగురు పురుగుల గర్వమణిగింది. అపుడు”ఈ చీకటిలో మేము వెలుతురిస్తున్నాం, మేము వెలుతురిస్తున్నాం” అని నక్షత్రాలు గర్విస్తున్నాయి. 

మరికొంతసేపటికి తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించి పిండారబోసినట్లు వెన్నెలను నలుదిక్కులా ప్రసరింపజేస్తున్నాడు. తమకంటే ఎక్కువ వెలుగునిచ్చే చంద్రుడు ప్రకాశించుటవలన నక్షత్రముల గర్వమణిగిపోయినది. అపుడు “నేను వెన్నెలనిస్తున్నాను, నేను వెన్నెలనిస్తున్నాను” అని చంద్రుడు గర్వించాడు. తన వలననే భూమి మీద జనులు వెన్నెట్లో తిరగగలుగుచున్నారని భావించాడు. 

కొలది గంటల పిదప తూర్పుదిక్కున సూర్యుడు ఉదయించాడు. అంతటితో చంద్రుని గర్వం తగ్గిపోయింది. ప్రకాశాన్ని కోల్పోయి చంద్రుడు వెలవెలపోయాడు.
ప్రకృతిలోని ఈ సన్నివేశాన్ని గమనించి ఎవరూ తమకు విద్య ఉన్నదనీ, అందం ఉన్నదనీ, ధనమున్నదనీ గర్వపడకూడదు. విద్యార్థులు తమకంటే అధిక విద్యావంతులతో పోల్చుకొని గర్వాన్ని దూరం చేసుకోవాలి. గర్వం అభివృద్ధికి అడ్డంకిగా ఉంటుంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

🚨 తల్లికి వందనం స్టేటస్ కోసం ఈ లింక్ చెక్ చేయండి

తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. 💰 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో, దరఖాస్తు ఆమోదం పొందిందో లేదో ముందుగానే తెలుసుకోవడం కోసం పై లింక్ ఓపెన్ చేసి... మీ అబ్బాయి/అమ్మాయి ఆధార్ enter చేయండి  కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఒకే కుటుంబంలో అర్హత కలిగిన ఒక్కరికంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే, ప్రతి విద్యార్థికి విడివిడిగా ప్రయోజనం అందే అవకాశం ఉంది. క్రింది కారణాల వల్ల మీ దరఖాస్తు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది: ❌ అర్హత నిబంధనలకు సంబంధించిన వివరాలు సరిపోకపోతే ❌ బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు NPCIతో అనుసంధానం కాకపోతే ❌ ఇతర ధృవీకరణ వివరాల్లో లోపాలు ఉంటే మీ ఆధార్ వివరాలతో ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించవచ్చు. 📱 మరిన్ని వివరాల కోసం: https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ https://apgovtschemes.com/thalliki-vandanam-status-check-2026-27/ 📢 గమనిక: తుది అర్హత, చెల్లింపు తేదీలు మరియు నిబంధనలు ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా మారవచ్చు. 🏹Lakshya🇮...

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/reader Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఫ్లాష్ ఫ్లాష్ AP పాలీ సెట్ ఫలితాలు విడుదల...

https://polycetap.nic.in/rank_card_2021.aspx 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺