Skip to main content

కరెంట్ - అఫైర్స్ (తెలుగు మరియు ఇంగ్లీష్ లో) అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గురించి


📚ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం రెండో విడతలో భాగంగా వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేయనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మొత్తం 9 అంశాలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు.

📚వలస కార్మికులు, పట్టణ పేదలకు అందుబాటు అద్దెల్లో ఇళ్లను అందించేందుకు ప్రధామంత్రి ఆవాస్‌ యోజన కింద గృహ సముదాయాలను నిర్మించే పథకాన్ని అమలు చేస్తారు.

📚అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకు రూ.6వేల కోట్ల ప్రత్యామ్నాయ అటవీ పెంపకం పథకం (కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ- కంపా) నిధులతో ఉపాధి కల్పిస్తారు.

📚ఇప్పుడున్న 40 కార్మిక చట్టాలను ఒక్కటిగా చేసి కార్మిక స్మృతి (లేబర్‌ కోడ్‌) రూపంలో తీసుకొస్తున్నందువల్ల ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందుతుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇప్పటి వరకు 30% మంది మాత్రమే కనీస వేతన చట్ట పరిధిలో ఉండగా, ఇకపై  100% మందికి కనీస వేతనం అందుతుంది.

📚కనీస వేతనం విషయంలో ఉన్న ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి జాతీయ జీవన ప్రమాణ వేతనం (నేషనల్‌ ఫ్లోర్‌ వేజ్‌) విధానం  అమల్లోకి రానుంది.

 📚వచ్చే ఆగస్టుకల్లా ‘ఒకే దేశం- ఒకే రేషన్‌ కార్డు’ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దీనివల్ల దేశ వ్యాప్తంగా 67 కోట్ల మంది (83%) ప్రయోజనం పొందుతారు.

📚ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఎక్కడున్నవారు అక్కడ రేషన్‌ తీసుకొనే అవకాశం కల్పిస్తారు. 2021 మార్చికల్లా దీన్ని అమల్లోకి తెస్తారు.

📚దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.10 వేల చొప్పున రూ.5వేల కోట్ల మేర రుణాలు ఇవ్వనుంది.

                
📚పౌరులకు అవసరమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లోనే ఆరా తీసే అవకాశాన్ని తెలంగాణ పోలీసులు కల్పించారు.

 📚అదృశ్యమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారంతో పాటు వాహనాలకు సంబంధించి నిరభ్యంతర పత్రాన్ని ఆన్‌లైన్‌లోనే పొందే విధానాన్ని రూపొందించారు. ‘డిజిటల్‌ పోలీస్‌ సిటిజన్‌ సర్వీస్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ రెండు ఫీచర్లతో పౌరులకు ఠాణాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు సమయం ఆదా కానుంది.

 📚కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ నేరగణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా తెలంగాణ పోలీసులు తమ వెబ్‌సైట్‌లో పౌరసేవలకు సదుపాయం కల్పించారు.

📚'కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం' హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణ_ : Muthyumpeta village, Mallial mandal, Jagitial district.

 📚యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకలోని చేనేత మగ్గాలపై తయారయ్యే తేలియా రుమాలు కు జియోగ్రాఫికల్‌ ఇండెక్స్‌(జీఐ) గుర్తింపు లభించింది.

 📚2017లో జాతీయ హస్తకళల పురస్కార గ్రహీత, పద్మశ్రీ గజం గోవర్ధన పుట్టపాక చేనేత క్లస్టర్‌ పేరిట జీఐ ట్యాగు కోసం దరఖాస్తు చేశారు.

 📚2012లో పోచంపల్లి పట్టు చీర జీఐ గుర్తింపును సాధించింది.

 📚కొవిడ్‌-19 దుష్ఫలితాలు బాలలుపై అధికంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

 📚తల్లిదండ్రుల ఆదాయం తగ్గి వైద్యం, పోషకాహారం అందక పిల్లలు మృతిచెందే ప్రమాదముందని హెచ్చరించింది.

 📚ఐరాస సెక్రటరీ జనరల్‌ - _ఆంటోనియో గుటెర్రస్‌

                     

👨‍👩‍👧‍👧 International Day of Families – May 15th

👨‍👩‍👧‍👧 Theme 2020 - _“Families in Development : Copenhagen & Beijing + 25”

👨‍👩‍👧‍👧 International Day of Families reflects the importance the international community attaches to families and their role in development.

👨‍👩‍👧‍👧 The Day was proclaimed by the UN General Assembly in 1993 with resolution
A/RES/47/237 and reflects the importance the international community attaches to families.

👨‍👩‍👧‍👧 The International Day provides an opportunity to promote awareness of issues relating to families and to increase knowledge of the social, economic and demographic processes affecting families.

🏦 In wake of the COVID-19 pandemic, the World Bank has announced $1 billion social protection package for India.

🏦 The $1 billion social protection package for India has taken the total commitment from the World Bank towards emergency COVID-19 response in India to $2 billion.

🏦 President of World Bank : _David Malpass._
*HQ : _Washington DC._

🌾 Rice Export Promotion Forum (REPF) has been set up by the Government of India to provide stimulus to the rice exports.

🌾 The Rice Export Promotion Forum has been set up under the aegis of the Agricultural and Processed Foods Export Promotion Development Authority  (APEDA).


🏹లక్ష్య🇮🇳ఫౌండేషన్🤝

Comments

Popular posts

క్యాలిక్యులేటర్ లో ఉండే ఈ GT, MU, M+, M-, MRC బటన్ల అర్థాలు, ఎందుకు వాడుతారో తెలుసా..?

ఇప్పుడంటే అన్నీ కంప్యూటర్ మయం అయిపోయాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ లేకుండా క్షణం గడవదు. ప్రతీ దానికి యాప్ లు వచ్చేసాయి. ఇప్పుడంటే మనం సులభం గా పెద్ద పెద్ద అమౌంట్స్ కూడిక వెయ్యటానికి కాలిక్యులేటర్ యాప్ లను వాడుతున్నాం. అయితే ఫిజికల్ కాలిక్యులేటర్ వాడకం మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ షాపుల్లో, ఆఫీసుల్లో అకౌంట్స్ సెక్షన్స్ లో దీని అవసరం ఉంటూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాలిక్యులేటర్ ను సరిగా చూసినట్లయితే అందులో కొన్ని ప్రత్యేకమైన బటన్స్ ఉంటాయి. GT, MU, M+, M-, MRC ఇలా కొన్ని స్పెషల్ బటన్లు ఉంటాయి. కాలిక్యులేటర్ ను వాడే చాలా మందికి అవేంటో ఎందుకు వాడతారో తెలియదనే చెప్పాలి. అసలు ఆ బటన్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందామా... 1. GT - గ్రాండ్ టోటల్ (Grand Total) GT బటన్ మీకు గ్రాండ్ టోటల్ ను చెప్తుంది. అంటే ఉదాహరణకు 4 × 2 = 8 అని ఒక గుణకారాన్ని వేసుకుని తరువాత 7 × 6 = 42 అనే వేరే లెక్కను వేసారనుకోండి. ఇప్పుడు GT అనే బటన్ ప్రెస్ చేస్తే మీకు టోటల్ 50 (08 + 42 = 50) అనే ఆన్సర్ వస్తుంది. సో ఇది పెద్ద పెద్ద మొత్తాలలో లెక్కలు చేసినప్పుడు ఈజీ గా గ్రాండ్ టోటల్ తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఒకసారి ట్రై చ...

నేటి ఆరోగ్యం... థైరాయిడ్ & హైపోథైరాయిడ్ మధ్య తేడా

థైరాయిడ్ మన మెడలో ఉన్న చిన్న గ్రంధి. ఇది శరీరంలో మెటబాలిజం, బరువు, శక్తి, హృదయ స్పందనలు, శరీర ఉష్ణోగ్రత మొదలైన వాటిని నియంత్రించే థైరాక్సిన్ (T4), ట్రైఐయోడోథైరోనిన్ (T3) అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. అంటే థైరాయిడ్ అనేది గ్రంధి పేరు. హైపోథైరాయిడ్ థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అవ్వడం. దీనిని Hypothyroidism అంటారు. ఇది ఒక వ్యాధి స్థితి. 👉 కాబట్టి థైరాయిడ్ = గ్రంధి, హైపోథైరాయిడ్ = వ్యాధి అని గుర్తుంచుకోవాలి. 🩺 హైపోథైరాయిడ్ లక్షణాలు అలసట, బలహీనత బరువు పెరగడం మలబద్ధకం చల్లదనం ఎక్కువగా అనిపించడం జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం మానసికంగా డిప్రెషన్, దృష్టి కేంద్రీకరించలేకపోవడం. 🌿 *ఆయుర్వేద ఫార్మసీలో దొరికే మందులు 1. Kanchanar Guggulu – థైరాయిడ్ గడ్డలు, హార్మోన్ అసమతుల్యతకు. 2. Ashwagandha Churna / Tablets  – గ్రంధి పనితీరును సమతుల్యం చేస్తుంది. 3. Punarnava Mandur – వాపులు, మెటబాలిజం సమస్యలకు. 4. Trikatu Churna (మిరియాలు, శొంఠి, పిప్పలి) – జీర్ణక్రియ, థైరాయిడ్ హార్మోన్ యాక్టివిటీ పెంచుతుంది. 5. Varunadi Kashayam – గ్రంధుల వాపు, మలబద్ధకం, మెటబాలిజం స...

📢 AP Government Recruitment Notification దివ్యాంగుల కమిషనర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కీలక నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలో దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు మరియు సేవల పర్యవేక్షణ కోసం “State Commissioner for Persons with Disabilities” పోస్టును భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 🔹 పోస్టు పేరు State Commissioner for Persons with Disabilities (దివ్యాంగుల కమిషనర్) 🔹 శాఖ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 📅 దరఖాస్తుల చివరి తేదీ 15 జూన్ 2026 🌐 దరఖాస్తు విధానం అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన స్వీయ ధృవీకరించిన (Self-Attested) పత్రాలను అప్లోడ్ చేయడం తప్పనిసరి. 🔗 అధికారిక వెబ్‌సైట్: [ www.wcdsc.ap.gov.in ]( http://www.wcdsc.ap.gov.in ) ⚠️ ముఖ్య సూచనలు ▪️ ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు ▪️ అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడే అవకాశం ఉంది ▪️ Self-Attested పత్రాలు జత చేయని దరఖాస్తులు పరిగణనలోకి తీసు...