శుభోదయం మిత్రులందరికీ .....!!
మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారో ఆ లక్ష్యం మిమ్మల్ని పరీక్షిస్తుంది.మీరు నిజంగా ఎదైనా సాధించాలని అనుకుంటుంటే,మీరు చరిత్రను తిరగేసి చూడండి, సాధించిన వారు ఎవరు కూడా కేవలం ఇంట్రెస్ట్ వల్ల సాధించిన వాళ్ళు ఎవరు లేరు. నిబద్ధతో సాధించినవారే ఎక్కువ.నువ్వు ఎ లక్ష్యం కోసం ముందుకు వెళ్తున్నావో వెళ్ళే దారిలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి ,ఎన్నో ఆటంకాలు వస్తాయి,ఎన్నో సమస్యలు వస్తాయి.ఇవన్ని నీ లక్ష్యం నీకు పెడుతున్న పరిక్షలు .ఆ పరీక్షలో ఆగిపోతవా ,ఎదురుకుని ముందుకుపోతవా..!
మీరు ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం వైపే మీ అడుగులు వేయండి .మీరు మీ జీవితంలో ఎన్ని పరిక్షలు ఎదురుకుంటే అంత మంచి
భవిష్యతును పొందగలరని గుర్తుపెట్టుకోండి.ఒకసారి ఫెయిల్ అవ్వు తప్పు లేదు,మరలా ప్రయత్నం చేయి,మరలా ఫెయిల్ అయ్యావా అవ్వు నువ్వు ఫెయిల్ అయిన ప్రతిసారి నీకు ఒక అనుభవం వస్తుంది.
ఒక థామస్ అల్వ ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టడానికి 1000 సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు కానీ ఆయన పట్టుదలను వదులుకోలేదు .1001 సారి ప్రయత్నం చేసాడు సాధించాడు.అయ్యో నేను ఫెయిల్ అయ్యానే అని వదిలేసి ఉంటె మనం ఈ చీకటి సామ్రాజ్యం లో ఉండేవాళ్ళం.చూసారా మిత్రులారా ఒక వెయ్యి సార్లు ఫెయిల్యూర్,సక్సెస్ కి దారి చూపింది.
మీరు వెళ్తున్న దారిలో ఎన్నో ముళ్ళ కంచెలు ఉండవచ్చు.ముందుకు నడవండి ముళ్ళు గుచ్చుకుంటే కొన్ని రోజుల వరకు నొప్పులు ఉండవచ్చు.అమ్మో ముళ్ళు ఉన్నాయి వెళ్ళలేను,నడవలేను అంటే నీ బంగారు జీవితాన్ని ,భవిష్యత్తును నువ్వు చూడలేవు.
కష్టపడకుండా ఏది రాదని గుర్తుంచుకోండి మిత్రులారా..!
Comments
Post a Comment