Skip to main content

Posts

2024 యొక్క ముఖ్యమైన అవార్డులు

 ☞ చంద్రశేఖరేంద్ర సరస్వతి అవార్డు  - ఎస్ జైశంకర్   ☞ సాహిత్యంలో నోబెల్ బహుమతి - హాన్ కాంగ్.   ☞బుకర్ ప్రైజ్ - సమంతా హార్వే (ఆర్బిటల్ కోసం)  ☞FIFA బెస్ట్ ప్లేయర్ - లియోనెల్ మెస్సీ (పురుషులు), ఐతానా బోనమతి (మహిళలు)  ☞ఒలింపిక్ ఆర్డర్ - ఇమ్మాన్యుయేల్ మాక్రాన్  ☞Ballon d'Or - రోడ్రి (పురుషులు), ఐతానా బోనమతి (మహిళలు)   ☞లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ - నోవాక్ జొకోవిచ్ మరియు ఐతానా బోనమతి  ☞ వ్యాస్ సమ్మాన్ 2024 - సూర్యబాల 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺
Recent posts

భారతదేశంలోని 13 ప్రధాన ఓడరేవులు

1.కోల్‌కతా పోర్ట్    పశ్చిమ బెంగాల్   2. పారాదీప్ పోర్ట్    ఒడిశా   3.విశాఖపట్నం పోర్టు    ఆంధ్రప్రదేశ్   4.కామరాజర్ పోర్ట్    తమిళనాడ   5.చెన్నై పోర్ట్    తమిళనాడు  6. ట్యూటికోరిన్ పోర్ట్    తమిళనాడు  7.కొచ్చిన్ పోర్ట్    కేరళ  8.న్యూ మంగళూరు పోర్ట్    కర్ణాటక   9.మోర్ముగో ఓడరేవు    గోవా  10.ముంబయి పోర్ట్    మహారాష్ట్ర  11.జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్    మహారాష్ట్ర  12.కాండ్లా పోర్ట్    గుజరాత్   13.పోర్ట్ బ్లెయిర్ పోర్ట్   అండమాన్ మరియు నికోబార్ దీవులు 🤝🤝🤝 🏹Lakshya🇮🇳Charitable📚Society🩺

📰వార్తాపత్రిక మరియు దాని వ్యవస్థాపకులు

 Q1. బెంగాల్ గెజిట్ 1780 (కోల్‌కతా) వ్యవస్థాపకుడు?   జవాబు. జేమ్స్ ఆగస్టమ్ హికీ  Q.2. సమాచార్ దర్పణ్ 1818 (కలకత్తా) స్థాపకుడు?    జవాబు. జె. సి. మార్ష్‌మన్   Q3. హిందూ పేట్రియాట్ 1853 (కలకత్తా) స్థాపకుడు?    జవాబు. గిరీశ్చంద్ర ఘోష్  Q_4. సోమ్ ప్రకాష్ 1859 (కలకత్తా) వ్యవస్థాపకుడు?    జవాబు. ద్వారకానాథ్ విద్యాభూషణ్  Q5. ఇండియన్ మిర్రర్ 1861 (కలకత్తా) వ్యవస్థాపకుడు?    జవాబు. దేవేంద్రనాథ్ ఠాగూర్   Q6. అమృత్ బజార్ 1868 (కలకత్తా) స్థాపకుడు?   జవాబు. మోతీలాల్ / శిశిర్ ఘోష్  Q7. ది హిందూ 1878 (మద్రాస్) వ్యవస్థాపకుడు?   జవాబు. వీర్ రాఘవాచారి  Q.8. కేసరి 1881 (బాంబే) వ్యవస్థాపకుడు? జవాబు బాలగంగాధర తిలక్  Q9. భారతదేశ స్థాపకుడు 1890 (బాంబే)?  జవాబు. దాదాభాయ్ నౌరాజీ  Q10. ది ఇండియన్ రివ్యూ 1900 (మద్రాస్) వ్యవస్థాపకుడు?   జవాబు. ఎ. దేశo   Q.11. ఇండియన్ ఒపీనియన్ 1903 (దక్షిణాఫ్రికా) వ్యవస్థాపకుడు?    జవాబు. మహాత్మా గాంధీ  Q_12. ...

నేటి ఆరోగ్య సూత్ర.... రేల చెట్టు ఉపయోగాలు...

మెట్ట ప్రాంతాల‌లో, కొండ‌లు, గుట్ట‌ల‌పై, రోడ్డుకు ఇరు ప‌క్క‌లా ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లో రేల చెట్టు కూడా ఒక‌టి.  దీనిని చాలా మంది చూసే ఉంటారు.  ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది.  మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  రేల చెట్టు లో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  రేల చెట్టు క‌షాయం చేదుగా ఉండి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది.  మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో ఈ చెట్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.  చ‌ర్మ రోగాల‌ను, క‌ఫ రోగాల‌ను, క్రిమి రోగాల‌ను, విషాన్ని హ‌రించ‌డంలో కూడా ఈ చెట్టు స‌హాయ‌ప‌డుతుంది. రేల చెట్టు బెర‌డును దంచి దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా తాగుతూ ఉంటే మూత్రం నుండి ర‌క్తం ప‌డ‌డం త‌గ్గుతుంది.  రేల చెట్టు  పువ్వుల‌ను ఇత‌ర దినుసుల‌తో క‌లిపి ప‌చ్చ‌డిగా కూడా చేసుకుని తిన‌వ‌చ్చు.  ఈ ప‌చ్చ‌డి ఎంతో రుచిగా ఉంటుంది.  జ్వ‌రం త‌గ్గిన వారు ప‌థ్యంగా...

తెలుసుకుందాం... రోజుకో కొత్త విషయం...

🔴రహదారులపై వాహనాల డ్రైవర్లు మత్తు పానీయాలు తీసుకున్నారని కనిపెట్టే బ్రీత్‌ ఎనలైజర్‌ ఎలా పనిచేస్తుంది? ✳వాహనాలను నడిపేవారు తాగి ఉన్నారో లేదో తెలుసుకోడానికి పోలీసులు ఉపయోగించే 'బ్రీత్‌ ఎనలైజర్‌' పేరుకు తగినట్టుగానే శ్వాసను విశ్లేషించడం ద్వారా పనిచేస్తుంది.ఒక వ్యక్తి మత్తుపానీయం సేవిస్తే అది అతని రక్తంలో కొంత శాతం కలుస్తుంది. ఆ రక్తం ఊపిరితిత్తులకు సరఫరా అయినపుడు అందులోని మత్తు పానీయం కొంత ఆవిరయి ఊపిరిలో కలుస్తుంది. రక్తంలో ఎంత ఎక్కువ మత్తుపానీయం కలిస్తే అంత ఎక్కువగా శ్వాసలో దాని ప్రభావం ఉంటుంది. అందువల్లే తాగిన వ్యక్తి దగ్గర వాసన వస్తుంది. బ్రీత్‌ ఎనలైజర్‌లోని ఒక గొట్టం వ్యక్తి శ్వాసను పీల్చుకుంటుంది. పరికరంలో ఉండే ప్లాటినం ఏనోడ్‌ (విద్యుత్‌ ధ్రువం), వ్యక్తి శ్వాసలోని మత్తు పానీయాన్ని ఆక్సీకరించి ఎసిటిక్‌ యాసిడ్‌గా మారుస్తుంది. ఈ యాసిడ్‌లోని అణువులు కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోవడంతో విద్యుత్‌ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్‌ ప్రవాహం తీవ్రత ఎక్కువగా ఉంటే పరికరంలో ఎర్ర బల్బు, తక్కువగా ఉంటే ఆకుపచ్చ బల్బు వెలుగుతాయి. దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత మేర మద్యం పుచ్చుకున్నాడో తెలుస్తుంది...

సివిల్స్ మీ లక్ష్యం అయితే... ఈ పోస్ట్ మీకోసమే... అసలు మిస్ చేసుకోవద్దు...

ఛాలెంజ్  .... సంకల్పశక్తి వల్ల మనం మారతాం అనేదే నిజమైతే... ఇది చదివి ఎందరు గ్రాడ్యుయేట్స్ అమ్మాయిలు మారతారో చూద్దాం...  "తెలుగువారి 19-20-21 సంవత్సరాల వయసున్న గ్రాడ్యుయేషన్ అమ్మాయిలకు నా సవాల్"... 57 వసంతాల వయసులో నేనొక అగ్నిప్రవాహం... 42 సంవత్సరాల క్రితం... 10 వ తరగతిలో... 72.6% మార్కులు తెచ్చుకున్న ఓ సాధారణ IRS అధికారిని నేను... నేటి తరంలో... 10 వ తరగతిలో 90 - 95% పైబడి మార్కులు తెచ్చుకుని... ప్రస్తుతం డిగ్రీ ఆఖరిలో ఉన్న అమ్మాయిలకు నా సవాల్/ఛాలెంజ్... Super30 IAS వేధికనుంచి 30 out of 30 IAS లు లక్షశాతం తేవడానికి నేను సిద్ధం... 30 out of 30 IAS లు తెచ్చేవరకూ విశ్రమించేదే లేదు... మనసుకి నిద్రే ఉండదు... నిత్యం వికశించడమే... ఆ 30 లో నీవు ఉండడానికి సిద్ధమా...??? నా ఆలోచన ఓ శక్తివంతమైన ఆయుధం... నా plan of action to crack lakh% IAS ఒక మేధసముద్రం... నీది..? మీది..? యుక్తవయస్సులో ఉండి, 10th లో 90% plus మార్కులు తెచ్చుకున్న నీ బలం, Inter లో 90% పైబడి తెచ్చుకున్న నీ మార్కులు నిజమే అయితే............. software/ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థల్లో గుమస్తాగా బ్రతికేంత బలహీనత నీకు ఎవరు నూరిపోశార...

నేటి మోటివేషన్... ప్రాణస్నేహితులు

సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు, కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృ హరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతః కాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది. స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుత మైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టు వులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడ గలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు. స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజా యతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహ సౌధానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావా లుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధార ణమే. కానీ దాన్ని జీవిత...