Skip to main content

నేటి మోటివేషన్... ఇదే కర్మ సిద్ధాంతం....


ఒక రాజు.. తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి..వారికి ఒక్కొక్క ఖాళీ గోనె బస్తా బ్యాగ్ లను చేతికిచ్చి..అరణ్యంలోనికెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు,ఫలాలను అందులో నింపి..సాయంత్రం లోపు తీసుకు రావలసిందిగా ఆజ్ఞాపించాడు..

ముగ్గురూ అరణ్యం లోనికెళ్లారు....

మొదటి మంత్రి ఆలోచించాడు..
రాజు గారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండిఉండాలి,కనుక మంచి పండ్లు తీసుకు వెళ్ళాలి,
అనుకుంటూ అరణ్యం అంతా తిరుగుతూ పండ్లు నింపసాగాడు..

రెండో మంత్రి ఆలోచన
రాజు గారికి పండ్లకి కొదవ లేదు..
అయినా మాకు పంపారు..
సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు.
.అనుకుంటూ కంటికి కనిపించిన పండ్లు తాజా,వాడిన,పుచ్చిన భేదభావం లేకుండా నింపసాగాడు.

ఇక మూడో మంత్రిచాలా చతురంగాఆలోచించాడు..
రాజు గారికి చాలా పనులు..
పండ్ల అవసరం అతనికి లేదు.,
పై పైన చూస్తే చూడొచ్చు.బస్తా ఖాళీచేసి చూసే సమయం కూడా ఉండదు..
చూడనిదానికి కష్టపడి అడివంతా తిరగాల్సిన అవసరం ఏముంది..
అనుకుంటూ ఆకులు అలములతో బస్తానింపి..పైన కొన్ని పండ్లతో అలంకరించేసాడు..

సాయంత్రం ముగ్గురూ పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారి ముందు హాజరయ్యారు...

మూడో మంత్రి ఊహించినట్లే..
రాజు గారు చాలా పనుల్లో తలమునకలై ఉన్నారు..
కనీసం బస్తాలు వంక చూడనైనా చూడకుండా సైనికులను ఆదేశించారు.
"*ఈ ముగ్గురినీ చెరసాలలో నెల రోజుల పాటు వారి పండ్ల బస్తాలతో పాటు బంధించండి.
తినడానికి ఏమి ఇయ్యరాదు..
వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం"

ముగ్గురిని చెరసాలలో బంధించారు..

మొదటి మంత్రి..చక్కని తాజా పండ్లు మూలంగా ఎలాంటి ఆకలిబాధలు లేకుండా శిక్షాకాలం పూర్తిచేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు.

రెండవ మంత్రి..కొన్నిరోజుల వరకు బాగానే తిన్నా..కుళ్ళిన,వాడిన పండ్లు మిగతా రోజుల్లో తిని తీవ్ర అస్వస్థతకు గురై మంచాన పడ్డాడు..శాశ్వతంగా.

మూడవ మంత్రి.. పైపైన అలంకరించిన పండ్లతో 2 రోజులు గడిపి..ఆకులు,
అలములు తో మరో వారం పాటు మాత్రమే గడిపి..పైలోక యాత్రకు వెళ్ళిపోయాడు శిక్షాకాలం ముగిసే లోపే..

కర్మ :మనం చేసిన పనులకు తగిన ప్రతిఫలం తప్పక లభిస్తుంది...
మంచి కర్మలకి మంచి,
చెడు/పాప కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు..

1000 గోవుల మంద ఉన్నా..
దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా పోగలదో..
మంచి, చెడు కర్మలు కూడా అలానే మనల్ని వెదుక్కుంటూ వచ్చేస్తాయి.
కర్మ సిద్ధాంతం పనిచేసే తీరు ఇదే...

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

ఆధునిక భారతదేశ చరిత్ర top 30 bits....

1. భగత్ సింగ్‌కు మరణశిక్ష విధించిన న్యాయమూర్తి ఎవరు?  జ: GC హిల్టన్  2. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు?  జ: గోపాల్ కృష్ణ గోఖలే  3. ఏ చట్టాన్ని అప్పీల్ లేకుండా, లాయర్ లేకుండా మరియు వాదన లేకుండా చట్టం అని పిలుస్తారు.  జ: రౌలట్ చట్టం  4. దండా ఫౌజ్‌ను ఎవరు ఏర్పాటు చేశారు?  జ: చమందీవ్ (పంజాబ్)  5. పాముల దేశం అని దేనిని పిలుస్తారు?  జ: బ్రెజిల్  6. మరణశిక్ష విధించిన అతి పిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు?  జ: ఖుదీరామ్ బోస్  7. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా కైసర్-ఎ-హింద్ బిరుదును ఎవరు తీసుకున్నారు? నిరాకరించారు.  జ: మహాత్మా గాంధీ  8. గదర్ పార్టీని ఎవరు స్థాపించారు?  జ: లాలా హర్దయాల్, కాశీరాం  9. ఫార్వర్డ్ బ్లాక్ సంస్థ స్థాపకుడు ఎవరు?  జ: సుభాష్ చంద్రబోస్  10. కాంగ్రెస్ ఎప్పుడు, ఏ పార్టీలలో చీలిపోయింది?  జ: 1907 మితవాదులు మరియు తీవ్రవాదులు (సూరత్ సెషన్)  11. కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు?  జ: బద్రుద్దీన్ త్యాబ్జీ  12. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు.  జ: శివాజీ ...

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ