ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి. ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి... తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు.. ' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే... నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి. అలా...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...