Skip to main content

నేటి మోటివేషన్... లక్ష్యం సాధించాలంటే



జీవితంలో లక్ష్యాలను సాధించి, ఉన్నత స్థానాలను పొందినవారిని చూసినప్పుడల్లా, వీరికి ఎలా సాధ్యమవుతోందని అనుకోవడం సహజం. మనకంటూ ఓ పట్టికను తయారుచేసుకుని దాన్ని రోజూ అనుసరించగలిగితే విజయం మన సొంతం కావడానికి ఎక్కువ సమయం పట్టదు.‌* అవకాశాలను చేజిక్కించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలాగే దొరికిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో జారవిడుచుకోకుండా చూసుకోవాలి. సూర్యోదయాన్ని చూడటానికి ఆలస్యం చేస్తే... మళ్లీ మర్నాటి కోసం ఆగాల్సిందే. అవకాశం కూడా అలాంటిదే. ఒకసారి వదిలేస్తే మరోసారి వచ్చేవరకూ ఎదురు చూస్తుండాలి. 
* ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. మానసికంగానూ దృఢంగా ఉంటారు. అప్పుడే లక్ష్యసాధనలో శారీరక, మానసిక బలం మీ వద్ద ఉన్నట్లే. 
* సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి. యోగాతో దీనిని సాధించవచ్చు. ప్రతికూలంగా ఆలోచించడం మానేయడం, అలా చెప్పేవారిని దూరంగా ఉంచడం ఎంతో అవసరం. అప్పుడే విజయం మీ వైపు ఉంటుంది. 
* రోజూ చేయవలసిన పనులను ఓ పట్టికలా రూపొందించి, అనుకున్న సమయానికి వాటిని పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే లక్ష్యంవైపు వెళ్లే మార్గం సుగమం అవుతుంది. 
* కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించాలి. వారితో అన్ని విషయాలను పంచుకోవాలి. మీ ఆలోచనలకు వారి చేయూత మీలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. 
* లక్ష్యం వెంట పరుగులు వద్దు. మీకు నచ్చినట్లు, నమ్మకంతో ప్రయత్నించండి. మీరు చేరుకోవలసిన లక్ష్యం మిమ్మల్ని వెతుక్కుంటూ అదే వస్తుంది. 
* ఒకే దిశగా ఆలోచిస్తే పరిష్కారం దొరకదు. దీనికోసం ఆలోచనాశక్తిని పెంపొందించుకుంటే, ఫలితం మీకే తెలుస్తుంది.
* ఎవరైనా లక్ష్యం చేరుకోలేకపోతున్నారంటే, కారణం వారికి తగినంత శక్తి లేకపోవడం కాదు, కావలసినంత విజ్ఞానం లేకపోవడం కూడా. కాబట్టి విజ్ఞానాన్ని పెంచుకుంటూ, సాధించాలనే తపనా, కోరిక ఉండాలి. అప్పుడే అనుకున్నది సొంతమవుతుంది.

🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

Comments

Popular posts

నేటి ప్రధాన వార్తా పత్రికలు తెలుగు మరియు ఇంగ్లీష్

                             ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news English Newspapers        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index Deccan Chronicle http://epaper.deccanchronicle.com/states.aspx Indian Express https://epapeHr.newindianexpress.com/t/3464 The Hans India https://epaper.thehansindia.com/ 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి ప్రధాన వార్తా పత్రికలు

🗞️ఈనాడు ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.eenadu.net 📰ఆంధ్రజ్యోతి ➪ 🅐🅟 & 🅣🅢 http://mpaper.andhrajyothy.com/ 🗞️సాక్షి ➪ 🅐🅟 & 🅣🅢 http://epaper.sakshi.com/ 📰ఆంధ్రప్రభ ➪ 🅐🅟 & 🅣🅢 https://epaper.prabhanews.com/ 🗞️V6 వెలుగు➪ 🅣🅢 https://epaper.v6velugu.com 📰నవ తెలంగాణ ➪ 🅣🅢 http://epaper.navatelangana.com/ 🗞️నమస్తే తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.ntnews.com 📰మన తెలంగాణ ➪ 🅣🅢 https://epaper.manatelangana.news 🧾English Newspapers🗞️        ☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟☟ 👉🏻The Hindu📰 https://epaper.thehindu.com/Home/Index 👉🏻Deccan Chronicle📰 http://epaper.deccanchronicle.com/states.aspx 👉🏻Indian Express📰 https://epaper.newindianexpress.com/t/3464 👉🏻The Hans India📰 https://epaper.thehansindia.com/           🏹లక్ష్య🇮🇳స్వచ్చంద📚సేవా🩺సంస్థ

నేటి మోటివేషన్... మీ హాబీ ఏమిటి?

హీరో సల్మాన్‌ఖాన్‌ చక్కగా పెయింటింగ్స్‌ వేస్తాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ గిటార్‌ అద్భుతంగా వాయిస్తాడు. అనిల్‌ అంబానీ క్రమం తప్పకుండా మారథాన్‌లలో పాల్గొంటాడు. రతన్‌ టాటా పియానో వాయిస్తాడు. అమితాబ్‌ బచ్చన్‌ బ్లాగు రాస్తుంటాడు. దియా మిర్జాకి కుండలు చేయడమంటే భలే సరదా. తమ వృత్తి వ్యాపారాల్లో కోట్లు సంపాదిస్తున్న వీరంతా ఈ పనులు ఎందుకు చేస్తున్నట్లు? ఎందుకంటే ఆ హాబీలు వారిని రీఛార్జ్‌ చేస్తాయి మరి!రోజూ ఛార్జింగ్‌కి పెట్టకపోతే మొబైల్‌ ఫోన్‌ మూగబోతుంది.  బ్యాటరీ అయిపోతే ఏ రిమోటూ పనిచేయదు.  పెట్రోలు పోయించకపోతే బండి అంగుళం కూడా కదలదు.  మరి మన శరీరం? దానికి రీఛార్జింగ్‌ ఎలా? యంత్రం కాదు కాబట్టి దానికి తిండి ఒక్కటే సరిపోదు. వారానికో సినిమా, షికారూ; ఏడాదికో రెండేళ్లకో వారం రోజుల టూరూ వెళ్లొస్తే చాలు రీఛార్జ్‌ అయిపోతామనుకుంటారు చాలామంది. కొన్నాళ్లవరకూ వాటి ప్రభావంతో ఉత్సాహంగా పనిచేయొచ్చేమో కానీ వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకోవాలంటే మాత్రం ఇష్టమైన ఓ ప్రవృత్తి ఉండాలంటున్నారు నిపుణులు. అప్పుడే మనసూ శరీరమూ రెండూ రీఛార్జ్‌ అవుతాయట. సృజనశక్తీ ఉత్పాదకతా పెరుగుతాయట. పైన చెప్పిన సెలెబ్రిటీలందరూ తమ హాబ...