Skip to main content

Posts

నేటి మోటివేషన్... పలకరింపు

మనుషులకు మాత్రమే వున్న వరమిది... మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది. ❤️పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి... ❤️*ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది*. *❤️పలకరింపు అనేది మంచితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*    ❤️*నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు*. *❤️ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు*. ❤️*కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*    ❤️ *ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు*. ❤️*ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు*. ❤️*మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_  ❤️ *పలకరింపుకు అంత శక్తి వుంది*. ❤️*పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు*. ❤️*తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు*. ❤️*వారి...

నేటి మోటివేషన్... ఓ జీవిత సత్యం

 ఓ కొడుక్కి…తండ్రి కొన్ని మేకులు ఇచ్చి….నీకు రోజుకి ఎంత మంది మీద అయితే కోపమొస్తుందో అన్ని మేకులు గోడకు కొట్టు అని అన్నాడు.!        మొదటి రోజు 20, తర్వాతి రోజు 15, మూడవ రోజు 10 ఇలా…తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకు కొట్టేశాడు కొడుకు. మేకులు అయిపోగానే…కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి నాన్నా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని అన్నాడు.  ఓ …అంటే నీకు చాలా మంది మీదే కోపం వచ్చిందిరా..అన్నాడు తండ్రి కొడుకుతో…!? ఆ… అయితే…. రేపటి నుండి రోజుకు కొన్ని మేకుల చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయ్ అన్నాడు కొడుకుతో తండ్రి… తండ్రి చెప్పినట్టే…కష్టపడి గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు కొడుకు… కొన్ని మేకులు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు. ఏమయ్యిందిరా? అని అడిగాడు కొడుకుని తండ్రి….. గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాను నాన్న అన్నాడు కొడుకు.. మరి గోడ ఎలా ఉందిరా? మేకులైతే తీసేశాను కానీ..వీటి వల్ల గోడలకు అయిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్నా అన్నాడు కొడుకు.  అప్పుడు తండ్రి..కొడుకు తో..” చూశావా.. మేకులు కొట్టేటప్పుడు ఈజీగా కొట్టావ్.! తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. మేకులు తీసిన...

నేటి మోటివేషన్... జీవితంలో డబ్బే ముఖ్యము కాదు అనడానికి చిన్న ఉదాహరణ.

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు.. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది.. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!! అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!! అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ..! ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!! అని చెప్తుంది.. అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు.. తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు.. పిల్లల్ని మర్చిపోతాడు.. ప్రపంచాన్ని మర్చిపోతాడు. .అలా రుద్దుతునే వుంటాడు.. గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!! ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది.. రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు.. అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు.. పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు.. కొత్త భవనాలు వెలసి వుంటాయి.. కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి.. స్నేహితులు.. చుట్టాలు.. పుస్తకాలు.. ప్రేమ,పెళ్ళి... జీవితం ప్రసాదించిన అన్ని ...

నేటి మోటివేషన్... తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం

నాన్న మీ కాలంలో 1. ఇంత టెక్నాలజీ లేదు.. 2.విమానాలు లేవు.. 3.. ఇంటర్నెట్ లేదు.. 4.. TV లు లేవు.. 5.. కంప్యూటర్లు లేవు.. 6.. ఏసీ లు లేవు.. 7.. లగ్జరీ కార్ లు లేవు.. 8.. మొబైల్ ఫోన్ లు లేవు... మీరెలా బతికారు...   *దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవ వలసిందే*...........   మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే  1. ప్రార్ధన లేకుండా.. 2. మర్యాద లేకుండా  3. ప్లానింగ్ లేకుండా  4. క్రమశిక్షణ లేకుండా.. 5. పెద్దల ఎడ గౌరవం లేకుండా.. 6. మన చరిత్ర పై అవగాహన లేకుండా.. 7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా.. 8. Morals లేకుండా... ఎలాగైతే హాయిగా రోజులు గడిపేస్తున్నారో...  మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము... మేము మీలాగా...  1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు.. 2. పాఠశాల వేళలు అయినా  తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము  TV లు చూడలేదు... 3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక  నిజమైన స్నేహితులతో గడిపాము.. 4. దాహము వేస్తె కుళాయి నీరు తాగాము..  బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు.. 5. ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా  మాకెప్పుడూ జబ్బుల...

నేటి మోటివేషన్... జీవితం

ఒక తండ్రి తన కొడుకుకి రాసిన లేఖ  నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి. 1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు. 2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు. 3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని. ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో 1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో. నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా ! 2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు. ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయ...

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి

ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది. అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి, ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు. రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు. ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు.  అన్నీ పూర్తయ్యాక, రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు. ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు.  కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే రాజుకు కోపం వచ్చి...

నేటి మోటివేషన్... చాణక్యుడు నీతిశాస్త్రంలో చెప్పిన గొప్ప విషయాలు...

ఆచార్య చాణక్యుడు మనిషి ఎప్పటికీ మరచిపోకూడని కొన్ని విషయాలను నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. నేటికీ ఆచార్య చాణక్యుడి విధానాలు మనిషి జీవితాన్ని విజయవంతం చేసేందుకు ప్రేరణకల్పిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 🌿ఒత్తిడి లేకుండా జీవించడం ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఒత్తిడి లేకుండా జీవించేందుకు ప్రయత్నించాలి.  👉ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది, ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి సైతం ఒత్తిడి తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఒత్తిడి లేకుండా ఉండటం ద్వారా మనిషి ప్రతి క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు.  👉ఎప్పుడూ తనను తాను నమ్ముకుంటే ఒత్తిడిని జయించవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు. 🌿సమస్యలతో ధైర్యంగా పోరాడటం 👉చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి అన్ని ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి.  👉వైఫల్యం ఎదురైనప్పుడు నిరాశ చెందకూడదు. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది ఖచ్చితంగా వ్యక్తికి విజయాన్ని అందిస్తుంది. 🌿పరధ్యానంగా ఉండవద్దు 👉మనిషి ఎప్పుడూ కూడా పరధ్యానంగా, నిరుత్సాహంతో, నిరాశ చెందుతూ ఉండకూడదు.  👉కష్టాలను ఎదుర్కోవా...