Skip to main content

Posts

Showing posts from March, 2023

నేటి ఆరోగ్య సమాచారం... తలనొప్పి గురించి సమగ్ర సమాచారం...

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. 1. మీరు ఒత్తిడికి గురవుతున్నారా ? టెన్షన్ తలనొప్పి 2. తలనొప్పికి ముందు జ్వరం వచ్చిందా ? ఇన్ఫెక్షన్లు 3. దంతాలకు గాని, చిగుళ్లకుగాని ఏదైనా సమస్య ఉందా ? దంత సమస్యలు 4. ఆల్కహాల్ తీసుకున్న తరువాత తలనొప్పి వస్తుందా ? మదాత్యయం (ఆల్కహాలిజం) 5. కళ్లు ముట్టుకోలేనంత నొప్పిగా ఉంటాయా ? నీటికాసులు (గ్లాకోమా) 6. తలనొప్పితోపాటు చూపు మసకబారటం, వాంతి వచ్చినట్లుండటం జరుగుతాయా ? మైగ్రేన్ తలనొప్పి 7. తరచుగా జలుబు చేస్తున్నదా ?  నిత్యరొంప (సైన సైటిస్) 8. తలనొప్పితోపాటు మెడనొప్పి వుందా ? తలతిప్పడం కష్టమౌతుందా ? మెడ వెన్నుపూసలు అరిగిపోవటం (సర్వైకల్ స్పాండిలోసిన్) 9. చెవిపోటు ఉన్నదా ? చెవి సమస్యలు 10. తలనొప్పితో పాటు గొంతు పచ్చిపుండులాగా నొప్పిగా ఉంటున్నదా ? అంగటి ముల్లు (టాన్సిలైటిస్) 11. కణతలలో పొడుస్తున్నట్లుగా నొప్పి వస్తున్న దా? టెంపోరల్ అర్టిరైటిస్ 12. తలకు దెబ్బ తలిగిందా ? తలకు దెబ్బతగలడం ...

నేటి మోటివేషన్... మీ పిల్లల కోసం

దయచేసి మీరూ చదవండి......... మీ పిల్లలనూ చదివేలా చేయండి.......... ప్లీజ్........ ఓ యువకుడు ఓ మంచి ఉద్యోగం కోసం ఓ పెద్ద కంపెనీకి ఇంటర్వూకు వెళ్ళాడు. చక్కగా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు............చివరి పరీక్షకు డైరెక్టరు దగ్గరికి వెళ్ళాడు. డైరెక్టరు : నీవు చదువుకునే రోజుల్లో ఏదైనా స్కాలర్షిప్ వచ్చిందా? యువకుడు: లేదండీ! మా నాన్నగారే అన్ని ఫీజులు కట్టెవారు....... డైరెక్టరు: మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? యువకుడు: బట్టలు ఉతికే వృత్తినే చేస్తూ నన్ను చదివించారు....... డైరెక్టరు: అయితే నీ చేతులను ఒకసారి నాకు చూపించు. యువకుడు: తన చేతులను చూపించాడు........అవి చాలా సున్నితంగా నాజూకుగా ఉన్నాయి. డైరెక్టరు: నువ్వు ఎప్పుడైన నీ తల్లిదండ్రులకు బట్టలు ఉతకడంలో సహాయపడ్డావా? యువకుడు: లేదండీ! వారు నన్ను కష్టపడనివ్వకుండా మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించమని చెప్పేవారు.....నేను అలాగే చేశాను. డైరెక్టరు: నిజంగా నువ్వు ఈ ఉద్యోగానికి అన్ని అర్హతలు ఉన్నావాడివి .నాదొక చిన్న విన్నపం.చేస్తాను అంటేనే చెపుతాను. యువకుడు: తప్పకుండా చేస్తాను చెప్పండి సర్. డైరెక్టరు: ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తరువాత మీ తల్లిద...

నేటి మోటివేషన్... మీకు తెలుసా ఈ ఏడు ప్రశ్నలకు సమాధానాలు...

7 ప్రశ్నలకు చాలా అద్భుతంగా జవాబు చెప్పిన "గురువు." 1వ ప్రశ్న: ప్రపంచంలో ఏది పదునైనది? జ: చాలా మంది కత్తి అని చెప్పారు.  గురువు: కాదు,మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు. 2వ ప్రశ్న: మనకు అత్యంత దూరంలో వున్నది ఏమిటి ? జ: చాలా మంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ గురువు: మనకు అత్యంత దూరంలో వున్నది గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్లలేము.అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్లలేము. 3వ ప్రశ్న:ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది? జ: చాలా మంది పర్వతం ,సూర్యుడు ,భూమి ఇలా ఎన్నో అంటారు. గురువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే. 4వ ప్రశ్న: ప్రపంచంలో కఠినంగా,బరువుగా ఉండేది ఏది ? జ: చాలామంది,వజ్రము ఇనుము,ఏనుగు అని చెప్పారు. *గురువు:* కఠినమైనది అనేది *"మాట ఇవ్వడం"* మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం. 5వ ప్రశ్న:ప్రపంచంలో తేలికైనది ఏది? జ: దూది, గాలి, ఆకులు అని చెప్పారు  గురువు: ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్...

AP BUDGET HIGHLIGHTS TODAY

2023- 24 వార్షిక బడ్జెట్‌ (Annual Budget 2023-24)ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి (AP Minister Buggan Rajendranath Reddy) గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి మొదలుపెట్టారు. బడ్జెట్ రూపకల్పనలో భాగ్యస్వాములకు కృతజ్ఞతలు తెలియజేశారు. బడ్జెట్ ముఖ్యాంశాలు... రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్ ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు పర్యావరణానికి రూ.685 కోట్లు జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు కార్మిక శాఖకు రూ.796 కోట్లు, ఐటీ శాఖకు రూ.215 కోట్లు న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు ...

నేటి ఆరోగ్య సమాచారం... బహిష్టు నొప్పి

గమనిక: ఆరోగ్య నిపుణులు, పరిశోధనల ప్రకారం ఈ వివరాలను అందించాం. కేవలం వైద్య సామాజిక అవగాహన కొరకు మాత్రమే.  ఈ పోస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు హెల్త్ కి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్స్ ని కలవండి. 1. బహిష్టు ప్రారంభమయ్యే ముందు పొత్తికడుపు నొప్పిగా ఉంటుందా ? శారీరక క్రియ 2. బహిష్టు నొప్పి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించడం మానేసిన తరువాత నుంచి ప్రారంభమైందా ? గర్భనిరోధకమాత్రలను వాడుతూ ఆపేయడం 3. గర్భాశయాంతర్గత సంతాన నిరోధక సాధనాన్ని (ఐ.యు.సీ.డి.) అమర్చుకున్నారా ? కుటుంబ నియంత్రణా సాధనం వల దుష్ఫలితాలు 4. కడుపు నొప్పిం నడుము నొప్పిలతోపాటు మైథనంలో నొప్పి ఉంటుందా? మల మూత్ర నిర్హరణ వ్యవస్థలో తేడాలు చోటు చేసుకున్నాయా ? గర్భాశయ అంతర్గత పొర ఇతర ప్రదేశాల్లో పెరగటం  (ఎండో మెట్రియోసిస్) 5. పొత్తికడుపు ఉబ్బరించినట్లుండటమే కాకుండా, తుంటి ప్రాంతం, నడుము ప్రాంతాల్లో బరువుగా ఉంటుందా ? గర్భాశయంలో నారవంటి కండర పెరుగుదలలు తయారవ్వటం (ఫైబ్రాయిడ్స్) 6. నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఊహించగలవి కాకుండా ఉందా ? గర్భాశయంలో తిత్తి వంటి నిర్మాణాలు పెరగటం (పాలిప్స్) 7. గర్భాశయం ద్వారానికి ఇంతకుముందు ఇన్ఫెక్షన...

నేటి మోటివేషన్... పలకరింపు

మనుషులకు మాత్రమే వున్న వరమిది... మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది. ❤️పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి... ❤️*ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది*. *❤️పలకరింపు అనేది మంచితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*    ❤️*నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు*. *❤️ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు*. ❤️*కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*    ❤️ *ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు*. ❤️*ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు*. ❤️*మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_  ❤️ *పలకరింపుకు అంత శక్తి వుంది*. ❤️*పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు*. ❤️*తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు*. ❤️*వారి...

నేటి మోటివేషన్... ఓ జీవిత సత్యం

 ఓ కొడుక్కి…తండ్రి కొన్ని మేకులు ఇచ్చి….నీకు రోజుకి ఎంత మంది మీద అయితే కోపమొస్తుందో అన్ని మేకులు గోడకు కొట్టు అని అన్నాడు.!        మొదటి రోజు 20, తర్వాతి రోజు 15, మూడవ రోజు 10 ఇలా…తన చేతిలో ఉన్న మేకులన్నీ గోడకు కొట్టేశాడు కొడుకు. మేకులు అయిపోగానే…కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి నాన్నా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి అని అన్నాడు.  ఓ …అంటే నీకు చాలా మంది మీదే కోపం వచ్చిందిరా..అన్నాడు తండ్రి కొడుకుతో…!? ఆ… అయితే…. రేపటి నుండి రోజుకు కొన్ని మేకుల చొప్పున గోడ నుండి నువ్వు కొట్టిన మేకులు తీసేయ్ అన్నాడు కొడుకుతో తండ్రి… తండ్రి చెప్పినట్టే…కష్టపడి గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు కొడుకు… కొన్ని మేకులు తొలగించడానికి చాలా కష్టపడ్డాడు. ఏమయ్యిందిరా? అని అడిగాడు కొడుకుని తండ్రి….. గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాను నాన్న అన్నాడు కొడుకు.. మరి గోడ ఎలా ఉందిరా? మేకులైతే తీసేశాను కానీ..వీటి వల్ల గోడలకు అయిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి నాన్నా అన్నాడు కొడుకు.  అప్పుడు తండ్రి..కొడుకు తో..” చూశావా.. మేకులు కొట్టేటప్పుడు ఈజీగా కొట్టావ్.! తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. మేకులు తీసిన...

నేటి మోటివేషన్... జీవితంలో డబ్బే ముఖ్యము కాదు అనడానికి చిన్న ఉదాహరణ.

ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు.. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది.. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం..అది...!! అతడు దాన్ని రుద్ది చూస్తాడు..ఆశ్చర్యం..!! ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి..!! అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ..! ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా ఆమాయ పోతుందీ...!! అని చెప్తుంది.. అంతే ఆ మనిషి తన ఇంటిలో వున్న నేలమాళిగలోకి వెళ్ళి నాణేన్నిరుద్దటం మొదలు పెడతాడు.. తనను తాను మర్చిపోతాడు.. కుటుంబాన్ని మర్చిపోతాడు.. పిల్లల్ని మర్చిపోతాడు.. ప్రపంచాన్ని మర్చిపోతాడు. .అలా రుద్దుతునే వుంటాడు.. గుట్టలుగా సంపదను పోగెస్తునే వుంటాడు..!! ఒకరోజు అతడికి ఇక చాలనిపిస్తుంది.. రాగినాణేన్ని పక్కన పడేసి..బయటికి వస్తాడు.. అతడిని ఎవ్వరూ గుర్తు పట్టరు.. పిల్లలకు పిల్లలు పుట్టి వుంటారు.. కొత్త భవనాలు వెలసి వుంటాయి.. కొత్త సంగీతాలు వినిపిస్తుంటాయి.. స్నేహితులు.. చుట్టాలు.. పుస్తకాలు.. ప్రేమ,పెళ్ళి... జీవితం ప్రసాదించిన అన్ని ...

నేటి మోటివేషన్... తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం

నాన్న మీ కాలంలో 1. ఇంత టెక్నాలజీ లేదు.. 2.విమానాలు లేవు.. 3.. ఇంటర్నెట్ లేదు.. 4.. TV లు లేవు.. 5.. కంప్యూటర్లు లేవు.. 6.. ఏసీ లు లేవు.. 7.. లగ్జరీ కార్ లు లేవు.. 8.. మొబైల్ ఫోన్ లు లేవు... మీరెలా బతికారు...   *దానికి ఆ తరము తండ్రిగారు ఇచ్చిన జవాబు అందరూ చదవ వలసిందే*...........   మీ తరము ఈరోజు కాలంలో ఎలాగైతే  1. ప్రార్ధన లేకుండా.. 2. మర్యాద లేకుండా  3. ప్లానింగ్ లేకుండా  4. క్రమశిక్షణ లేకుండా.. 5. పెద్దల ఎడ గౌరవం లేకుండా.. 6. మన చరిత్ర పై అవగాహన లేకుండా.. 7. కుటుంబ విలువలపై ఏ మాత్రం పట్టింపులు లేకుండా.. 8. Morals లేకుండా... ఎలాగైతే హాయిగా రోజులు గడిపేస్తున్నారో...  మేము వాటిని పాటిస్తూ ఆనందముగా జీవించాము... మేము మీలాగా...  1. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించలేదు.. 2. పాఠశాల వేళలు అయినా  తదుపరి చీకటి పడేదాకా ఆడుకున్నాము  TV లు చూడలేదు... 3. ఇంటర్నెట్ స్నేహితులతో కాక  నిజమైన స్నేహితులతో గడిపాము.. 4. దాహము వేస్తె కుళాయి నీరు తాగాము..  బాటిల్ నీరంటే ఏమిటో తెలియదు.. 5. ఒకేగ్లాస్ లో నలుగురం జ్యూస్ తాగినా  మాకెప్పుడూ జబ్బుల...

నేటి మోటివేషన్... జీవితం

ఒక తండ్రి తన కొడుకుకి రాసిన లేఖ  నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి. 1. జీవితం, అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు. 2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు. 3. నేను రాస్తున్నదంతా నేను జీవితంలో అనుభవించినవి. నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుందని. ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో 1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు. నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో. నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు. అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది. నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా ! 2. ఏ ఒకరూ తప్పనిసరి కాదు, తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు. ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా, నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయ...

నేటి మోటివేషన్... సమయస్ఫూర్తి

ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది. అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి, ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు. రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు. ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు.  అన్నీ పూర్తయ్యాక, రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు. ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు.  కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే రాజుకు కోపం వచ్చి...

నేటి మోటివేషన్... చాణక్యుడు నీతిశాస్త్రంలో చెప్పిన గొప్ప విషయాలు...

ఆచార్య చాణక్యుడు మనిషి ఎప్పటికీ మరచిపోకూడని కొన్ని విషయాలను నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. నేటికీ ఆచార్య చాణక్యుడి విధానాలు మనిషి జీవితాన్ని విజయవంతం చేసేందుకు ప్రేరణకల్పిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 🌿ఒత్తిడి లేకుండా జీవించడం ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి ఒత్తిడి లేకుండా జీవించేందుకు ప్రయత్నించాలి.  👉ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది, ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి సైతం ఒత్తిడి తలెత్తుతోంది. ఇటువంటి పరిస్థితులలో ఒత్తిడి లేకుండా ఉండటం ద్వారా మనిషి ప్రతి క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు.  👉ఎప్పుడూ తనను తాను నమ్ముకుంటే ఒత్తిడిని జయించవచ్చని ఆచార్య చాణక్య తెలిపారు. 🌿సమస్యలతో ధైర్యంగా పోరాడటం 👉చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి అన్ని ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి.  👉వైఫల్యం ఎదురైనప్పుడు నిరాశ చెందకూడదు. ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. ఇది ఖచ్చితంగా వ్యక్తికి విజయాన్ని అందిస్తుంది. 🌿పరధ్యానంగా ఉండవద్దు 👉మనిషి ఎప్పుడూ కూడా పరధ్యానంగా, నిరుత్సాహంతో, నిరాశ చెందుతూ ఉండకూడదు.  👉కష్టాలను ఎదుర్కోవా...

నేటి మోటివేషన్..... కోపం తెలివిని నశింపచేస్తుంది...

అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది… అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది. గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు. ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ “నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం” అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, “పందెం అంటే పందెం” అన్నారు. పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ ‘లాగు లాగు’ అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది. గోపయ్యకు తల తీసేసినట్లయింది. ‘ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?’ అని చికా...

నేటి మోటివేషన్... మోహమాటం

🌿మనిషికి ఉన్న అతి భయంకరమైన జబ్బుల్లో మోహమాటం అనేవది చాలా ప్రమాదకరమైనది. మీరు ఇవ్వటం వల్ల వచ్చే ఆనందంకన్నా, కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం ఎక్కువైతే మొహమాటం అంటారు.  👉కోల్పోయే దాని వల్ల వచ్చే విషాదం కన్నా, ఇచ్చే దాని వల్ల వచ్చే ఆనందం ఎక్కువగా ఉన్నపుడే మీరు ఇచ్చినదానికి మీకు తృప్తి, అర్థం ఉంటుంది.   🌿అవతలివారు మనతో ఎలా ఉంటే బాగుంటుందో మనం చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది చెప్పండీ! ఇతరుల దగ్గర మొహమాటం ఎక్కువై మీకు నచ్చని వాటికి కూడా  'నో' చెప్పకపోతే, మిమ్మల్ని వారు కొంత దూరం చేసుకోవచ్చు. కానీ 'యెస్' చెప్పడం వల్ల మీవి మీకు దూరం అవ్వకూడదు కదా! ఇతరుల కోరికలకీ, మన ఇబ్బందులకీ మధ్య సరైన గీత గీసుకోగలిగితే మనవసంబంధాలు బాగానే ఉంటాయి.  👉ఒకే  మనిషి అందరితో మంచి అనిపించుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఒకరకమైన మానసిక రోగమే నా దృష్టిలో. అందరూ మిమ్మల్ని మంచి అనుకోవాలంటే ఎలా?   🌿ప్రతిదానికి  మొహమాటం పడి వాళ్ళేమనుకుంటారో వీళ్లేమానుకుంటారో అని ఎదుటివారి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే నష్టపోయేది మీరే... అయినా  మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ నీ వైకల్యం గురిం...

నేటి మోటివేషన్... నాన్న చేసిన త్యాగాలు

ఒక రోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు.👨‍👦  కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోష పరచాలని నాన్న ఆలోచన.  .జాతరలో మంచి మంచి బొమ్మలు, వస్తువులు కొనుక్కుని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చడాని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన. పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న.  ఇంకా తనకి బొమ్మలు ఏవి కొనిపెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లాడు.  తన దగ్గర ఉన్న డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న.  పిల్లాడికి ఒక బొమ్మ నఛ్చి కొనిమ్మన్నాడు.  జేబులో ఉన్న డబ్బు చూసి , ఇంకొకటి కొందాం ,పద ముందుకు అన్నాడు నాన్న.  అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ , తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు.  పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్ని కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు.  నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది.  నాన్న తనకు అడిగిన వస్తువులు కొనివ్వడం లేదు. ఎందుకు తీసుకొచ్చినట్లు?  ఉన్న డబ్బు అంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో వస్త...

నేటి మోటివేషన్... మోటివేషన్ విభాగం లో ప్రధాన సూత్రాలు

🌴మంచి ఆలోచనా తీరు.. 🌴బద్దకం వదిలించండి. 🌴భయాన్ని జయించండి. 🌴మంచి మాట తీరు అలవరచుకోండి. 🌴అనుకుంటే సరిపోదు-- ఆచరించాలి. 🌴కొంచెం ఆలోచించండి.🍁 🍁 మంచి ఆలోచనా తీరు అంటే .🍁 🌿మనం చదివే పుస్తకాలే మన అలవాట్లకు, మన ఆలోచనలకు, మన కోరికలకు పునాదులు వేస్తాయి. 🌿ఆఫిల్ పండు కింద పడడం చూసిన న్యూటన్ భూమ్యాకర్షణ శక్తిని కనుగొన్నాడు.  🌿రైట్ బ్రదర్స్ విమానం కనుకున్నారన్నా,  గ్రహం బెల్ టెలిఫోన్ కనుకొన్నాడన్నా,  థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనుకున్నాడన్నా,  👉అందుకు వారి పూర్వజన్మసుకృతం కారణం కాదు, వారి ఆలోచనలే ఈ అద్భుతసృష్టికి కారణం. 🍁 బద్దకం వదిలించండి 🌿వాడని ఇనుము తుప్పుపడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది.  🌿బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. (వాఖ్య- లియోనార్డ్ డావింసీ). 🌿ఎప్పటి పని అప్పుడే చేయాలి.  🌿జీవితంలో ప్రతిపనిని దానికి నిర్డేశించిన సమయంలో చేసెయ్యాలి.  🌿రెండోఅవకాశం కొరకు వాయిదా వెయ్యద్దు. 🌿నీ జీవితం నీది. దానిని నీకు దేవుడు ఇచ్చాడు.  👉దానిని చెడగొట్టుకోవడం, బాగుచేసుకోవడం నీ ఇష్టం.  🌿చెడగొట్టుకుంటే దాని ఫలితం నువ్వే అనుభవించా...

నేటి మోటివేషన్... సింహం మాత్రమే అడవికి రాజు ఎందుకైంది

అడవిలో ఏ జంతువు అతి పెద్దది... ఏనుగు. అడవిలో ఏ జంతువు ఎత్తైనది... జిరాఫీ. అడవిలో ఏ జంతువు తెలివైనది... నక్క.  అడవిలో ఏ జంతువు వేగవంతమైనది...  చిరుత. ఈ అద్భుతమైన లక్షణాలేవీ సింహంలో లేవు.  అయినా అడవికి రాజెలా అయ్యింది?  సింహానికి తేజస్సు ఉంది సింహానికి ధైర్యం ఉంది సింహానికి సాహసం ఉంది సింహం దేనికీ భయపడదు సింహం సవాళ్లకు సిద్ధంగా ఉంటుంది సింహం ఆత్మవిశ్వాసంతో నడుస్తుంది తననెవరూ ఆపలేరని నమ్ముతుంది రిస్క్ లకు సిద్ధంగా ఉంటుంది వేటలో తన అవకాశాన్ని వదలదు సింహం నుండి మనం ఏమి నేర్చుకోవాలి? మీ కలలు నిజం కావడానికి, గొప్పగా ఎదగటానికి ఐశ్వర్యవంతులుగా పుట్టాల్సిన అవసరం లేదు వేగంగా ఉండవలసిన అవసరం లేదు  తెలివైనవారు కానవసరం లేదు మేధావి కానవసరం లేదు మీకు కావలసిందల్లా ధైర్యం  సాహసం ప్రయత్నించడానికి సంకల్పం అది సాధ్యమేనన్న విశ్వాసం ఆగకుండా , ఆపకుండా ప్రయత్నించడం..  చివరిగా... "శ్రమ నీ ఆయుధం అయితే  విజయం నీకు బానిస అవుతుంది". శ్రమ  విజయం  శ్రమయేవ విజయతే.🚶🚶🚶🚶🚶🚶 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

నేటి మోటివేషన్... ఆ పరిస్థితికి మాత్రం ఒక్కరోజు కూడా రాకూడదు

ఒక సింహం మేకను పిలిచి నా నోటినుండి ఏదైనా దుర్వాసన వస్తుందా చెప్పు అని అడిగింది  అవును   వాసన వస్తున్నది అని మేక చెప్పగానే  ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే ఇలా చెప్తావు అని చంపేసింది మేకను సింహం వెంటనే అక్కడే ఉన్న జింకను పిలిచి నువ్వు చెప్పు దుర్వాసన వస్తుందా అని అడిగింది సింహం జింక అస్సలు లేదు అని చెప్పడంతో  నా దగ్గరే అబద్ధం చెప్తావా అని జింకను చంపేసింది సింహం ఇదంతా గమనిస్తున్న నక్క ఇక తన వంతని తెలుసుకుంది నక్కను పిలిచింది సింహం  వాసన వస్తుందా లేదా అని అడగగానే నక్క  రాజా నాకు రెండ్రోజులుగా జలుబు చేసింది వాసన ఏవి రావడం లేదు  నా ముక్కు పసిగట్టలేకపోతుంది అని చెప్పింది సింహం సరే అని వదిలేసింది సమయానికి తగ్గట్టు సందర్భాన్ని బట్టి మాటలు ఉంటేనే మనం ఈలోకంలో బతకగలుగుతున్నాం ఇదే సింహం వయసులో ఉన్నప్పుడు ఇలా గంబీరంగా ఉంటుంది  ఎంత అడవికి రాజైనా సత్తా లేకపోతే చీమకు కూడా చులకన అయిపోతాం వేటాడే సత్తా తగ్గిపోయాక  ఒంట్లో పరిగెత్తే శక్తి లేక నీరసించి పోతుంది సింహం కొన్ని నెలలు ఆహారం లేక బక్కచిక్కిపోతుందు వేటకు వెళ్లడం మానేసి ఒక చోట ఉండిపోతుంది ఏవైనా జంతువులు తిని...