ఈ క్షణం మరుక్షణంతో ఆక్రమించేయబడుతుంది… అలాగని అది తన ఉనికిని కోల్పోదు… ఓ ఆలోచనో, భావనో, నిర్ణయమో మరుసటి క్షణానికి మోసుకెళ్లడం ద్వారా అది సజీవంగానే ఉంటుంది.. సంవత్సరాల ప్రమాణంలో జీవితాన్నీ, వయస్సునీ కొలవడం మానేసి క్షణాల మెజర్‌మెంట్‌లో పరిగణనలోకి తీసుకుంటే జీవిత గమనంపై పూర్తి నియంత్రణ మనకు దక్కుతుంది. ఈ క్షణాన్ని భారంగా మార్చేసిన గతించిన క్షణాలూ.. రాబోయే క్షణాల్ని కబళించే ఈ క్షణపు ఆలోచనలూ… ఈ ఘర్షణలో శుష్కించిపోతున్న ప్రస్తుత క్షణపు నిస్సహాయతా… ఇదే మనం అనుకుంటున్న వందేళ్ల జీవితం 🙂 జీవితాన్ని అర్థం చేసుకోవడానికీ… సరిచేసుకోవడానికీ స్థూల (macro level) దృష్టే కాదు… కొన్ని సందర్భాల్లో సూక్ష్మ (micro level) దృష్టీ చాలా అవసరం.. "ఆ ఏముందిలే.." అని దులపరించుకుని వేరే ఆలోచనలోకి వెళ్లిపోయిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా మన "ఈ క్షణాన్ని" ప్రభావితం చేస్తున్నాయని ఒక్కోసారి గ్రహింపుకీ వస్తుంది…. అలా అన్పించినప్పుడు "ఆలోచించలేకపోయానే" అనే ఓ చిన్న గిల్టీఫీల్‌తో సాగిపోతాం తప్ప అక్కడైనా ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి తీరిక చేసుకోం. ఇప్పుడు లైఫ్ అంటే 50 ఏళ్లల్లో సాధించాల్సినవన్నీ ఇరవై...
ఆసరా లేదని అక్షరం... డబ్బు లేదని ఊపిరి ఆగకూడదు... ఇదే లక్ష్య స్వచ్చంద సేవా సంస్థ యొక్క విధానం...నినాదం...